Sem: Degree 6th Sem
Lesson: 10 – అనువాదం
State: Telangana
సాహిత్యానికి సృజన మరియు అనువాదం రెండు కూడా రెండు కళ్ళ వంటివి. అనువాదం ద్వారానే భాష పరిపూర్ణమవుతుంది. మన భారతదేశంలో వేరువేరు సంస్కృతులు ఉండుటవలన అనువాదం అనేది భావ సమైక్యతకు దారితీసింది. భారతీయ సాహిత్యం అనువాదంతోనే ముడిపడి ఉన్నది. ఎన్నో వేద గ్రంధాలు కూడా సంస్కృతం నుండే భారతీయ అన్ని భాషలలోకి అనువదింపబడ్డాయి. ఇది భారతీయ సంస్కృతి సమైక్యతకు ఉదాహరణలు అని చెప్పవచ్చు. ఎన్నో సంస్కృతుల మధ్య అనువాదం ఒక సమైక్య భావాన్ని నిలిపినది. ఈ సమైక్యత స్ఫూర్తికి మూలం అనువాదమే అని గుర్తించగలిగితే అదే అనువాదం యొక్క ప్రధాన్యం మరియు విశిష్టత.
ANUVADHAM Youtube Explanation Video- CLICK HERE
నిర్వచనాలు:
రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నాడు – ‘అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోనికి మార్చడం’. శబ్ద రత్నాకరం – ‘ఒకరు చెప్పిన దాన్ని మరలా చెప్పడం’. అంటే అదే అభిప్రాయాన్ని ఆంధ్ర దీపిక ఆంధ్ర వాచెస్ పద్యము అంగీకరించాయి నిఘంటువులు కూడా ఒక భాషలో ఉన్న దానిని మరియొక భాషలో రచించుట అని నిర్వచించాయి అనుమానానికి అను భాష అనుప్తము భాషాంతరీకరణము అనూస్ సృజన అనుసరణ అనే పర్యాయపదాలు ఉన్నాయి చలనచిత్రాలలో దీనిని డబ్బింగ్ అని అంటారు.
అనువాదం ఏ భాష నుండి చేస్తున్నామో దానిని చేస్తున్నామో దానిని మూల భాష అని అంటారు. ఏ భాషలోనికి అనువదిస్తున్నామో దానిని లక్ష్య భాష అని అంటారు. మూల భాష నుండి లక్ష్య భాషలోనికి అనువదించేటప్పుడు స్వభావం కారణంగా సాంప్రదాయ కారణంగా మతాచారాల కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. అదేవిధంగా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు కూడా లక్ష భాషలో ఉండవు. ఈ సూత్రాలు అనువాదకులకు తెలిసి ఉండాలి.
అనువాద రకాలు:
అనువాదం ప్రధానంగా రెండు రకాలు.
1. సాహిత్య అనువాదం
2. సాహిత్యేర అనువాదం
అనువాద ప్రక్రియ దశలు:
మొదటి దశ:
ఈ మొదటి దశలో మూలాన్ని బాగా అర్థం చేసుకొని మూల భాషలోని సౌందర్యం చమత్కారం సంస్కృతి సాంప్రదాయాలు బాగా తెలుసుకొని ఉండాలి. అనువాదం చేసేది సాహిత్య సంబంధమైతే అందులో తగిన పరిజ్ఞానం ఉండి తీరాలి.
రెండవ దశ:
ఈ రెండవ దశలో సాహిత్య అనువాదం ఏ కవితా శాఖకు సంబంధించిందో గ్రహించి దాని మూలాల్లో ఉన్న ప్రక్రియల చేయాలా లేక మరొక ప్రక్రియలోకి అనువదించాలని నిర్ధారించుకోవాలి.
మూడవ దశ:
మూల రచనలోని పదాలు, పదబంధాలు మొదలైన వాటికి లక్ష్య భాషలో సమానార్థకాలను నిర్ణయించడం ఈ దశలో జరుగుతుంది. మూల విదేయానువాదంలో ఇది ముఖ్యమైన అంశము. సాహిత్యేతర అనువాదమైతే ప్రాథమిక సాంకేతిక విషయాలలో సమానార్థక పదాలు ముఖ్యము. పదాలర్థంలో కొంచెం కూడా బేధము ఉండకూడదు. సమానార్థక పదాలు లేకపోతే లిప్యంతీకరణ చేసుకోవచ్చు లేదా క్రొత్త పదాలైనా సరే అవసరాన్ని బట్టి సృజించవచ్చు. పొరుగు భాషల్లో పదసృష్టికి అనుసరించిన విధానాలు తెలుసుకొని పద సృష్టి చేయాలి.
నాలుగవ దశ:
మూల రచనకు మూల రచయితకు న్యాయం జరిగే విధంగా అనువాదం ఉండాలి. అనువాదకుని ప్రజ్ఞ పాటవాల కంటే మూల రచయిత గొప్పతనం అనువాదంలో వెళ్లడవ్వాలి. అప్పుడే అనువాదం బాగుంటుంది. ఈ దశలో లక్ష్య భాషలోని పదప్రయోగ ఔచిత్యం విశిష్టత అనువాదకుడు చూపించాలి. శాస్త్ర సాంకేతిక విషయాల్లో నిర్దోషిత ప్రామాణికత పాటించాలి. అనువాదకునికి అనుభవం చాలా ప్రాముఖ్యము.
ఇతర భాషలో మనకు తెలిసి ఉండి ఆ భాషలలో ఉన్న రచనలను చదివినప్పుడు మనకు అవి బాగా అనిపిస్తే వాటిని మన భాషలో ఉన్న వారికి పరిచయం చేయడానికి అనువాదం ఉపయోగపడుతుంది. సజుదే పాలన్ అనే మలయాళ రచయిత ఒక కవిత రాస్తే దానిని ఆంగ్లంలోకి అనువదించారు.
దానిని తెలుగులోనికి ఆంగ్లం నుండి అనువదించారు. అదేంటంటే –
ఆంగ్లంలో – Did I tell you how I thought birds will come to me and tell their secret. Cows their story.
తెలుగులో – నేనెలా ఆలోచించాను నీకు ఏమైనా చెప్పానా? పక్షులు నాకోసం వచ్చి వాటి రహస్యాలు చెబుతాయి. ఆవులు వాటి కథల్ని.
ఇలాంటి అనువాదాలు చదివినప్పుడు ముందు మూలాన్ని తరువాత తెలుగు అనువాదాన్ని పరిశీలిస్తే అనువాదం బాగా చేయవచ్చు. మూలంలోని భావం చెడిపోకుండా అనువాదం చేయడం ఒక పద్ధతి. మూలాన్ని ఆధారంగా చేసుకుని లక్ష భాషలోనికి మారిస్తే అది భాషనువాదం అవుతుంది.
తెలుగులో ఉన్న విద్యుద్దీకరణ, ప్రైవేటీకరణ వంటి పదాలు అనువాద కారణంగానే వచ్చాయి. అనువాదం వలన లక్ష భాష అభివృద్ధి చెందుతుందని పై ఉదాహరణ వలన చెప్పవచ్చును. Non-Aligned అనే పదానికి అలైన్ అను పదం ఖాయమయ్యింది. అనువాదాల వలన కొత్త భావనాలు వస్తూ ఉంటాయి.
అనువాద సమస్యలు:
అనువాదం చేయునప్పుడు కచ్చితంగా అనువాద దోషములను ఎదుర్కొనక తప్పదు. వీటిని నాలుగు భాగాలుగా విభజిస్తే –
1. ఇంగ్లీషులోని భావం అర్థమయ్యే తెలుగులో దానిని ఎలా చెప్పాలో తెలియకపోవడం.
2. ఇంగ్లీష్ లోని పదానికి అనేక అర్థాలు ఉంటే ఏ అర్థం గ్రహించాలో తెలియకపోవడం.
3. ఇంగ్లీష్ వాక్యం అర్థమైనా ఆ వాక్యం దీర్ఘంగా క్లిష్టంగా ఉంటే దాని కర్తలు కర్మలు ఉపవాక్యాలు అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయడం.
4. ఇంగ్లీషులోని పదాలు సుడికారాలు అర్థమయినా వాటికి తెలుగులో సమానార్థకాలు లేకపోవడం.
తెలుగులో పదాలు మారుతున్న భావం మాత్రం వ్యక్తం అవ్వాలి.అందుకు ప్రయత్నాలు చేయాలి. అందరూ అవసరానికి పలు భాషలు నేర్చుకుంటున్నారు. పౌరులు బహు భాషలను బహు సంస్కృతులను అర్థం చేసుకోవాలి. అందుకు అనువాదం సాయపడుతుంది. అనువాదకుడు కొత్త పదాలను సృష్టించాలని ఇతర భాషల నుండి కూడా పదాలను స్వీకరించాలి. అని శాస్త్ర విషయాలు చెప్పడానికి సమర్థంగా భాష అభివృద్ధి చెందాలని రామచంద్ర రెడ్డి గారు వివరించారు. ‘అనువాదం చేయాలని నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్’ అను పేరుతో భారతీయ భాషలో అన్ని గ్రంథాలను అనువాదం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు.
0 Comments