Gangireddhu - గంగిరెద్దు - Degree 1st sem Telugu Lesson PDF

Gangireddhu - గంగిరెద్దు - Degree 1st sem Telugu Lesson PDF

EDU TENSION
0

కవి పరిచయం:

కవి: పల్లా దుర్గయ్య
జన్మస్థలం: మడికొండ, వరంగల్ జిల్లా. 1916లో జన్మించారు.
విద్యా: ఉస్మానియా యునివర్సిటిలో ఎం.ఎ తెలుగు పూర్తి చేసి, 1960లో ప్రబంధ వాగ్మయ వికాసం పై పరిశోధన చేసి డాక్టరేటు చేసారు.
రచనలు: పాలవెల్లి అను కావ్యాన్ని, అల్లసాని పెద్దన అను గ్రంథాన్ని మొద.. వాటిని రచించారు. అందులో గంగిరెద్దు అను పాఠం కూడా ఒకటి.

degree 1st sem telugu,గంగిరెద్దు,Degree 1st sem telugu material pdf,telugu degree 1st sem pdf,gangireddhu lesson,degree 1st sem lessons,degree 1st sem telugu pdf,DEGREE 1ST SEM,


ఈ పాఠంలో పళ్ళ దుర్గయ్య గారు ఒక దూడ గురించి మరియు గంగిరెద్దుల వాడి గురించి ప్రస్తావించారు.

గంగిరెద్దు సందర్భము:

ఓ ఊరిలో.. ఒక ఆవుకు ఓ దూడ పుడుతుంది. అయితే పుట్టిన కొద్ది కాలానికి ఆ దూడ తల్లి చనిపోతుంది. ఆ సమయంలో, ఈ దూడ తన యజమాని ఇంటి నుండి పారిపోతుంది. అప్పుడు ఓ గంగిరెద్దుల వాడికి ఈ దూడ దొరికింది. ఈ దుడకు గంగిరెద్దుల వాడు కళా ప్రదర్శనలు విన్యాసాలు నేర్పిస్తాడు.

ఈ గంగిరెద్దుతో విన్యాసాలు, ప్రదర్శనలు చేయించి ప్రేక్షకులు వారికి ఇష్టమైన కానుకలు సమర్పించాలని అందరిని కోరుతాడు. ప్రజలు తమకు తోచిన సహాయం చేస్తారు. ఈ విధంగా గంగిరెద్దులు అనే పాఠంలో ఒక దూడ మరియు గంగిరెద్దుల వాడి జీవితాన్ని మనం చూడవచ్చు.


గంగిరెద్దు సారాంశం:

గంగిరెద్దుల వాడు తన దూడను 'బసవన్న' అని పిలిచేవాడు. ఈ బసవన్నకు గంగిరెద్దుల వాడు కండ్లకు గంతులు కట్టి ప్రజల మధ్యలో దాగి, బసవన్న ఇటు రా! అని పిలిచేవాడు. ఆ స్వరం విన్న దూడ తన యజమాని వద్దకు అనగా గంగిరెద్దుల వాడి వద్దకు వచ్చేది. అప్పుడు గంగిరెద్దుల వాడు గంతలను విప్పి గంగిరెద్దు కొమ్ముల పైన చేతులు నిటారుగా పెట్టి కాళ్లు పైకి లేపి తలక్రిందులుగా ఆ కొమ్ముల మీద నిలబడే వాడు. ఆ ఎద్దు కూడా తన బరువును మోస్తూ పరుగులు పెట్టేది. ఇది చూసే ప్రజలు ఆనందంతో హర్షద్వనులు చేసేవారు.

గంగిరెద్దుల వాడు బోర్లా పడుకుంటే గంగిరెద్దు తన రొమ్ము పైన మరియు తొడల మీద కాళ్లు ఉంచి నిలబడేది. గంగిరెద్దులవాడు సై అనగానే గజ్జల గంటలు మోగుతూ ఉండగా పరుగులు తీసేది. అక్కడ ఉన్న ప్రజలందరూ దీనిని చూసి విస్మయమొంది ఆనందించేవారు. గంగిరెద్దు ఈ విధంగా ఎన్నో విన్యాసాలు చేసేది. పిల్లలు ఈ విన్యాసాలను చూసి చాలా సంతోషించేవారు. విన్యాస ప్రదర్శన పూర్తి అవ్వగానే, బసవన్న! నువ్వు ఇవాళ చాలా చక్కగా పని చేశావు అని అభినందించేవాడు గంగిరెద్దుల వాడు. ఈ గంగిరెద్దుల వాడు తన నేర్పుతో తన విన్యాసాలతో ప్రజలందరి హృదయాలను గెలిచేవాడు.



దానధర్మాలు మరియు పట్టు వస్త్రాలను బహుమతిగా ప్రజలు ఇచ్చేవారు. వారి మనసు కరిగిపోయేలా వారిని అడిగేవాడు. అమ్మలారా! అయ్యలారా! అక్కలారా! తమ్ముల్లారా! మీరంతా గొప్పవాళ్లు దానధర్మాలు చేసి ఈ బసవన్నను ఆదుకొని పుణ్యాన్ని తెచ్చుకోండి అంటూ ప్రదర్శన అయిపోయాక అడిగేవాడు. దొరలు దొరసానులు చేసిన దానధర్మాలు వారు మర్చిపోతారేమో కానీ మేము మర్చిపోము. మీరు ఇచ్చే చిన్న పూచిక పుల్ల అయినా సరే బంగారంగా మేము దాచుకుంటాము. నేను అడుక్కుతినే ఆర్తి వాడను. మీలాంటి వారు మీ ఇంటి వాడను అని సహాయం చేయండి. మీరు కట్టి విడిచిన పాత బట్టలు, ధోవతి, కండువ, చీర ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ బసవన్న శరీరాన్ని కప్పుటకు సాయం చేయండి. మీరు ఇచ్చిన ధర్మాలను ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో చెప్పుకుంటాము. మీరు ఇచ్చినది ఏది కూడా వృధా కాదు. గొప్ప గొప్ప జమీందారులు ఇచ్చినవన్నీ మేము భద్రంగా దాచుకున్నాము. ఒకదాత బసవానికి వెండిగిట్టలు చేయించమని 25 రూపాయలు ఇచ్చాడు. మరో దాన కర్ణుడు బంగారు కొమ్ముల తొడుగులు చేయించమని 116లు ఇచ్చాడు. కొందరు అమ్మలు జొన్నలు, బియ్యము వంటి వాటిని ఇచ్చారు.



ఈ మాటలు విన్న ప్రజలు & గొప్పవారు గంగిరెద్దుల వాడికి మరియు బసవన్న కొరకు దానధర్మాలు సంతోషంతో ఇచ్చారు. గంగిరెద్దుల వాడు కూడా ఆనందంతో వాటిని స్వీకరించాడు. గంగిరెద్దుల వాడు స్త్రీలకి ముత్తెదువతనం కలగాలి అని మీ ఇండ్లు, మీ వాకిళ్లు, మీ ఊరు, మీ పంట, మీ వృత్తిలో చల్లగా బ్రతకాలి అని మీ పిల్లలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దేవుని కోరుతున్న అంటూ.. మళ్లీ తిరిగి వచ్చే సంక్రాంతి రోజున మీ దర్శనం కోసం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విధంగా గంగిరెద్దుల కళా ప్రదర్శనను దాని విన్యాసాలను గంగిరెద్దు అనే ఈ పాఠంలో కవి పల్లా దుర్గయ్య మనోహరంగా శ్రావ్యంగా హృదయాన్ని హత్తుకు పోయే విధంగా వర్ణించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)