Class: Degree 1st yearSem: Degree 1st SemSubject: Telugu
State: TelanganaLesson: Samvaranudi TapassuTopic: SAMVARANUDI TAPASSU summary notes--------------------------
State: Telangana
కవి పరిచయం:
సంవరణుడి తపస్సు సందర్భం:
ఈ పాఠంను అద్దంకి గంగాధరుడు రచించాడు. ఇతను గోల్కొండ ప్రాంతాన్ని పాలించిన ప్రభువు ఇబ్రహీం కుతుబ్షాహీ మల్కి భారముడిగా ప్రసిద్ధి చెందాడు ఇతను రచించిన కావ్యం తపతి సంవరనోపాఖ్యానము.
సందర్భము:
సూర్యుని కూతురు పేరు తపతి. చంద్ర వంశానికి చెందిన అజామీడుని కుమారుడు సంవరణుడు. ఇతను హస్తినాపురంను పరిపాలించిన రాజు. ఒకానొక సందర్భంలో తపతి మరియు సంవరణుడు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమకు ఒక చిలుక రాయబారంగా ఉండి వారికి వివాహం అయ్యే విధముగా సహాయపడింది. ఈ పాఠంలో కనబడు ముఖ్య పాత్రలు - సంవరణుడు, తపతి, చిలుక, తపతి యొక్క తండ్రిఐన సూర్యుడు.
SAMVARANUDI TAPASSU Youtube video Explanation - CLICK HERE
సారాంశము:
హస్తినాపురం అనే రాజ్యాన్ని సంవరణుడు పరిపాలించేవాడు సూర్యుని కుమార్తె అయిన తపతి.. ఇరువురు ప్రేమించుకున్నారు వీరి ప్రేమకు చినుత రాయబారం చేసి వారి వివాహానికి తోడ్పడింది. ఈ విషయాన్ని ఈ కావ్యంలో రచయిత వివరించి చెప్పాడు.
సంవరణుడి తపస్సు:
సంవరణుడు తన భార్యగా తపతిని చేసుకోవడానికి సూర్యుడి అనుగ్రహం కోసం ఎంతో తపస్సు చేసేవాడు. సూర్యోదయం అవ్వటం కంటే ముందుగానే నిద్రలేచి కమల పువ్వులతో, అందముగా వికసించిన సరస్సులో తను స్నానం చేసి, ముందు రోజు ధరించిన కాషాయ వస్త్రాలను ఉతికి, శుభ్రమైన మరో జత కాషాయ వస్త్రములు ధరించి, నుదుటి పైన, చేతుల పైన మరియు ఇతర అవయవాల పైన విభూతి రేఖలను కనబడే విధంగా పూసుకునేవాడు.
సంవరణుడి ధ్యానం:
ఈ సంవరణుడు ధ్యానం చేసుకొనుటకు రుద్రాక్షలను ధరించి, సంధ్యావందనం పూర్తి చేసి, యోగ ముద్రలను ధరించి, ఒక భావి సమీపంలో ఉన్న దేవదారు అనుబడు వృక్షముల క్రింద ఉన్న ఒక పూల పొదరిండ్లలో ఏకాంతంగా సూర్యుడికి ధ్యానం చేసేవాడు.
For SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE
పూజ విధానం:
సంవరణుడు గాయత్రి మంత్ర జపం చేసి సూర్యుడికి అర్పించేవారు. సూర్యుడికి ఆసనము, పద్యము, స్నానము, వస్త్రము, గ్రంథము, పూలు, నైవేద్యాలను, తాంబలాలను అర్పించే తనను అల్లూరిగా స్వీకరించమని సూర్యునికి పూజ చేసేవాడు.
సూర్యుడి ప్రత్యక్షత:
సంవరణుడు చేసిన పూజల ఫలితంగా సూర్యడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సంవరణుడు ఆనందంతో సూర్యుడిని ప్రశంసించాడు.
సంవరణుడు ఆరాధన:
ఓ మార్తండా! నీకు శుభము! నీకు జయము! మేరు పర్వతానికి కావాలి కాసేవాడా! పద్మములకు స్నేహితుడా! అంటూ క్రీర్తించసాగాడు.
తపతి పెంచుకున్న చిలక ‘తపతికి’ సరిపోయిన వరుడు కొరకు గాలించింది. ఈ దేవలోకంలో ఎవరు సరితుగరు అని భూలోకానికి చేరి 'సంవరణుడు' ని చూసి సంవరణుడు సరిపోయిన వాడు అని చిలుక తపతి చేతి మీద వ్రాలినది. అప్పుడు తపతి చిలుకను ఈ విధముగా ప్రశ్నించింది.
తపతి మాటలు:
నా ప్రియ నేస్తమా! ఎక్కడికి వెళ్ళావ్? నిన్ను ఇంతగా ప్రేమించే నన్ను వదిలి వెళ్ళిపోతావా? నీ బంధువులు కూడా నువ్వు కనబడకపోయే సరికి దుఖం వ్యక్తం చేసారు అని అడిగింది.
చిలుక సందేశం:
స్నేహితులారా! నా కొరకు ఎదురు చూసినందుకు కృతజ్ఞతలు. సూర్యుడికి సరిపోయే అల్లుడు నాకు భూలోకంలో దొరికాడు. అతని పేరు ‘సంవరణుడు.’ హస్తినాపురానికి రాజు అని చెప్పి రాయభారం చేసింది.