పాట పాఠము యొక్క ఉద్దేశము:
కవితా ప్రక్రియలలో ఒకటైన ఆట చాలా ముఖ్యమైనది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాట యొక్క లక్షణాలను, పాటలోని వస్తువును తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము.
పాట యొక్క సారాంశము -
సాహిత్య ప్రక్రియలలో పాట ముఖ్యమైనది. పాట ఎవరైనాను పాడుకోవటానికి సులభంగా ఉంటుంది. పాటను రాయటానికి ఎక్కువ జ్ఞానం లేకపోయినాను.. తాలజ్ఞానం ఉండి, చక్కటి లయ ఉంటే చాలు. గ్రామీణులు, నిరక్షరాసులు కూడా పాటను సులభంగా అల్లవచ్చును. ఆ పాటలు మనం ప్రతి రోజు చూసే వాటిపై కూడా రాయవచ్చును. అయితే, మనము పాటను దృష్టించినంతగా పాట వెనుక ఉన్న రచయితను దృష్టించము. మానవుడు పాట రాయాలి అనుకుంటే ప్రపంచంలో దేని గురించి అయినను సునాయాసంగా రాయవచ్చును. ఎంతటి కఠిన హృదయుడిని అయినను పాట నెమ్మది చేయును. ఒక ప్రశాంతమైన లోకంలోనికి తీసుకొని పోతుంది. ఒక క్లిష్టమైన సంగతిని కూడా సులభముగా పాట ద్వారా అర్థం చేసుకోవచ్చు.
Youtube Explanation Video: PATA
పాట యొక నిర్వచనం -
పాట అనే పదమునకు పదం పాడడం, కైకట్టడం, గీతం అనే పర్యాయపదాలను చూడవచ్చును. అదేవిధంగా పాట, గేయం అను పదాలను సమానార్థకాలుగా వాడవచ్చు. కానీ పాట అనే పదము తెలుగులోనిది. గేయం అనే పదం సంస్కృతంలోనిది.
పాట యొక్క లక్షణాలు -
1. పదాల కలయికనే ఓ పాట.
2. పాటలు శృతి తప్పకుండా ఉండాలి.పాటలో తాళము కూడా తప్పనిసరి
3. చివరిలో ప్రాస కలిగిన పాటలు వినసొంపుగా ఉంటాయి.
4. పాటలు పోలికలు ఉంటే పాటకు అందం ఉంటుంది.
5. పాటలలో కనీసం రెండు చరణాలైనను ఉండాలి.
6. పాటలు పల్లవి మరియు అనుపల్లవి కూడా ఉండాలి.
7. తాల జ్ఞానమును బట్టి మరియు అక్షరాలతో లయ వస్తుంది.
8. లయకు తగిన విధంగా పాట యొక్క శృతి పెరుగుతూ తగ్గుతూ ఉండాలి.
9. పాటలు వస్తువును ముఖ్యంగా ఉంచి చక్కటి పోలికతో ఆ వస్తువును వర్ణించాలి.
10. పాటను సంగీతం ఉన్నను లేకపోయిననూ పాడగలిగేలా ఉండాలి.
పాట వలన ఫలితాలు -
1. పాట వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
2. పాట వలన ఎటువంటి కష్టతరహా విషయమునైనా సులభంగా గుర్తుంచుకోవచ్చు.
3. అందరూ కలిసి పాడే పాటల వలన సంతోషం లభిస్తుంది.
4. పాటల వల్ల మనసులోని ఆవేదనను వ్యక్తం చేయవచ్చు.
Degree 5th sem Telugu Model Papers: CLICK HERE
పాటలో వస్తువు ప్రాధాన్యత -
మానవుడు తనకు తెలిసిన ఏ విషయమనైనను పాటగా మార్చి వ్రాయవచ్చు. పాటను వ్రాయువానికి తాను రాయాలి అనుకుంటున్న విషయంపై అవగాహన ఉండాలి. పాటల యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రజలను ముఖ్యముగా ఆకర్షిస్తుంది. పాట రాసే వ్యక్తి కూడా, తాను రాయాలనుకుంటున్న విషయమును పరిశీలనగా తెలుసుకొని, దాని విషయంపై అవగాహనతో దానిమీద పాట రాయవలెను.
ఉదాహరణ - రైతు గురించి పాట రాయాలి అనుకుంటే ముందుగా రైతు యొక్క కష్టమును తెలుసుకొని ఉండాలి. పాటలో కచ్చితముగా పాట యొక్క వస్తువు ముఖ్యము. అలా పాటను రాసి పాడే వారిని 'వాగ్గేయకారులు' అని అంటాము. సుద్దాల హనుమంతు భూస్వామ్య పాలనలోని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఈ పాటను సృష్టించాడు. ఆయన బాల్య కార్మికుల పైన కూడా పాట రాసి 'పల్లెటూరి పిల్లగాడా' అనే పాటను సృష్టించాడు.
పాట రచనలో శిల్పం -
ఒక నిస్సారమైన దానిని సారవంతంగా చేయుటనే శిల్పము అని అంటారు. ఉదాహరణకు - బంక మట్టిని బొమ్మగా చేయడం, రాయిని శిల్పంగా చెక్కడము. పాటను రాయువారు ఒక విషయముపై చక్కగా పరిశీలించి ఆ విషయమును సరిగా వర్ణించలేకపోతే శిల్పం లేనట్టు అర్థం. ఆ విషయమును గురించి పరిశీలనగా తెలుసుకొని చక్కగా వర్ణించినప్పుడే ఆ పాటలో శిల్పం కూడా ఉంటుంది. పద బంధాలు, సుడికారాలు, ప్రతీకలు, అలంకారాలు, ప్రయోగాలు.. ఇవన్నీ కూడా పాటకు సౌందర్యాన్ని తీసుకొని వస్తాయి.
ఉదాహరణ - గద్దర్ రచించిన 'కావుకావున కాకులరిసితే' అనే పాటలో, ప్రజల యొక్క దయనీయమైన జీవితాన్ని.. ఒక బిడ్డ కోసం తల్లి పడే ఆవేదనను.. మనం చూడవచ్చు. అక్కడ ఆయన చేసిన వర్ణన వల్ల పాట చాలా గొప్పగా ప్రాచుర్యం చెందింది. ఇందులో గద్దర్ రచించిన వర్ణన భావం కనిపిస్తుంది. అంతేకాదు గద్దర్ 'తరగని గని'అనే పుస్తకంలో చదువు లేని ప్రజల యొక్క తీరును వివరించాడు.
పాటకు ప్రాణం పల్లవి అని సినిమా పాటల గురించి నారాయణరెడ్డి గారు చెప్పారు. అంతేకాదు, పల్లవికి తగిన చరణాలు కూడా ఉంటే.. పాటకు జీవం ఉంటుంది అని అన్నాడు.
పాట అల్లిక విషయం పక్కన పెడితే, పాటకు సంగీతం జోడుగా ఉంటే ఆ పాట శ్రోతల మనసును ఆకర్షిస్తుంది. పల్లవి, అనుపల్లవి, చరణాల మధ్య ఉండే సంబంధం అనుసంధానం అవ్వాలి. గాయకుల గొంతు మరియు రాగం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటన్నింటి కలయికనే పాట.