Class: Degree 3rd year
Sem: Degree 5th Sem
State: TelanganaSubject: TeluguLesson: Vyasa Parinamam
Sem: Degree 5th Sem
State: Telangana
Topic - VYASA PARNAMAM Telugu Degree Notes
Vyasa Parinamam Degree 5th Sem Telugu Lesson:
కాలాన్ని బట్టి వ్యాసం కాలక్రమేనా అభివృద్ధి చెందుతూ పరిణతరూపం పొందింది. వ్యాసం అనేది ప్రతి దృక్పథంలోనూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. శాస్త్రంలోనూ, సాంకేతిక లోను, వైజ్ఞానిక విషయంలోనూ, రచనలను, అనుభవాలను, ఆలోచనలను, స్వీయ భావాలను తెలుపుతూ. . అభిప్రాయాలను తెలిపే వాటిగాను, హాస్య, వినోద, దుఃఖము వంటి వాటిలోనూ ప్రతి కోణంలోనూ ప్రతి దృక్పథంలోనూ తెలుగు వ్యాసం విస్తరించింది. పరిమాణం వ్యాసం పరిణామం అర్థం కావాలంటే దీనికి ముందుగా ఉన్న ఆరవ పాఠమును ఆరవ పాఠాన్ని చదువుకొని ఉండాలి.
ఈ వ్యాస పరిణామ చరిత్రను మనము మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.
1. ప్రారంభ దశ
2. వికాస దశ
3. ఆధునిక దశ రాసి
VYASA PARINAMAM Youtube Video Explanation - CLICK HERE
ఒకప్పుడు సాహిత్యానికి మాత్రమే వ్యాసం పరిమితి అయ్యి ఉండేది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ వ్యాసం ఒక స్తంభముగా నిలబడుతుంది. భాష కారణంగా వ్యాసం ప్రజలను ఆకర్షించగలదు. స్థానిక భాషా వ్యాసాలు మరి ఎక్కువగా స్ఫూర్తిని ఇవ్వగలవు. రచనా ప్రక్రియలో వ్యాసం వేగంగా విస్తరించినది. జాతీయంగాను.. అంతర్జాతీయంగానూ.. ఇది విస్తరించి నేడు చరిత్ర పుటల్లో ఒక స్థానమును సంపాదించుకుంది. ఈ విధంగా వ్యాసం ఎప్పుడో ప్రారంభమై.. ప్రారంభ దశ నుంచి ఆధునిక దశ వరకు పరిణామం చెందింది. ఇక భవిష్యత్తులో కూడా పరిణామం చెందబోవును.
1. ప్రారంభ దశ (1862-1910)
నరసింహారాయుడు, పరవస్తు వెంకటరంగాచార్యులు, జీయర్ సూరి అను వీరు వ్యాస లక్షణాలు ఉన్న వచనాలను ప్రకరణాలుగా.. ప్రమేయాలుగా.. సంగ్రహాలుగా.. పిలవడం జరిగింది. ఈ వ్యాసాలలో స్త్రీ గౌరవమునకు సంబంధించినవి, మేలుకొలుపు సంబంధించినవి, సహవాసమునకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి ఉండటం విశేషం. తరువాత కందుకూరి వీరేశలింగం గారు కూడా తన పత్రికలలో విభిన్న అంశాల పైన వ్యాసాలు రాశాడు. స్త్రీ జనోదరణ, మతం, నైతికత విలువలు, శాస్త్రం, సాహిత్యం వంటి వాటికి సంబంధించిన వాటిని రాసి తెలుగు వ్యాస ప్రపంపంచంలో ముఖ్యుడిగా నిలిచాడు. ఇది మొదటి/ప్రారంభ దశ.2. వికాస దశ (1910 - 1960)
గురుజాడ, గిడుగు రామ్మూర్తి ఇందులో ముఖ్యులుగా మనం చూడవచ్చు. బ్రహ్మయ్య శాస్త్రి వంటి ఇతర తదితరులు వ్యాసం వృద్ధి చెందటానికి తమ వంతు ఎంతో కృషి చేయడం జరిగింది. చిలుకూరి వీరభద్రరావు చారిత్రక వ్యాసాలు వ్రాస్తే.. కోమర్రాజు చారిత్రక పరిశోధనతో వ్యాసాలు రాశారు. ఈ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన చారిత్రక వ్యాసాలు మరియు సాంస్కృతిక వ్యాసాలు కూడా ప్రసిద్ధి చెందాయి. 'తెలంగాణ' పేరుతో వట్టికోట ఆళ్వారు స్వామి గారు తమ ప్రాంతానికి చెందిన చరిత్ర విషయాలను వ్యాస రూపకంగా రాశారు. కట్టమంచి రామలింగారెడ్డి విమర్శ మరియు పీఠిక రూపంలో వ్యాసాలు రాశారు. అందులో 'గౌతమ వ్యాసాలు', 'ఖండవల్లి లక్ష్మీరంజనము', 'కథలు - గాధలు' ఆనందం విషాదం వంటివి కూడా ఉన్నాయి.ALSO READ: Degree 5th sem Telugu Model Papers - CLICK HERE
3. ఆధునిక దశ (1960 నుండి నేటి వరకు)
సాంకేతికత పెరగడం వలన వ్యాసాలు కూడా అలానే వృద్ధి చెందాయి. పత్రికల సంఖ్య పెరగడం.. కాగితాల సంఖ్య పెరగడం వలన అనేక వ్యాసాలు ముద్రించబడుతూ వచ్చాయి. రాజకీయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, పీటిక వ్యాసాలు, విజ్ఞాన వ్యాసాలు, వైద్య వ్యాసాలు, శాస్త్ర వ్యాసాలు ఇలా ఎన్నో ప్రపంచంలోనికి వెలసిల్లాయి. ఈ దశలో తెలుగు వ్యాసం బాగా విస్తరించింది. శ్రీ,శ్రీ వ్యాసాలు అందులో ప్రత్యేకమైనవి. తిరుమల రామచంద్ర నుడి - నానుడి అని, దేవులపల్లి రామానుజ రావు సారస్వతీ - నవనీతం అని.. ఇలా ఆలోచింపజేసే వ్యాసాలు వచ్చాయి. ఇటువంటి వ్యాసాలు నూతన వ్యాసములకు నాంది పలికి.. వ్యాస చరిత్రను గొప్పగా ప్రపంచానికి చెప్పింది.ఒకప్పుడు సాహిత్యానికి మాత్రమే వ్యాసం పరిమితి అయ్యి ఉండేది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ వ్యాసం ఒక స్తంభముగా నిలబడుతుంది. భాష కారణంగా వ్యాసం ప్రజలను ఆకర్షించగలదు. స్థానిక భాషా వ్యాసాలు మరి ఎక్కువగా స్ఫూర్తిని ఇవ్వగలవు. రచనా ప్రక్రియలో వ్యాసం వేగంగా విస్తరించినది. జాతీయంగాను.. అంతర్జాతీయంగానూ.. ఇది విస్తరించి నేడు చరిత్ర పుటల్లో ఒక స్థానమును సంపాదించుకుంది. ఈ విధంగా వ్యాసం ఎప్పుడో ప్రారంభమై.. ప్రారంభ దశ నుంచి ఆధునిక దశ వరకు పరిణామం చెందింది. ఇక భవిష్యత్తులో కూడా పరిణామం చెందబోవును.