కవితా ప్రక్రియ అన్నది చెవులకు సొంపైన ఒక అద్భుతమైన కల. ఈ కవిత్వం అన్నది ఎంతో అపూర్వమైనది. పద్యాలు అన్నీ కూడా కవిత్వ రూపంలో రాయబడడం జరిగింది. పద్యంలో కవిత్వ ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని తీపిదన్నాన్ని, మనం చూడవచ్చు. అయితే ఈ కవిత్వం రాసేవారు కొన్ని సూచనలను పాటించవలయును. ఆ సూచనలను తెలియజేసే ముఖ్య ఉద్దేశ్యమే ఈ పాఠం యొక్క సారాంశం.
ఒక పద్యానికి మూలమే కవిత్వం. ప్రతి పద్యం కూడా కవిత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఈ కవిత్వానికి ఎంతో చరిత్ర ఉన్నది. పూర్వకాలం నుండి ఎన్నో గ్రంథాలు ఎన్నో శాస్త్రాలు ఈ కవిత్వంలో రాయబడ్డాయి. అయితే పద్యం ని రాస్తున్నప్పుడు ఎలా పడితే అలా రాయటానికి కుదరదు. వాటికి కొన్ని నియమ నిబంధనలు కచ్చితంగా అవసరం. అటువంటి కవిత్వం ఏ వ్యక్తినైనా ఆకర్షించగలదు.
ఒక పద్యం రాయాలంటే పదాలకు అల్లటం, అమర్చడం, ప్రాసలు, యతి స్థానాలు, చందస్సులు, భాష, భావం, లయాత్మకం ఇవన్నీ కూడా జోడింపబడాలి. అప్పుడే ఒక పద్యం అనేది ఏర్పడుతుంది. ఒక పద్యం రాయటానికి ముఖ్యంగా చందస్సు మీద రచయితకు పట్టు ఉండాలి.
కవి తన మనసులో ఉన్న దానిని కవిత్వ రూపంలో పద్యం ద్వారా చెప్పడాన్నే పద్యం అని మనం అనవచ్చు.
Youtube Explanation Video: PADYAM
పద్యం యొక్క లక్షణాలు :
- 1. పద్యానికి ముఖ్యముగా యతి మరియు ప్రాసలు చాలా ముఖ్యం.
- 2. పద్యానికి కచ్చితంగా నాలుగు పాదాలు (Lines) ఉండాలి.
- 3. గురువు లగువులను జోడిస్తే గణాలు రావాలి, గణాల వల్ల పద్యం ఏర్పడాలి.
- 4. పద్యములు ప్రతి పాదం లోని రెండవ అక్షరం ఒకటే విధంగా ఉండాలి. దానినే ప్రాస అని అనవచ్చు.
- 5. ప్రతిపద్యంలోను యతి స్థానం అనేది ఉంటుంది. అయితే ఈ యతి స్థానము ఒక్కొక్క పద్యములో ఒక చోట ఉంటుంది. అది ఏ చందస్సు కిందికి వస్తుందో దానిని బట్టి మారుతూ ఉంటుంది.
- 6. పద్యంలో ఉన్న అక్షరాలను బట్టి మనము అది ఏ చందస్సు అని గుర్తించగలగాలి. గుర్తించిన తర్వాత వాటికి మిగతా లక్షణాలు సరిగా జోడింపబడతాయా లేదా అనేది చూసుకోగలగాలి.
- 7. అయితే కొన్ని పద్యాలకు ప్రాస నియమం తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు. ( తేటగీతి, ఆటవెలది)
- 8. అక్షరాలను గురువు లఘువు లుగా సరిగా విభజించగలగాలి. వాటికి మిగతా లక్షణాలు సరితూగాలి.
- 9. మత్తేభం, శార్దూలం వంటి వృత్త పద్యాలు అక్షర గణాలతో ఏర్పడతాయి.
- 10. కవి చెప్పాలి అనుకున్న వస్తువును బట్టి ఏ ఛందస్సు ను బట్టి పద్యం వ్రాయలనుకున్నాడో కవి ఇష్టం.
చారిత్రక విభాగం :
పద్యాల వల్ల తెలుగు భాషకు ఒక అందం, సౌందర్యం ఏర్పడింది. మానవుడు తనలో ఉండే భావాలను వ్యక్తీకరించడానికి మొదటిగా అక్షరాలుగా మాటలు ప్రారంభమైతే, తరువాత అది పాటగా మారి, అటు తర్వాత పద్యముగా రూపు దాల్చుకున్నది. పద్యంలో శృతి, లయ, తాళం వలన అది ప్రజల వినికిడిలోకి త్వరగా జొచ్చుకొని పోతుంది. ఈ పద్యాలనే జీవిత ధ్యేయంగా ఉంచుకొని ఎన్నో శతకాలు రాసిన కవులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నోగ్రంథాలు కూడా ఈ పద్య రూపంలోనే రాయబడ్డాయి. చిన్నప్పటి నాటకాలు, రామాయణ గ్రంధాలు, శతకాలు కూడా ఇందులో భాగమే. ఒక మాటలో చెప్పాలంటే పూర్వపు కవుల యొక్క సాహిత్యమ, నేడు మనకు తెలుగులో ముందడుగు బాటలు. నన్నయ్య కాలాని కంటే ముందుగానే ఈ పద్యాలు ఉన్నాయి.
వాస్తవానికి చందస్సులో మార్గ, దేశి అను ఈ రెండు రకములు ఉంటాయి. మరియు సమయస్ఫూర్తిగా అప్పటికప్పుడే చెప్పే పద్యాలను 'చాటువులు' అని అంటారు. కళ్ళ ముందు కనిపించే వాటిని చూపిస్తూ తెలియని మనోహరమైన విషయాలను తెలిపే కవులు కూడా ఉండటం మన గర్వ కారణం. బోయి భీమన్న గారు రాసిన 'గుడిసెలు కాలిపోతున్నాయి' అను పాఠంలో సమాజములో జరుగుతున్న వాస్తవాలను చూపిస్తూ... హాస్యాస్పదంగా చమత్కారంతో అద్భుతమైన వర్ణంతో వ్యంగ్యంగా రాశాడు. బోయి భీమన్న గారు పిల్లి పైన కూడా ఒక శతకమును రాశాడు. దానిని 'పిల్లిశతకం' అని పిలిచారు. అంటే కవులు జరుగుచున్న వాటిని చూస్తూ... నిక్కచ్చిగా భయం లేకుండా, జరుగుతున్న దానిని పద్య రూపంలో రాయడానికి సమర్థులు. వారి పద సంపదకు, పద వర్ణనకు, పద నిర్మాణానికి మనము వెలకట్టలేము. వేమన వంటి కవులు నీతిని బోధిస్తూ ఎన్నో శతకాలు కూడా వ్రాసారు.
పద్యం పై ధ్యానం :
'తినగా తినగా వేపా తియ్యనగును' అని మనకు తెలుసు. అదే విధంగా సాధన చేయగలిగితే, పద్య నిర్మాణం కూడా సులభమే అని చెప్పాలి. పద్యంలోని లక్షణాలను మనం కంఠస్తం చేసి, వాటిని మన పద్య రచన పైన ప్రయోగిస్తే, ఒక చక్కనైన పద్యం వెలుగులోనికి వస్తుంది. అనుభవం పెరిగే కొలదిగా మనకు పద్య నిర్మాణం అనేది అతీతమవుతుంది. పద్యం రాసిన తర్వాత వాటిని లక్షణాలతో సరిచూసుకొని ఒక లయ సమకూర్చగలిగితే అదే అద్భుతమైన పద్యము.
గొప్ప గొప్ప రచయితలు పద్యాలలో కొన్ని అంశాలు ఉండాలని చెబుతారు అవి ఏమనగా వస్తువు, శిల్పము, ప్రయోజనము. ఈ మూడు అంశాలు లేకపోతే అసలు అది పద్యమే కాదు.
- ఏ విషయము గురించి చెప్పాలనుకుంటున్నామో అనేది - వస్తువు.
- ఆ విషయాన్ని ఎలా చెప్పుచున్నాము అనేది - శిల్పం
- ఆ పద్యం ద్వారా మనకు కలిగే ఫలితం గురించి చెప్పేది - ప్రయోజనము.
పద్యం యొక్క నాడిని పట్టుకుంటే - ఆ పద్య నిర్మంనం , చందో జ్ఞానం ఉన్నవాళ్లకే సాధ్యం.