సంధులు రెండు రకాలు ఉంటాయి.
1. సంస్కృత సంధులు
2. తెలుగు సంధులు
1. సంస్కృత సంధులు
2. తెలుగు సంధులు
1. సంస్కృత సంధులు
రెండు పదాలు ఒకవేళ సంస్కృత బాషకు సంబంధించినవైతే వాటిని సంస్కృత సంధులు అంటారు.
1. సవర్ణదీర్ఘ సంధి:
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా:
1. దేవాలయము = దేవ + ఆలయము
2. మునీశ్వర = ముని + ఈశ్వర
3. మునీంద్ర = ముని + ఇంద్ర
2. గుణ సంధి:
సూత్రం: 'అ' కారమునకు ఇ, ఉ, ఋ లు పరంబైతే క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఏకాదేశమవును.
(అ + ఇ = ఏ
అ + ఉ = ఓ
అ + ఋ = ఆర్)
ఉదా:
1. దేవేంద్ర = దేవ+ఇంద్ర
2. రాజర్షి = రాజ+ఋషి
3. భరతోత్పత్తి = భరత +ఉత్పత్తి
3. వృద్ధి సంధి
సూత్రం: 'అ' కారమునకు ఏ, ఐ లు పరంబైతే 'ఐ' కారముగాను...
'అ' కారమునకు 'ఓ, ఔ పరంబైనప్పుడు 'ఔ' కారముగాను ఏకాదేశమగును.
ఉదా:
1. ఏకైక = ఏక+ఏక
2. మహౌషధము = మహా+ఔషధము
4. యణాదేశ సంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరంబైతే క్రమముగా య, వ, ర లుగా ఏకాదేశమగును.
ఉదా:
1. గుర్వాజ్ఞ = గురు+ఆజ్ఞ
2. పిత్రంశ = పితృ+అంశ