Vachana Kavitha - వచన కవితా - Telugu Degree 5th sem Lessons PDF

Vachana Kavitha - వచన కవితా - Telugu Degree 5th sem Lessons PDF

EDU TENSION
1

Class: Degree 3rd year
Sem: Degree 5th Sem
State: Telangana
Subject: Telugu
Lesson: Vachana Kavitha

Topic - Vachan Kavitha Telugu Degree Notes


తెలుగు సాహిత్యంలో వచన కవిత చాలా ప్రాముఖ్యమైనది. దీనికి సమానార్తకంగా వచన పద్యం, వచన గీతం అని పేర్లు వాడవచ్చు. దీనికి పితామహుడిగా కుందుర్తి ఆంజనేయులు గా మనం పరిగణించవచ్చు.

degree 5th sem, degree 5th semester lessons, degree 5th sem lessons pdf, degree 5th semester telugu lessons pdf

నిర్వచనాలు:

ఏ నియమములు లేకుండా శుద్ధ వచనాన్ని లయాత్మకంగా ఉచ్చరిస్తే అదే వచన కవిత్వం అని 'సి. నారాయణ రెడ్డి' గారు నిర్వచించారు. అదేవిధంగా వచనం కవితామయంగా ఉంటే అదే వచన కవిత అని 'సర్దేశాయి తిరుమలరావు' నిర్వహించారు.

లక్షణాలు :

1. వచన కవితలు చందు నియమాలు అవసరం లేదు.
2. వచన కవితలు లయాత్మకంగా ఉండాలి.
3. వచన కవిత కవితమయంగా ఉండాలి.
4. వచన కవితలో ఆవేశం, ఒత్తిడి, సూక్ష్మ భావ ప్రకటన, సాంద్రత వంటి మొదలైన వాటిని లక్షణాలుగా చెప్పుకోవచ్చును.


వచన కవిత్వం యొక్క చరిత్ర :

వచన కవిత్వానికి ఆధ్యుడిగా 'శిష్లా ఉమామహేశ్వరరావు' ని చూడవచ్చును. ఆయన విష్ణు ధనువు & నవమి చిలుక ప్రచూరించాడు. వచన కవితకు నవ దృక్పథాన్ని జోడించినవారు - శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్, ముద్దుకృష్ణ, నారాయణరెడ్డి, శ్రీరంగం, నారాయణ బాబు, దాశరధి అనువారిని చూడవచ్చు.

VACHANA KAVITHA lesson YouTube Explanation Video - CLICK HERE

వచన కవిత యొక్క సృజనత్వం :

వచన కవిత రాసేవాడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పుడే చక్కగా ప్రతిస్పందించగలడు. సామాజిక రుగ్మతులను ప్రశ్నించగలడు. సమాజం పట్ల బాధను.. వేదనను.. క్షోభను వ్యక్తపరుస్తాడు. మనుషులు యదార్ధంగా జీవించాలని ఆశిస్తాడు. తన భావాలనే వ్రాతగా రాస్తాడు. దీనిని అ భివ్యక్తి అని అంటారు.

Also Read: Degree 5th sem Telugu Model Papers - CLICK HERE

వచన కవిత యొక్క రచన పద్ధతులు :

కవిత్వం వ్రాయాలంటే ముందుగా కవిత్వం బాగా చదివి ఉండాలి. ప్రేరణతో రాసినప్పుడే అది కవిత్వం అవుతుంది. భావాన్ని.. బాధను.. ఆలోచనను.. అనంతమైన అక్షర రూపంలో లిఖించబడేదే కవిత్వం. కవిత్వం బాగా రాయాలంటే వివిధ రకమైన కవిత్వాలను అనుదినము చదువుతూ ఉండాలి.

ఒక వాక్యాన్ని వర్ణించేటప్పుడు చాలా తేటగా ఉండాలి. పోల్చి వర్ణించేటప్పుడు మరి ఎక్కువగా తేటగా ఉండాలి. ఉదాహరణకు, నీటిని వృధా చేయరాదు - కన్నీళ్లను వృధా చేయరాదు. ఈ వాక్యములో రెండవ వాక్యము అనగా 'కన్నీళ్ళను వృధా చేయరాదు' అనునది విశేషమైన అర్థాన్ని ఇస్తుంది. గనుక ఇటువంటివి కవిత్వం అవుతాయి. కవిత్వం వేరు వ్యాసం వేరు. కవి రాసే విధానాన్ని శిల్పం అని అంటారు. కవి యొక్క బలమైన ఊహలే కవిత్వానికి పునాదులు. జీవిత సంఘర్షణలో కలిగే అనుభవాలే కవిత్వానికి భవంతులు. కవిత్వం రాయడం సులభమే.. కానీ అనుభవించి రాసేవాడికే కష్టం.

Post a Comment

1Comments
  1. Ho I am vanecanter I am vall house is a work is a manajest wootlrkbi am bate

    ReplyDelete
Post a Comment