Lesson: 13.పరికల్పన
ఏదైనా ఒక అంశం పైన గానీ లేదా ఒక విషయం గురించి మనం పరిశోధన చేయాలనుకున్నప్పుడు మొదటిగా దానికి సంబంధించిన ఆలోచన అనేది మనసులో ప్రారంభమవుతుంది. దానినే మనము పరికల్పన అని అనవచ్చును. లేదా ఆ ఆలోచనను పర్యాయపదముగా ఊహా అని కూడా అనవచ్చును. దీనిని ఆంగ్ల భాషలో HYPOTHESIS (హైపోతిసిస్) అని అంటారు. ఈ పదము గ్రీకు భాష నుండి పుట్టింది. దీనికి గ్రీకు భాషలో ఊహించడం అని అర్థము. ఊహకు పూర్వకల్పన , పరికల్పన, నిగమనం అనే అర్థాలు ఉన్నాయి. తెలుగు భాషలో మనము పరికల్పన అని అంటున్నా… మూల భాషలో మాత్రం పరికల్పనకు ఊహించడమనే అర్థము ఉన్నది.
PARIKALPANA Youtube Video Explanation – CLICK HERE
ఊహ ప్రతిపాదన అంటే – ఒకరు ఒక పనిని ఒక విధంగా చేస్తే.. అదే పనిని మరొక విధంగా చేయకూడదా? అని అనుకోవడమే ఊహ ప్రతిపాదన. ముందుగా మనసులో ఆలోచన వచ్తచింది. తరువాత పరిశోధన ప్రారంభమైంది. పరిశోధన తర్వాత కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ అభిప్రాయాలు అనుసరించినప్పుడు అవి నిజమైనవో కావో తేలిపోతాయి.
పరికల్పన చేసే క్రమంలో ముఖ్యముగా నాలుగు జాగ్రత్తలు తీసుకొనవలయును.
1. ఉపయోగం కావు అనిపించే అభిప్రాయాలను విడిచి పెట్టాలి.
2. ఉన్న వాస్తవికతకు సరికొత్త ఆలోచనలు జత చేయడంలో తెలివితేటలు ప్రదర్శించాలి.
3. భావాలను విమర్శనాత్మకంగా పరిశీలించాలి.
4. తప్పులను సరిదిద్దుకుంటూ ఊహ ప్రతిపాదనలు లేదా పరికల్పన తయారు చేసుకోవాలి.
ఈ ఊహ ప్రతిపాదనలు మూడు రకాలుగా ఉంటాయి.
1.అక్లిష్టం
2. సంకీర్ణం
3. బహులార్థకం
1.అక్లిష్టం – అక్లిష్టమనేది ఒకే పాయింట్ పై లేదా సూత్రంపై నిలబడి ముక్కుసూటిగా వెళుతుంది.
2. సంకీర్ణం – సంకీర్ణం అనేది మొదటి దానికి కొనసాగింపుగా ఉంటుంది. ఉదాహరణకు: గతంలో ఎవరైనా ఒకరు చేసిన పరిశోధన లేదా పరిశీలన ఆధారంగా వారు ఎక్కడైతే నిలిపివేశారో అక్కడ నుండే ఈ పరిశీలన అనేది ముందుకు సాగుతుంది. అవి శాస్త్రీయ సిద్ధాంతాలతో తృప్తికరంగా ఉండవచ్చును ఉండకపోవచ్చును. పరికల్పన అనగా అది సాధ్యం అయ్యేదో కాదో అను ఒక ఊహగా ఉంటుంది. ఈ కోణంలో చూస్తే పరికల్పన అనేది ఒక ఆలోచన మాత్రమే. మనం ఒక విషయం పట్ల అనేక కోణాలలో అది సాధ్యమైనా సాధ్యం కాకపోయినా సరే పరిశోధన చేయడమే పరికల్పన.
పరికల్పన అనునది పరిశోధన చేయడానికి ఒక విధాన ప్రక్రియనే. విశ్లేషణ ద్వారా పరికల్పన ప్రామాణికతను ధ్రువీకరించాలి లేదా త్రునికరించాలి. దాని వలన సామాజిక, సాంకేతిక, ఆర్థిక, శాస్త్రీయ రంగాలకు చెందిన పరిశోధనలలో పరికల్పన అనేది ప్రథమమైన స్థానంలో నిలుస్తుంది. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన పనిని పరికల్పన చేసేటప్పుడు దానితో జత చేయబడిన లేదా దానికి పోలికగా ఉన్న ప్రాజెక్టులను కూడా అధ్యయనం చేయాలి. అందుకు తగినంత పరిజ్ఞానం మనకు ఉండాలి. ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచుకోవాలి. ఏ రంగానికి సంబంధించిన ప్రాజెక్టును ప్రారంభించామో దానికి సంబంధించిన విధివిధానాలను రూపకల్పన చేసుకొనవలెను.
0 Comments