గొడగూచి కథ - Godaguchi Katha Lesson - Degree 1st Sem Telugu

గొడగూచి కథ - Godaguchi Katha Lesson - Degree 1st Sem Telugu

EDU TENSION
1

కవి పరిచయము:

కవి: పాల్కురికి సోమనాథుడు
తల్లిదండ్రులు: శ్రియాదేవి, విశ్నురామిదేవుడు
కాలం: 12 వ శతాబ్దపు కవి
జననము: పాలకుర్తి అనే గ్రామం, వరంగల్ జిల్లా
రచనలు:  బసవ పురాణం, అనుభవసారం, వృషాధిప శతకము, చతుర్వేదసారం, పండితారాధ్య చరిత్ర మొదలైనవి.

గొడగూచి పాఠము యొక్క సందర్భము & సారాంశము -

ఈ పాటలో పాల్కురికి సోమనాథుడు గొడగూచి అను ఒక అమ్మాయి యొక్క ముగ్ధ భక్తి గురించి వివరించాడు. ప్రస్తుత ఈ పాటను బసవపురాణంలోని, తృతీయాస్వాసం లోని 'గొడగూచి' నుండి ఇవ్వబడినది.

గొడగూచి, godaguchi katha, goda guchi katha lesson, goda guchi degree 1st sem, godaguchi katha degree 1st sem telugu

గొడగూచి అనునది ఒక బాలిక పేరు. ఈ బాలిక 10-12 సంవత్సరాల వయసు గలది. ఈమె తండ్రి పేరు శివదేవుడు. వీరి తండ్రి గొప్ప శివ భక్తుడు. వీరి కుటుంబానికి ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే, ప్రతిరోజూ తమ ఊరిలోని శివలింగానికి కుంచెడు పాలు పెట్టే అలవాటు.

ఒకానొక సమయంలో, ఒక రోజున శివదేవుడు తన భార్యతో కలిసి వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు శివదేవుడు తన కుమార్తెతో అనగా గొడగూచితో -అమ్మా! ప్రతిరోజు నువ్వు శివాలయానికి వెళ్లి పరమశివునికి పాలను నైవేద్యంగా పెట్టు. ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు అని చెప్పి వెళ్ళిపోతారు.

GODAGUCHI KATHA Youtube Explanation Video - CLICK HERE

తర్వాత రోజున ఆవు పాలను శుభ్రంగా మొరగపెట్టి కుంచెడు పాలను కొలచి శివాలయానికి సమర్పణగా తీసుకొని వెళ్తుంది గొడగూచి. పాలు ఎవరికి కనపడకుండా పైన కొంగు కప్పింది. శివాలయానికి ఎదురుగా పాలను పెట్టి పాలను త్రాగమని శివలింగాన్ని కోరింది.గొడగూచి చిన్న పిల్ల గనుక, ఆమెలోని అమాయకత్వం మనలను ఇక్కడ పాల్కురికి సోమనాథుడు తెలియజేస్తున్నాడు. పాలు శివలింగం ముందర పెట్టి, అమాయకత్వంతో.. శివుడు వచ్చి స్వయంగా తానే పాలు త్రాగుతాడని భావించింది. కానీ ఎంతసేపైనను శివుడు ఆ పాలు త్రాగకపోయేసరికి బాధపడింది. పాలు త్రాగమని శివున్ని ప్రార్థించింది.



ఎంత ప్రార్ధించినా సరే శివుడు పాలు త్రాగకపోయినసరికి ఎందుకు త్రాగడం లేదని? ఎన్నో కారణాలను ఆలోచించింది. ముక్త భక్తితో గొడగూచి శివుని ప్రశ్నలు అడగడం ప్రారంభించింది ఎలా అంటే.

1. ఏమైంది ఎందుకు పాలు త్రాగటం లేదు? చిన్నపిల్లను నేను పాలు తెచ్చానని త్రాగటం లేదా నీవు ఇప్పుడు పాలు త్రాగు నీకు కావాలంటే గుజ్జు భోగిరము పాలన తెచ్చిస్తాను అని కోరింది.

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

2. ఎందుకు పాలు త్రాగటం లేదు? పాలు వేడిగా ఉన్నాయా? కమ్మని వాసన రావడం లేదా? పాలు శుభ్రంగా లేవా? ఏమైనా పాలు విరిగిపోయాయా? పాలల్లో నుండి ఏమైనా వాసన వచ్చిందా? పాలలో ఎక్కువ నీళ్లు కలిశాయా? ఈ పాలు నీకు సరిపోవాఎం ఎందుకు తాగడం లేదు? అని ఎన్నో ప్రశ్నలు వేసి.. ఒకసారి నేను తెచ్చిన ఈ పాలు త్రాగు అని కోరింది.

3. నేను ఒంటరిగా పాలు తెచ్చానని త్రాగటం లేదా? ఈ గిన్నె బాలేదా? నాకు నైవేద్యం పెట్టడం రాదని త్రాగటం లేదా? పాలపై మీగడ సరిగా లేదా? ఈ పాల మీద వేరే ఎవరైనా దృష్టి పడిందని నీవు త్రాగడం లేదా? ఊరికే ఏ కారణం లేకుండా ఎందుకు త్రాగడం లేదు అని వివిధ ప్రశ్నలతో గొడగూచి తన మనసులో ఆలోచించి శివుడితో మాట్లాడింది.

పై మాట్లాడిన మాటల వల్ల గొడగూచి యొక్క మనస్తత్వం తన చిన్న వయసు యొక్క తీరు అర్థం అవుతుంది. అయితే పిల్లలకు ఆశపెట్టినట్లు గొడగూచి కూడా శివుడికి ఆశ పెట్టే ప్రయత్నం ప్రారంభించింది. ఎలాగంటే..



నువ్వు పాలు తాగితే గుజ్జనం తినిపిస్తా, నూనె పోలేలు తెస్తాను, కలకండ పాలనం తినిపిస్తాను అని కోరింది. నీవు పాలు తాగితే జాతరకు తీసుకువెళతాను, తినటానికి తీసుకెళ్తాను, పాయసం తినిపిస్తాను, శైవులు జరుపుకునే పండుగకు తీసుకెళ్తాను, పాలలోకి అటుకులు తెస్తాను అని ఆశ పెట్టి, పాలను త్రాగించే ప్రయత్నం చేసింది. కానీ శివుని యొద్ద నుంచి ఎటువంటి జవాబు లేకపోయేసరికి ఎంతో దుఃఖంతో ప్రలాపించింది.

ఎన్ని ప్రయత్నాలు జరిగినా శివుడు వచ్చి పాలు త్రాగకపోయినసరికి ఆమె బాధపడింది. శివుడు పాలు త్రాగకపోతే మా వాళ్ళు నన్ను చంపుతారు. వాళ్ళ చేతిలో నేను చావడం కంటే శివుడి ముందే మరణిస్తాను అనుకొని శివలింగానికి తల ఆనించి ప్రాణాన్ని విడుటకు సిద్ధమైంది. చేష్టలు ఆమె ముక్త స్వభావానికి ప్రతీక. ఇది గమనించిన శివుడు పాలు త్రాగాడు. దానిని చూసిన గొడగూచి - నేను చిన్నపిల్లనని మరీ ఇంత ఏడిపిస్తావా? మా అన్నకు చెబుతాను ఉండు అని బెదిరించి పూర్తిగా చిన్న పిల్ల మనస్తత్వాన్ని నిరూపించుకుంది. ఇలా ప్రతిరోజు శివుడికి పాలు ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతోంది. ఒకానొక సమయంలో ఊరి నుండి వచ్చిన నాన్న ఖాళీ గిన్నె గొడగూచి చేతిలో ఉండడం చూసి, తల్లి పాలు ఏం చేశావు అని అడిగాడు? అందుకు గొడగూచి శివుడు పాలు త్రాగాడని సమాధానం చెప్పింది. శివదేవుడు మాత్రం ఈ మాటలను నమ్మలేదు. దానికి నిరూపణ కావాలన్నాడు. అందుకు దానికి కూడా ఒప్పుకున్నది. తర్వాత రోజున, తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి వచ్చారు. పాలను తీసుకొని శివలింగం వద్దకు వచ్చారు. కానీ ఆరోజు తన తండ్రి ముందర శివుడు పాలు త్రాగలేదు. కోపం వచ్చిన శివదేవుడు, శివుని పేరు చెప్పి రోజు నీవు పాలు తాగుతున్నావు అని కోపపడి, తన కూతురుతో - నీ కడుపు చీల్చి ప్రాణాలు తీస్తాను అంటూ గొడగూచి వెంట పరిగెత్తి పట్టుకుపోయాడు.

అప్పుడు గొడగూచి శివుని యొక్క శరణం కోరింది. తనలో నీలం చేసుకోవడం ద్వారా అప్పుడు శివుడు తనలో గోడగూచిని లీనం చేసుకోవడం ద్వారా గోడ గూర్చి యొక్క ముక్త భక్తి అర్థం అవుతుంది.

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

Post a Comment

1Comments
Post a Comment