Class: Degree 2nd Year
Sem: Degree 4th Sem
Lesson: 1. నారద గాన మాత్సర్యం
Lesson: 1. నారద గాన మాత్సర్యం
University: OU
State: Telangana
పాఠం యొక్క సందర్భము:
పురాణాలలో ప్రసిద్ధి చెందిన వారిలో నారద మహర్షి ఒకరు. నారద మహర్షి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నారదుని గురించి తగువులమారి, కలహ ప్రియుడు, కలహ భోజనుడు, అగ్గిపుల స్వామి అను వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ నారదుడు ఏది చేసినా అది మంచి కోసమే, మేలు కోసమే అని ప్రపంచం భావిస్తూ ఉంటుంది. ఈ పాఠం అంత కూడా ముఖ్యముగా ఈ నారదుని గురించి ఉంటుంది. నారదుడు గొప్ప సంగీత విద్వాంసుడు. 'తనకంటే ఎవరు గొప్పగా సంగీతాన్ని వాయించలేరు' అని అనుకుంటూ ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే అది తన అహంకార ఆలోచన. కానీ ఈ నారదుడికి ఒక రోజున తుంబురుడు అను చాలా గొప్ప సంగీత విద్వాంసుడు మీద కన్ను పడింది. అయినను తుంబురుడు తన పాండిత్యాన్ని నీటి కొలది తామర అన్నట్లుగా అవసరమైనప్పుడే ఆ సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించేవాడు.
ఒక సభలో నారదుడు తనకంటే తుంబురునిలో గానకళా నైపుణ్యం ఎక్కువగా ఉంది అని తెలుసుకొని తుంబురునిపై అసూయ పెంచుకుంటాడు. ఎలాగైనా సరే తుంబురుని కంటే గొప్పగానకళా విద్యను నేర్చుకొని గొప్ప విధ్వంసుడు అవ్వాలి అని మహావిష్ణువుకు తపస్సు చేసి మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడు. 'నీ కోరిక ఏమిటి' అని మహావిష్ణువు నారదడిని అడిగితే, నారదుడు - 'గానకలలో తుంబురున్ని గెలిచే విధంగా వరం ప్రసాదించమని' అడిగాడు. అప్పుడు విష్ణువు నేను ద్వాపర యుగంలో వసుదేవుని కుమారునిగా జన్మిస్తాను అప్అపుడు నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నారదుడు ద్వాపర యుగం వరకు ఎదురుచూసి శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ద్వారక అను నగరానికి వెళ్లి అక్కడ శ్రీకృష్ణుని భార్యలైన 1.సత్యభామ, జాంబవతి, రుక్మినీల వద్ద మూడు సంవత్సరాల పాటు శ్రీకృష్ణుని వద్ద ఒక సంవత్సరం పాటు గానకలా విద్యను నేర్చుకొని సంగీత విద్యలో పరిపూర్ణతను సంపాదించాడు.
మణికంధరుడి ప్రశ్న;
నారదుడికి ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు మణికందరుడు కళాభాషిని అనువారు. ఒకరోజు శ్రీకృష్ణుని దర్శనం కోసం నారదుని శిష్యులైన మణికందరుడు కళాభాషిని ద్వారక నగరానికి వెళుతూ ఉండగా శిష్యులలో ఒక శిష్యుడైన మణికంధరుడు నారదుని వీణను మోస్తూ గురువుగారు మీకు తుంబురుని పైన ఎందుకు అంత అసూయ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నారదుడు ఇలా అన్నాడు
నారదుడి సమాధానం:
ఒకానొక రోజున మహా విష్ణువు మరియు లక్ష్మీదేవి సంగీత గాన కళా ప్రదర్శనలో తుంబురుడు ప్రతిభావంతుడు మరియు ప్రావీన్యుడు అని గుర్తించి అతడి గానాన్ని ఆలపించుటకు తుంబురున్ని ఆహ్వానించి తన గానాన్ని విని సంతోషించి అతడిని గొప్పగా సన్మానించారు. నన్ను విడిచి తుంబురుడుని మాత్రమే సన్మానించడం వలన నాలో ఒక అసూయ అనేది ఏర్పడింది. అది గమనించిన నేను శ్రీ మహా విష్ణువుకు తపస్సు చేసి మెప్పు పొంది ఎలాగైనా సరే నేను శ్రీకృష్ణుని భార్యల వద్ద గాన విద్యను అభ్యసించి తుంబురిని మించిన గానకళ ప్రదర్శకుడిగా మంచి నైపుణ్యాశాలిగా ఉండాలని నేను కోరాను అని నారదుడు మణికందురుడు అనే శిష్యునికి ఈ వివరాలను చెప్పాడు.
పాఠ్యభాగ సారాంశము:
ఒక రోజున మహావిష్ణువు దేవతలందరితో కలిసి ఒక సభను నిర్వహించాడు. ఆ సభకు గొప్ప గొప్ప దేవతలు మునీంద్రులు హాజరయ్యారు. ఆ సభకు నేను తుంబురుడు కూడా కలిసి వెళ్లాము. అప్పుడు లక్ష్మీదేవి తన చెలికత్తెలతో ఉద్యానము నుండి బయలు వెడలి మహావిష్ణువు నిర్వహించిన సభకు వస్తూ ఉన్నది. ఎంతో వైభవంతో ఆ సమయంలో దేవతలు అందరూ ఒకచోటకు గుమ్మి కుడారు. అప్పుడు అక్కడ ఉన్న అందరిని విష్ణుభటులు పక్కకు లాఠీలతో కర్రలతో తరిమికొట్టారు. అలా మేము కూడా పక్కకు వెళ్ళవలసి వచ్చింది. దేవతలు కూడా దూరంగా వెళ్లిపోయారు. కొంతసేపు అయిన తర్వాత ఒక రాయబారి వచ్చి నా ప్రక్కన ఉన్న తుంబురుడిని పిలిచి మర్యాదపూర్వకంగా శ్రీమహావిష్ణువుని సభకు తీసుకొని లోపలికి వెళ్ళాడు. అలా తుంబురుడిని సభలోకి ఎందుకు పిలిచారు? అని సందేహం మాకు అందరికీ కలిగింది. నేను కూడా తుంబురుడిని ఎందుకు పిలిచారని ఆలోచిస్తూ ఉన్నా!ఇంతలో మరో రాయబారి ద్వారా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కలిసి తుంబురుడి గానం వింటున్నారని చెప్పాడు. అప్పుడు మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టి తుంబురుని ఆహ్వానించి తన గానాన్ని వింటున్నాడు..! అతను ఏమైనా అంత విద్వాంసుడా? అని ప్రశ్న నాకు కలిగింది. చాలా కోపం వచ్చింది నాకు. అలా నేను ఆలోచిస్తూ ఉండగా.. తుంబురుడు దేవతలు మునుల ముందు ఆశ్చర్యపోయే విధంగా విలువైన వస్త్రాన్ని ధరించి బంగారు పతకముతో మా వద్దకు వచ్చాడు. దేవతలు అందరూ అతనితో - 'శ్రీ మహావిష్ణువు నీకు బహుమతులు ఇచ్చాడా' అనికొందరు.. మరికొందరు లక్ష్మి నారాయణులు కలిసి మీ గానం వినడం గొప్ప బహుమతి అని.. అంటూ వచ్చారు. ఈ మాటలు విన్న నేను చాలా కోపంతో అనసూయపడి మండిపోయాను. ఏ విధంగా అయినా సరే తుంబురుడిని నా సంగీత నైపుణ్యంతో ఓడించి మహావిష్ణువుకు తెలియజేయాలి అని నిర్ణయించుకొని లోపల ఎప్పటిలా తంబరుడితో స్నేహంగా ఉన్నట్లే నటిస్తూ అతని ఇంటికి వెళుతూ వచ్చే వాడిని. ఎందుకంటే తుంబురుడు గానములో గుణ దోషాలు తెలుసుకొని తనపై విజయం సాధించాలి అని అనుకున్నాను.
అలా ప్రయత్నంలో ఉండగా.. ఒకరోజు తుంబురుడి ఇంటిలోకి వెళ్లి తంబురుడు సిద్ధం చేసి ఉంచిన వీణను చూశాను. ఏదో పని నిమిత్తం తొంబరుడు ఇంటి లోపలికి వెళ్ళగా నేను ఆ వీణను పట్టుకొని చూసాను. తుంబురుడి శృతి చేసి ఉంచిన వీణలోనుండి చక్వికని స్నివరాలు వినిపించాయి. తుంబురుని వీణ నైపుణ్యం చూసి తుంబురుని వీణ ప్రావీణ్యత, పాండిత్యం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. నాలో ఉన్న పాండిత్యాన్ని చూసి సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. తుంబురుడులోని పాండిత్య ప్రావీణ్యం ఎంత గొప్పదో నాకు తెలియదు. అయినా అతనిలో ఇంతటి కళా ప్రావీణ్యం దాగి ఉందని నేను ఊహించలేదు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని గ్రహించాను. ఆ రోజు నుండి నేటి వరకు గొప్ప గొప్ప సంగీత మరియు గాన సాధన చేసి విద్వాంసుల వద్దకు వెళ్లి సంగీతాన్ని అభ్యసించి నేర్చుకున్నాను.
అయినను సరే తుంబురుని జయించలేనని నాకు అర్థమైంది. తుంబురుడికి మించిన సంగీత అభ్యాసన నాకు రావాలంటే శ్రీ మహావిష్ణువు వల్ల మాత్రమే నా కోరిక నెరవేరుతుందేమో అని భావించి బాగా తపస్సు చేశాను. మహావిష్ణువు నాకు ప్రత్యక్షమై ఏమి కావాలి అని కోరగా - 'నేను తుంబురుని మించిన గాన కళా పాండిత్యాన్ని ప్రసాదించు అని కోరాను.' అప్పుడు నా కోరికను విని విష్ణువు ఇలా అన్నాడు నేను ద్వాపరయుగంలో వసుదేవుని కుమారునిగా జన్మిస్తాను అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను అని వెళ్ళిపోయాడు. అలా నేను కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూసి అనగా ఎంతో కాలం ఎదురు చూసి శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత సంగీతం సాధన పరిపూర్ణత సాధించాను. మహావిష్ణువు కటాక్షం ఉంటే ఏ సాధన అయినా చేయవచ్చని తెలుసుకున్నాను. కానీ నా శిష్యులైన నీవు(మనికంధరుడు) మరియు కలభాషిణి ఎటువంటి శ్రమ లేకుండా సంగీత సాధన చేస్తున్నారు అని నారదుడు మణికందరుడితో చెప్పాడు.
మణికంధరుడి మాటలు:
మీలాంటి గొప్ప గురువును కలిగి ఉండటం చాలా గొప్ప విషయము. మీలాంటి వారి వద్ద సంగీత విద్యలో పాండిత్య నైపుణ్యం సంపాదించడం మా అదృష్టము అని మణికందరుడు తన గురువైన నారద మహర్షితో అన్నాడు.