కాసులు - Kasulu - Degree 1st Sem Telugu

కాసులు - Kasulu - Degree 1st Sem Telugu

EDU TENSION
0

Class: Degree 1st year
Sem: Degree 1st Sem
Subject: TELUGU
State: Telangana
Lesson: కాసులు
Topic: కాసులు - KASULU Summary pdf
------------------------------

కవి పరిచయం:

కవి: గురజాడ వెంకట అప్పారావు
జననం: రాయవరం, విశాఖపట్టణం. సెప్టెంబర్ 21, 1862
విద్య: బి. ఎ వరకు చాడువుకున్నారు.
ఉద్యోగం: ఉపాధ్యాయుడు, హెడ్ గుమస్తా గా పనిచేసారు.
రచనలు: సారంగధర అనే ఆంగ్ల పద్యాన్ని, కన్యాశుల్కం అనే నాటకాన్ని, దిద్దుబాటు అనే కథను, బిల్హణీయం, కొండుబొట్టీయం అను మొదలైన వాటిని రచించారు.
మరణం: నవంబర్ 30, 1915

కాసులు అను ఈ పాఠంను గురజాడ రచించడం జరిగినది. స్త్రీ పురుషుల మధ్యలో ఉండవలసిన ప్రేమను ఈ పాఠంలో ఒక కథ ద్వారా వ్యక్తపరిచాడు. ఈ పాఠంలో ముఖ్య నానుడిగా - 'ప్రేమించాలి - మరొకరితో ప్రేమించబడాలి' అని చూస్తాము. భార్యాభర్తల శారీరక పరిమితిని దాటి, మానసికంగా బంధం ఏర్పడాలి. అన్యోన్య ప్రేమకు తప్ప స్వార్థానికి వంచనకు తావు ఉండకూడదు అని అని గురజాడ ఈ పాఠంలో చెప్పడం జరిగింది.

kasulu lesson,degree 1st sem telugu, degree 1st semester kasulu, kasulu lesson degree 1st sem

సందర్భం :

ఈ పాఠంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంభాషణను కవి ఈ విధంగా ప్రారంభించాడు. అసలు ఈ గొడవ మన మధ్య ఎందుకు జరుగుతుంది? కారణాలు ఏంటి? ధనం రెండు రకాలు. ఒకటి మట్టిలో పుట్టినది. మరియొకటి హృదయంలో పుట్టినది. ఈ రెండు ఒకే చోట ఉండవు. తీగలకు పువ్వులు ఎంత అందాన్ని ఇస్తాయో... స్త్రీలకి బంగారం అలాంటి అందాన్నిస్తుంది అంటూ ప్రారంభించాడు. ఈ సందర్భంలోనిదే ఈ పాఠం.

KASULU Youtube Video Explanation - CLICK HERE

సారాంశం :

భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమ ఉండాలి. ఒకవేళ, ఆ బంధమే వారి మధ్య లేకపోతే... వారి జీవితం వ్యర్థమవుతుందని ప్రేమ తత్వం గురించి గురజాడ మాట్లాడటం జరిగింది.

సంపదలు:

సంపదకు ప్రతీక బంగారము. బంగారాన్ని ఇష్టపడిన భార్యకి మరియు ఆమె భర్తకు మధ్య జరిగిన గొడవను ఉపయోగించుకొని కవి భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమను తెలియజేశాడు.

భర్త మాట్లాడుతూ - ఈ గొడవ జరుగుటకు కారణం నువ్వేమో బంగారం కావాలి అంటావు! నేనేమో బంగారం కంటే ప్రేమ గొప్పది అని అంటాను! నువ్వేమో కాదు అంటావు! ఇదే కదా మన గొడవకు కారణం. ఒకటి మట్టిలో పుట్టేది అది డబ్బు. రెండవది హృదయంలో పుట్టేది అదే ప్రేమ. ప్రేమ ధనము రెండు ఒకటి కావు. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండవు. రెండు ఒక మానవునిలో ఉండజాలవు. ప్రేమ ఉన్నవారికి ధనం ఉండదు. ధనం ఉన్నవారికి ప్రేమ ఉండదు. భార్య ఏమి తెలుసుకోవాలి? బంగారాన్నా లేక భర్త చూపించే ప్రేమనా? అంటూ ఒక భర్త పాత్రను గురజాడ పరిచయం చేస్తున్నాడు. లోకంలో ఉండే సంపదలు శాశ్వతం కాదు అని తెలిసినా సరే బంగారానికి ఆకర్షింప తగదు. అందరూ ఈ ధనానికి లొంగిపోతారు నీవులంగిపోవడంలో కూడా ఆశ్చర్యమేముంది అంటూ మాట్లాడాడు.

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

బంగారంతో - భార్య అందాన్ని పోల్చుట:

నీవు నీ శరీరానికి పసుపు రాసుకున్నావు, అది బంగారు వర్ణంతో మెరిసిపోతుంది, నల్లని నీ కురులకు నూనె రాచుకున్నావు అది నిగనిగా మెరుస్తుంది, కండ్లకి కాటుక పెట్టుకున్నావు ఆ కాటుక ఎంతో వత్తయినది. నీ నవ్వులో నీ పండ్లన్నీ మిలమిలా తెల్లగా మెరిసిపోతున్నాయి. ఇంత అందంతో కనిపిస్తున్న నీవు ఆ ప్రేమను పంచకపోతే నీ ప్రేమ సరి అయినది కాదు!

లోకంలో ఉన్న వారందరూ ధనం ఉండటం గొప్ప అని అనుకుంటారు. కానీ, అసలైన సంపద ఏదో తెలుసా? ప్రేమను మించిన సంపద ప్రపంచంలో ఏదీ లేదు. ప్రేమ కన్నా గొప్ప ఐశ్వర్యం ఎవరు ఇవ్వలేరు. ఈ లోకంలో అలాంటి సంపద కూడా లేదు. అలాంటి ప్రేమ తత్వాన్ని మనము విమర్శించలేము. ప్రేమ అన్యోన్యంగా ఉండునది. ఏ బంధమునైనా చిటికలో కలుపునది. ప్రేమలేని అనుబంధం చీకటితో సమానం. ప్రేమ అనునది ఆకర్షణకు వ్యామోహానికి సంబంధించినది కాదు. శరీర సుఖాన్ని ఇచ్చేది ప్రేమ కాదు. ప్రేమ సుఖాన్ని ఆశించదు. మనసులో ఉన్నప్పుడు కలిగిన కోరికలు వయస్సుతో పాటు అంతరిస్తూ ఉంటాయి. ప్రేమ మాత్రము శాశ్వతంగా ఉంటుంది. ప్రేమను అందిస్తేనే ప్రేమను తిరిగి పొందుతాం. మాయ లేని ప్రేమ స్త్రీ,పురుషుల మధ్య ఉంటే వారు సుఖంగా జీవించగలుగుతారు.

ప్రేమ గొప్పతనం:

భార్య యొక్క అందము అనే కమల వనానికి భర్త ప్రేమ సూర్యుని వంటిది. సూర్యుని కిరణాలకు కమలం పువ్వు వికసించేటట్లు భర్తలు చూపించే ప్రేమానురాగం ముందు ఏ సంపద అయినను విలువ లేనిదే.

బంగారుతో కాసుల ఆహారం ఇవ్వలేకున్నాను. ఇలా అందమైన ఓ కవిత్వాన్ని రాసి ఇస్తున్నాను అని భావించకు! కావ్యాలు రాయలేని అందమైన అనుభూతి ప్రేమ. ఏ శాస్త్రం ద్వారా వ్యక్తపరచబడినది ప్రేమ. అలాంటి ప్రేమను బోధించే గురువు లేకపోయినా నేను కవిగా రాయగలుగుతున్నాను. నా హృదయములో ఉన్న ప్రేమ అక్షరాలు అనే రత్న రాశులను నింపుకొని ఆ అక్షరాలతో అందమైన కవిత రాస్తున్నాను. ఈ అందమైన కవిత హారమే నీ మెడకు ఓ బంగారు వర్ణము.

భర్త స్నేహితుడిగా:

భర్త దేవుడు అనేది పాత మాట కానీ భర్తనే భార్యకు ప్రాణ స్నేహితుడు అనేది నేటి మాట. అటువంటి నాకు నీ ప్రేమ లభించనప్పుడు ఎంత గొప్ప పదవి ఉన్నా వ్యర్థమే భార్యాభర్తల మధ్య ప్రేమ శారీరక అవధులు దాటి మానసిక అనుబంధంగా మారాలి.

భార్యాభర్తల కలిసి ఉండాలని ఓ చిన్న ఆలోచన ప్రయత్నమే గురజాడ తన కాసులు అనే ఈ కవిత ద్వారా తెలియజేశాడు. సృష్టిలో స్త్రీ, పురుషులకు సమానమైన స్థాయి ఉన్నప్పటికీ పురుష ఆధిపత్యము సమాజంలో ఉన్న స్త్రీని అణిచివేతకు గురి చేస్తుందని, ఓ వినోద వస్తువు గాను, ఆనందాన్ని ఇచ్చే దానిగాను, సమాజం చూస్తుంది అని, స్త్రీకి సమాన గౌరవం ఇవ్వడం లేదు అని, ఆయన ఈ కవితలో సమానంగా పోల్చాడు. నేటి యువతరంలో ఈ ఆలోచనలు మార్పు చెందాలి అని మానవ సంబంధాలలో అనుబంధం పెరగాలి అని కోరుతూ ఆయన రాసినదే ఈ కాసులు అనే కవిత.

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

Post a Comment

0Comments
Post a Comment (0)