Mundhu Maata | ముందు మాట | Degree 5th Semester | Telugu Material

Mundhu Maata | ముందు మాట | Degree 5th Semester | Telugu Material

EDU TENSION
0

Class: Degree 3rd year
Sem: Degree 5th Sem
State: Telangana
Subject: Telugu
Lesson: Mundh Mata

Topic - Mundhu Mata Telugu Degree Notes

Mundhu Mata Degree 5th Sem, Telugu Lesson

గృహానికి గడప ఎలాంటిదో ఒక పుస్తక ప్రవేశానికి ముందుమాట కూడా అటువంటిదే. పుస్తకాల్లోకి ప్రవేశించడం కంటే ముందుగానే పుస్తకంలో ఏముంది.. పుస్తకాన్ని రచించిన వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని.. ముందుమాట తెలియజేస్తుంది. దీనిని ఇంగ్లీషులో FOREWARD అని అంటారు. దీనికి ఉపోద్ఘాతము, పీఠిక, రచయిత మాట, మునుడి, ఆముఖం, పరిచయం, గమనిక అనే నానర్థాలు కూడా ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయుడు ముందుమాట గురించి ఆంగ్లంలో ఇలా నిర్వచించారు - An introductory Message of a book written by someone other than the author. అయితే రచయిత కాకుండా వేరే వ్యక్తి రాసే పరిచయాన్ని మాత్రమే ముందుమాట అని అనవచ్చు.

Degree 5th sem, degree 5th sem telangana, degree 5th sem telugu lessons

రామబ్రహ్మం అనే ఓ వ్యక్తి ముందు మాట గురించి ప్రస్తావిస్తూ ముందుమాట రాసేవాడు రచయిత కంటే అత్యంత విద్యాధికుడై ఉండాలి అని చెప్పారు. అయితే ఒక మంచి రచయిత యొక్క ఉద్దేశాన్ని మరొక రచయిత మాత్రమే అంత గొప్పగా చెప్పగలడు. ఒక రచయితనే మరో రచయిత యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని 'ముందుమాటను' చాలా గొప్పగా రాయగలడు. అంతర్జాతీయ విద్యా పండితుడైన 'క్లార్క్' ముందుమాటను గురించి కొన్ని సూచనలను ఇవ్వడం జరిగింది. అవి ఏవనగా :

1. ముందుమాట రాసే వ్యక్తి కి రచయిత యొక్క జీవితం, స్వభావం, వ్యక్తిత్వం పైన అవగాహన ఉండాలి.

2. రచయిత పుస్తకము ద్వారా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో.. ముందుమాటను రాసే వ్యక్తి పుస్తకము యొక్క ఉద్దేశాన్ని చెప్పగలగాలి.

3. ముందుమాట ప్రజలను ఆకట్టుకునే విధంగానూ పుస్తకాన్ని చదివే విధంగాను ప్రేరేపించాలి.

4. ముందుమాట రాసేవాడు ముందుగా పుస్తకాన్ని చదివి.. పరిశీలనగా తెలుసుకొని.. ముందుమాటను రాయాలి.

5. ముందుమాట రాసేవాడు రచయితకు మరియు చదువులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించగలగాలి.

6. అత్యంత ముఖ్యముగా ముందుమాట వ్రాసేవాడు ఆ పుస్తకం ద్వారా చదువరులకు ఏమి ప్రయోజనం చెప్పాలి.

పై లక్షణాలను ఆధారం చేసుకుని ముందుమాట రాసే రచయిత చక్కగా వివరిస్తే చదువరులకు పుస్తకం మీద ఆసక్తి కలుగుతుంది. కొన్నిసార్లు రచయిత గురించి కూడా ముందుమాటగా చెప్పుకోవచ్చు. కవి యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని కూడా ముందుమాటగా చెప్పవచ్చు. లేదా, ఆ పుస్తకం రాయుటకు కవిని ప్రేరేపించిన విషయమైనా సరే ముందుగా రాయవచ్చును.

Mundhu Matat Youtube Explanation Video: CLICK HERE

ముందుమాట ఉదాహరణలు :

1. శ్రీ శ్రీ మహా ప్రస్థానానికి 'చలం' యోగ్యతా పత్రం పేరుతో ముందుమాట రాశారు. అందులో చలం గారు శ్రీశ్రీ యొక్క కవిత్వం గురించి, సాహిత్య వైఖరుల గురించి, ప్రపంచ పోకడల గురించి, తదితర అంశాల గురించి ముందుమాటగా చెప్పాడు.

2. వెంకట పార్వతీశ్వర కవులు రాసిన 'ఏకాంత సేవ' అనే పుస్తకానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముందుమాట రాశారు. అందులో 'నవ్య కవులు'అని ప్రయోగించి, నవ్య కవుల లక్షణాలను గుణములను చెప్పాడు. నవ్య కవులే ప్రకృతి బిడ్డలు అని తెలియజేశారు. తర్వాత కాలంలో అందులో చెప్పిన భావాలే కవిత లక్షణాలుగా స్థిరపడ్డాయి.

Also Read: Degree 5th sem telugu Model Papers - CLICK HERE

ఇట్టి రీతిగా ముందు మాట వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ముందుమాట వలన రచయిత గురించి, పుస్తకం యొక్క నేపథ్యం గురించి, లేక పుస్తకం యొక్క ఉద్దేశం గురించి మనం సులువుగా తెలుసుకోవచ్చు. ఆ పుస్తకం వలన చదువరులకు కలిగే ప్రయోజనం కూడా తెలుసుకోవచ్చు. పుస్తకం మొత్తం చదివి కాలాన్ని వృధాగా పోనివ్వడం కంటే ముందుమాట చదివి.. ఆ పుస్తకం యొక్క నేపథ్యం అర్థం చేసుకుంటే.. ముందుమాటలే సాహిత్య చరిత్ర నిర్మాణానికి స్తంభాలు. పుస్తకం యొక్క ముందుమాట ఆధారంగా పుస్తకంలో ఉన్న సరుకును అంచనా వేయొచ్చు. ముందు మాట చదివిన తర్వాత ఆ పుస్తకం చదవాలో లేదో నిర్ణయం చదువరులదే.

Post a Comment

0Comments
Post a Comment (0)