VYAASAM | DEGREE 5TH SEM | TELUGU LESSON PDF

VYAASAM | DEGREE 5TH SEM | TELUGU LESSON PDF

EDU TENSION
1

Class: Degree 3rd year
Sem: Degree 5th Sem
State: Telangana
Subject: Telugu
Lesson:Vyasam

Topic -VYASAM Telugu Degree Notes

---------------------

VYAASAM DEGREE 5TH SEM TELUGU LESSON PDF | వ్యాసం 

పాఠము యొక్క ఉద్దేశము :

తెలుగు సాహిత్యాలలో విశిష్టమైన ప్రక్రియలలో వ్యాసం ఒకటి. వ్యాసం అంటే ఏమిటో.. దాని అర్థాన్ని.. చరిత్రను.. లక్షణాలను.. పద్ధతులను.. వ్యాసములను వ్రాసే వారికి సూచనలను తెలియజేయడమే, ఈ పాఠము యొక్క ముఖ్య అంశము.

Degree 5th sem telugu, degree 5th sem telugu pdf, telugu 5th sem lessons pdf, వ్యాసం telugu pdf lesson

సారాంశము :

నాడు జరిగిన విషయాలను నేడు జరుగుతున్న విషయాలను ప్రతి దానిని కూడా వివరణాత్మకంగా చెప్పటాన్ని వ్యాసం అంటారు. వ్యాసం వచన రచనలలో ఒక భాగము. కాబట్టి పాఠకునికి త్వరగా చేరుతుంది.

నిర్వచనం :

వ్యాసం అనగా పరిశీలనం, ప్రయత్నం, క్షుణ్ణంగా పరిశోధించడం అని అర్థాలు వస్తాయి. ఒక విషయమును గూర్చి ఒక కొత్త శైలిలో.. ఒక కొత్త కోణంలో.. ఆలోచనలు పుట్టించి.. క్రొత్త విషయము పైన అధ్యాయనం చేయడాన్నే వ్యాసం అని చెప్పవచ్చు.

వ్యాసాన్ని ఇంగ్లీషు భాషలో ESSAY అని అంటారు. ఇదే పదాన్ని సంస్కృతంలో 'విస్తారం' అని అంటారు. విశేషముగా విస్తరించే మాట్లాడుకోవడమే వ్యాసము యొక్క ముఖ్య లక్షణం. ఒక ప్రత్యేక అంశం పైన మాట్లాడగలిగిన దానికంటే ఎక్కువగా విభజించి అధ్యయనం చేస్తూ.. మాట్లాడటమే వ్యాసంకు అందం.

VYASAM Video Explanation - CLICK HERE

వ్యాసం యొక్క లక్షణాలు :

వ్యాసంలో 'విషయము' ముఖ్యమైనది. వ్యాసంలో విషయం చాలా తేటగా ఉండాలి. చదువులకు ఆ సమాచారం లాభదాయకముగా ఉండాలి. వ్యాసములో పునాది చాలా ముఖ్యం పునాదిని కట్టుకున్న తర్వాతనే భవనంలోని ఏ గదిలోనికైనా ప్రవేశించాలి. పునాది అనగా ముఖ్య ఉద్దేశము.

1. అపరిమితము - వ్యాసానికి హద్దులు ఉండవు. అలా అని అపరిమితంగా సాగిపోరాదు. వ్యాసాన్ని విస్తరించి మాట్లాడాలి. వ్యాసాన్ని కొద్ది సమయంలో చదివే విధంగా ఉండాలి.

2. మిత్రత్వం - వ్యాసం పాఠకునికి స్నేహపూర్వకముగా ఉండాలి. స్నేహితులతో ఎలాగైతే మాట్లాడగలుగుతామో.. అలా ఉన్న విషయాన్ని సులభముగా చెప్పగలగాలి. మొత్తానికి స్నేహితునితో సులువుగా మాట్లాడే విధంగా ఉండాలి.

ALSO READ: Degree 5th sem Telugu Model Papers - CLICK HERE

3. హాస్యాస్పదం - వ్యాసాలు పాటకున్ని విసుగు పుట్టించే విధంగా కాకుండా, ఆకట్టుకునే విధంగా ఉండాలి. అందుకోసము హాస్యం పనిచేస్తుంది. వ్యాసంలో హాస్యం శక్తిని ఇస్తుంది. పాఠకునికి మరింత ఆసక్తి పుట్టించి.. ఇంకా చదివే విధంగా సహాయం చేస్తుంది.

4. నవీణత్వం - వ్యాసంలో పాఠకునికి తెలిసిన విషయాలు మాత్రమే కాకుండా.. కొత్త విషయాలు కూడా ఉండాలి. ఎందుకనగా, తెలిసిన విషయం పాటకునిలో నిర్లక్ష్యాన్ని పుట్టించి.. వ్యాసాన్ని చదవనీయదు. గనుక, వ్యాసం అనేది నవీనముగాను.. సృజనాత్మకంగానూ.. క్రొత్తదిగా ఉండాలి.

6. వ్యక్తిత్వం - వ్యాసంలో రచయిత వాడే పదాలను బట్టి.. వ్యాసా శైలిని బట్టి.. రచయిత యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. రచయిత యొక్క దృక్పథం, తన ఆలోచన వెల్లడి అవుతుంది. గనుక రచయిత వ్యక్తిత్వం కూడా వ్యాసంలో కనబడాలి.

ఇవి వ్యాసం యొక్క లక్షణాలు.

ముగింపు :

తెలుగులోని తొలి వ్యాస సంకలనం 1862వ సంవత్సరంలో 'హితసూచి' అను పేరుతో సామినేని ముద్దు నరసింహ నాయుడు గారిచే ప్రచురింపబడినది. కొన్ని పర్యాయములలో.. వ్యాసాలను ఉపన్యాసాలు అనే పేరులతో కూడా వాడటం జరిగినది.

గనుక వ్యాసం అంటే ఆషామాషీ విషయం కాదు. వ్యాసం ద్వారా పాటకునికి ప్రయోజనం ఉండాలి. చదివించే లక్షణం రచయితకు ఉన్నప్పుడే.. అతను ఉత్తమమైన రచయిత అవుతాడు. ఒక వ్యక్తిని ఆలోచింపజేస్తూ.. సమాజంలో మార్పును తెచ్చే ఒక గొప్ప సాధనమే 'వ్యాసము.' నేడు ప్రపంచ వార్తలన్నీ కూడా ఈ వ్యాసాల పైనే ఆధారపడి ఉన్నాయి. వ్యాసం లేనిదే విద్యావ్యవస్థకు అర్థము లేదు. వ్యాసం విద్యకు స్తంభం వంటిది.

Post a Comment

1Comments
Post a Comment