Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Lesson: 11.ప్రాజెక్టు
Lesson: 11.ప్రాజెక్టు
University: OU
State: Telangana
ప్రాజెక్టు
ప్రాజెక్టు అనేది ఒక ఆంగ్ల పదము. దీనిని తెలుగులో యోజన, నియోజనం, పథకము అను పదాలతో పిలుస్తాము. సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ప్రణాళికను తీసుకోవాలి. ప్రాజెక్టులో ముఖ్యముగా పరిశీలన, అన్వేషణ, అధ్యయనం అనునవి ముఖ్య పాత్ర పోషించును. ఎంచుకున్న పథకాన్ని బట్టి దానిపైన లోతుగా పరిశీలన చేసి అమలు చేయడమే ప్రాజెక్టులో ముఖ్యమైన అంశము.
PROJECT Youtube Video Explanation - CLICK HERE
మరో మాటలో చెప్పాలంటే, మనం తీసుకున్న లేదా ఎంచుకున్న పథకాన్ని బట్టి క్రియారూపకముగా దానిని ఉనికిలోనికి తీసుకొని రాగలిగితే దానినే ప్రాజెక్టు అని అంటారు. ప్రాజెక్టులు సఫలీకృతం కావాలంటే ఒక క్రమమైన కృషి మరియు పట్టుదల చాలా ముఖ్యము. అప్పుడే ప్రయోజనం కలుగుతుంది.
పనుల తేడాలను బట్టి ప్రాజెక్టులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ప్రాజెక్టులలో కొన్నింటిని మనం చూడగలిగితే -
1. నీటిని నిల్వ చేయడానికి డ్యామ్ ప్రాజెక్టులు
2. భవనాల కట్టడమూల యొక్క ప్రాజెక్టులు
3. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను కూడా మనం ప్రాజెక్టులు అని పిలవచ్చు.
4. సీరియళ్ళు మరియు సినిమాలు తీయడాన్ని కూడా ప్రాజెక్టు అని పిలుస్తూ ఉంటారు.
5. పరిశోధనలను కూడా ఆయా సందర్భాలలో ప్రాజెక్టులు అని పిలుస్తూ ఉంటారు.
Also Read: Degree 6th sem Telugu Model Papers - CLICK HERE
ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ఏమనగా
1. శాస్త్ర సాంకేతిక రంగాలు
2. నీరు, విద్యుత్, రోడ్లు, భవనాలు, మైనింగ్ రంగాలు
3. ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి
4. సాహిత్య, సామాజిక అధ్యయనాలు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు: ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాల ద్వారా ఎన్నో పరిశోధనలు చేస్తూ మానవుని పురోగతి కోసం ఎన్నెన్నో క్రొత్త ప్రాజెక్టులను అమలులోనికి తెస్తున్నాము. ఖగోళ శాస్త్రంలో పరిశోధనల ద్వారా అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు అని.. హైడ్రోజన్ బాంబు నుండి కరోనా కాలం వరకు ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అనగా నేటికీ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక సాంకేతిక రంగాల్లో కూడా టెలిఫోన్ నుంచి చేతిలో ఉన్న మొబైల్ వరకు అంతర్జాల మాయా కాలం వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్టులు అని చెప్పుకోవాలి.
మీరు విద్యుత్ రోడ్లు మరియు భవనాలు మైనింగ్ ప్రాజెక్టులు: నీటి గురించి ఎన్నో ప్రాజెక్టులు మన దేశంలోనూ మరియు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి అందులో తెలంగాణాలో - శ్రీరాంసాగర్ నిజాంసాగర్ వంటివి, ఆంధ్రలో - పోలవరం మరియు తదితర ప్రాజెక్టులు మనము తెలుగు రాష్ట్రాలలో చూస్తాము. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టును కూడా మనం చూడవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన భవనాల ప్రాజెక్టులు, రోడ్లు వేయటం వంటి ప్రాజెక్టులు కూడా మనము చూడవచ్చు. భూమి లోపలి భాగంలో ఉన్న ఖనిజాల కోసం వెతుకు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ రెండవ భాగంలో మనము వీటన్నింటిని చూడవచ్చును.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు: రాష్ట్ర ప్రజల కోసం ఆయా ప్రభుత్వాలు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో మనకు తెలిసినవి - 108 అంబులెన్స్ పథకం, ఆరోగ్య శ్రీ పథకం, విద్యార్థులకు అమ్మబడి, వృక్షో రక్షితి రక్షితః, హరితహారం వంటి ప్రాజెక్టులు కూడా మన తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం. భూ పంపిణీ పథకాలు కూడా అందులో భాగమే.
ప్రాజెక్టును ఎలా చేయాలి?
ప్రాజెక్టు కొరకు ముందుగా అంశాన్ని ఎంచుకోవాలి. అందుకు సరిపడా ఆర్థిక వ్యయాన్ని చూసుకోవాలి. కావలసిన పరికరాలు, కావలసిన మానవ శక్తి చూసుకొని ప్రాజెక్టును ప్రారంభించాలి. మనం నిర్ణయించిన ప్రాజెక్టు కొరకు సహనం, పట్టుదల, కృషి, ఓర్పు, శాంతం కావాలి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నేపథ్యాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభించాలి. ప్రాజెక్టును మంచి ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికలతో, మానవునికి ఉపయోగపడేలా - ప్రగతికి శ్రేయస్సు కలిగేలా మనం రూపొందించాలి.