అధ్యయనం - Adhyayanam Lesson - Degree 6th sem telugu material

అధ్యయనం - Adhyayanam Lesson - Degree 6th sem telugu material

EDU TENSION
1
Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Subject: Telugu
Lesson: 12. అధ్యయనం
State: Telangana

అధ్యయనం, adhyayanam lesson, degree 3rd year telugu, degree 6th sem, degree 6th sem telugu, degree 6th sem telugu lesson

అధ్యయనం అను తెలుగు పదాన్ని ఆంగ్లంలో స్టడీ అని అంటారు. మనిషి సంఘజీవి. సమాజాన్ని మరియు సంఘాన్ని అనుకరిస్తూ మానవుడు జీవిస్తాడు. సంఘ జీవితంలో కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు చేస్తూ ఉంటాడు. మనిషి కొన్ని సందర్భాలలో కొత్తదారులలో నడుస్తాడు. కానీ, ఈ ప్రయత్నాల్లో అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటాడు. ఈ సమస్యలను తొలగించుకోవడానికి విద్య అనేది అవసరము. జ్ఞానము ద్వారా విషయాల పట్ల అవగాహన పొందుతాడు. అవగాహన ద్వారా విషయాన్ని విశ్లేషించి అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది.

ADHYAYNAM Youtube Video Explanation - CLICK HERE


అధ్యయనం వలన మేధాశక్తి వికసిస్తుంది. ప్రజల ప్రయత్నాలకు జ్ఞానాన్ని జోడిస్తే మరింత అభివృద్ధి చెందుతారు. అందువలన అధ్యయనం అనేది ఎంతో ప్రాముఖ్యము. జ్ఞానాన్ని విస్తరింప చేయడానికి వాస్తవికతను తెలియజేయుటకు అధ్యయనం తోడ్పడుతుంది. అధ్యయనం అనేది కేవలం ఒక గుంపుకు చెందినది కాదు. అధ్యయనం అనేది ముఖ్యముగా విద్యార్థికి ఉపాధ్యాయులకు అవసరమవుతుంది. మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి మానవుడే. విద్య అభ్యాసం నుండి జ్ఞానాన్ని పొందగలిగే సామర్థ్యం మానవునికి మాత్రమే ఉంది.

Degree 6th Sem Telugu Model Papers - CLICK HERE



పాఠకుడు తనకు నచ్చిన రచనను లేదా నవలను చదివి ఆనందిస్తే... విశ్లేషకుడు లేదా పరిశోధకుడు మాత్రం అధ్యయనం చేసే సందర్భంలో నూతన విషయాలను తెలుసుకున్నప్పుడు ఆనందం చెందుతాడు. ఒక ప్రాజెక్టును చెయ్యాలి అని ప్రారంభిస్తే ఖచ్చితంగా అధ్యయనం అనేది అవసరం. దాని కొరకు ఎంతో మంది సలహాలు తీసుకోవాలి. ఎంతమందో విజ్ఞుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. వాటి మీద అవగాహన ఉన్న వారిని తెలుసుకోవాలి. వాటిపైన ప్రయోగాలు చేయాలి అప్పుడే అధ్యయనం సాధ్యపడుతుంది



అధ్యయనం చేయాలంటే ముందుగా ప్రేరణ అనేది అవసరము. తాను ఎన్నుకున్న విషయాన్ని సాధించేవరకు తన అధ్యయనం ఆపకూడదు. అధ్యయనంలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు వస్తూ ఉంటాయి. వాటిని దాటి విజయం సాధించడానికి ప్రయత్నించాలి. ప్రతి కోణంలో నుండి అధ్యయనం చేసే విషయాన్ని చూడగలగాలి. విషయాన్ని బాగా వివరణాత్మకముగా అర్థం చేసుకొని ముఖ్య సమాచారాన్ని పెన్నుతో పేపర్ మీద వ్రాయాలి.



ఆసక్తి కలిగిన వారు పర్యవేక్షకునితో అంశాన్ని చర్చించాలి. ఆ అంశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో కూడా చెప్పగలిగే హేతుబద్ధమైన కారణం ఉండాలి. దానికి ప్రణాళికలు ఈ క్రింది విధంగా సిద్ధం చేయాలి.



1. పర్యవేక్షకుని మాట
2. శీర్షిక
3. పూర్వపు అధ్యయనాలు
4. పదసేకరణ, పదజాలంపై - అధ్యయనం
5. బృందములో ఉన్న సభ్యులు - వారు సేకరించిన పదాలు
6. అనుభవాలు - అవగాహన



పైన చెప్పబడిన రీతిలో ప్రాజెక్టును పూర్తి చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వ్రాయడాన్నే అధ్యయన ప్రణాళిక అని అంటారు.

Post a Comment

1Comments
Post a Comment