Raju Kavi Lesson - Degree 1 sem Telugu PDF material

Raju Kavi Lesson - Degree 1 sem Telugu PDF material

EDU TENSION
0

Class: Degree 1st year
Sem: Degree 1st Sem
Subject: Telugu
State: Telangana
Lesson: RAJU KAVI
Topic: RAJU KAVI LESSON
---------------------------

కవి పరిచయం: 

కవి: గుర్రం జాషువ
జననం: వినుకొండ, గుంటూరు. సెప్టెంబరు 28,  1895
బిరుదులు: కవి కోకిల, మధుర శ్రీనాధ నవయుగ కవి చక్రవర్తి.
ఉద్యోగం: ఉపాధ్యాయుడు, ప్రొడ్యుసర్, సీమలకు వాఖ్యాత
సన్మానాలు: ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన కళాప్రపూర్ణ, పద్మభూషణ బిరుదులతో సత్కరించింది. దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కావ్యానికి సాహిత్య అకాడమి అవార్డు కూడా వచ్చింది.
రచనలు: అనాధ, స్వప్నకథ, గబ్బిలం, క్రీస్తు చరిత్ర మొదలైనవి.
మరణం: జులై 24,1971

RAJU KAVI Youtube Explanation Video - CLICK HERE


raju kavi lesson, raju kavi lesson degree, degree 1 sem telugu, degree 1 sem telugu lessons,

ఒక అబ్బాయి రాజ భవనంలో పుట్టాడు. మరో అబ్బాయి పూరిగుడిసెలో పుట్టాడు. వారు ఇరువురు పెరిగి పెద్దయ్యారు. ఒకరేమో దేశానికి రాజు అయ్యారు. మరొకరు కవి అయ్యారు. రాజుకు అధికారము,సిరి సంపదలు ఉన్నాయి. కానీ కవి దగ్గర మాత్రం కేవలం కావ్యాలు, శతకాలు, కలం వంటి మొదలైనవి ఉన్నాయి. రాజు రత్న కాంతులతో అంతపురంలో జీవిస్తే... రాళ్లతో నిర్మించిన ఇంటిలో కవి జీవిస్తాడు. వీరిద్దరిలో ఎవరి గౌరవం వారిదే. రాజుకు కవి తెలుసు. కవికి రాజు కూడా తెలుసు. అయితే ప్రజలు భయంతో రాజుని పొగడుతారు కానీ జీతం ఇవ్వకుండానే మనుషుల మనస్సును పొందుతాడు కవి. రాజు చేతిలోని కత్తి రక్తాన్ని ఒలికిస్తే, కవి చేతిలోని కలం మాత్రం అమృత కావ్యాలను వ్రాతపూర్వకముగా అందిస్తుంది. రాజు దేశాన్ని పాలిస్తాడు కానీ కవి ఇహలోకాలను పాలిస్తాడు. రాజు మరణిస్తే ఆకాశంలో ఓ నక్షత్రం రాలుతుంది కానీ కవి మరణిస్తే ఆకాశంలో నక్షత్రం మెరుస్తుంది. రాజు రాతి విగ్రహం లో జీవిస్తాడు కానీ కవి మాత్రం ప్రజల నాలుకలలో నానుడిగా జీవిస్తాడు. అని రాజుకి కవికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్రం జాషువా గారు ఈ పాఠములో వివరించడం జరిగింది. ఈ విధంగా వివరించాడు:

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

ఆంధ్ర రాష్ట్ర ప్రణాళికలు:

భారతదేశ స్వాతంత్రం వలన మనము స్వేచ్ఛ పరలమయ్యా ము. ఎప్పుడు భారతీయులు బానిసలు కాదు. తెలుగు జాతికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి అనే నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ ఐక్యమై ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ దేశమంతా సిరిసంపదలతో నిండింది. బ్రహ్మనాయుడు కోరిన విధంగా హరిజనోద్ధరణ ప్రణాళికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మధురమైన కవితలు రాస్తూ కవులు పాటలు పాడారు. తెలుగు ప్రజల ఆశలు నెరవేర్చి మంచి పాలన కొనసాగాలని గీతాలు కట్టారు ఈ విధంగా - పంచవర్ష ప్రణాళికల వల్ల నగరాలు అభివృద్ధి చెందుతాయి నిరుద్యోగ సమస్యలు తీరుతాయి ప్రజల ఆకలి సమస్య తీరుతుంది.

గాంధీ సిద్ధాంతాలు:

దేశం గాంధీ అడుగుజాడలలో నడవాలి. అతని మాటలు పాటిస్తే దేశం బాగుంటుంది. కుల, మత, జాతి, వర్గ బేదాలను విడిచి అందరిని తోటి సోదరులుగా, సోదరీమణులుగా భావించాలి. వారికి ఆహారం పెట్టాలి. పిచ్చి నమ్మకాలను, మూఢ నమ్మకాలను వీడి వెలుగు లోనికి రావాలి. సహనంతోను, అహింసాతత్వంతోనూ సత్య మార్గంలో నడవాలి.

గౌతముడి సిద్ధాంతాలు:

చీమల మరణానికి కన్నీరు కార్చిన గౌతముడు మనకు ఉపాధ్యాయకుడు. తెలుగు రెండు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ మన రాజధాని. మనది రత్న సంపదలు కలిగిన ప్రాంతము. ఒకవైపు వజ్ర వైడూర్యాలు, కోళారు గనులు ఒకవైపు, శ్రీశైల కొండలు ఒకవైపు, గోల్కొండ కొండలు మరో వైపు గా ఉన్న ఉన్నత ప్రాంతం మనది. తెలంగాణలో కరువు తొలగాలి, ఆంధ్రా సిరిసంపదలతో వెలసిల్లాలి.

ముగింపు:

తెలుగు రాష్ట్ర ప్రజలు సోదర భావంతో ఐక్య మత్యంగా ఉండాలి. కలిసి ఉంటే కలదు బలము. మన దేశానికి ఐకమత్యం మేలు చేస్తుంది. మనలో ఈర్ష ద్వేషాలు ఉన్నను.. మనమందరం ఒకే గడ్డమీదివారమని గమనించి ప్రేమానురాగాలు పెంచుకోవాలి. లేకపోతే, అది దేశానికి క్షేమం కాదు. ప్రజలు దూరం కాకూడదు. పొగడ్తలకి, ప్రశంసలకి పొంగిపోరాదు. చదువు ఉందని గర్వంతో విర్రవీగకూడదు. అందరిని సమానంగా చూడాలి, ప్రేమించాలి,.ఆదరించాలి. మానవుడు విశ్వనరుడిగా మారాలని కొత్త లోకం కావ్యం లో జాషువా గారు ఆశించారు.

FOR SEM 1 TELUGU MODEL PAPERS - CLICK HERE

Post a Comment

0Comments
Post a Comment (0)