Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Lesson: 14.నివేదిక
Lesson: 14.నివేదిక
State: Telangana
నివేదిక అనగా ఆంగ్లంలో REPORT (రిపోర్ట్) అని అంటారు. అధ్యయనం మరియు పరికల్పన ఆధారంగా మనం ఎంచుకున్న విషయాన్ని వివర్ణాత్మకంగా చెప్పుటను నివేదిక అని అంటారు. ఈ నివేదిక అనునది పరిశోధన యొక్క ఫలితాలను తెలియజేస్తుంది. ఈ నివేదికను లిఖితపూర్వకముగా వ్రాయవలెను. ప్రాజెక్టు అనే పాఠంలో - ఏమి చేస్తాము ఎలా చేస్తాము? అనేది పరికల్పన ద్వారా తెలియజేస్తే... ఏమి చేశాము? ఎలా చేశామో? అనునది నివేదిక వివరిస్తుంది.
NIVEDIKA Youtube Explanation Video - CLICK HERE
నివేదికలోని రకములు: నివేదిక అన్నది పలు రకాలుగా ఉంటాయి. పరిశోధన యొక్క అంశాన్ని బట్టి విస్తృతిని బట్టి స్వరూపాన్ని బట్టి ఈ నివేదిక అనేది మారుతూ ఉంటుంది. ఈ నివేదిక అనునది రెండు రకాలు.
1. వాగ్రూప వేదిక
2. లిఖిత పూర్వక నివేదిక
వాగ్రూప నివేదికనునది అమెరికా వంటి గొప్ప దేశాల్లో వాడుకలో ఉన్నది. ఇక లిఖిత పూర్వక నివేదిక గురించి ఆలోచిస్తే -
1. ఇది సాధారణ జనాన్ని ఉద్దేశించింది
2. అధికారికి అందించేది
3. సాంకేతిక నివేదిక.
1. ఇది సాధారణ జనాన్ని ఉద్దేశించింది
2. అధికారికి అందించేది
3. సాంకేతిక నివేదిక.
ఇది మూడు రకాలు వీటిలో సాంకేతిక నివేదిక ద్వారా ఒక పరిశోధకుడు మరొక పరిశోధకునికి సమాచారాన్ని పంచుకొనుటకు వీరుగా ఉంటుంది. గనుక ఈ సాంకేతిక నివేదికలో - 1. విపుల నివేదిక 2. ఏక విషయ సంబంధ నివేదిక 3. పత్రికల్లో వ్యాస నివేదిక 4. సంపూర్ణ సాంకేతిక నివేదిక అని ఎన్నో రకాలు కలవు.
Also Read: Degree 6th Sem Telugu Model Papers - CLICK HERE
నివేదికనునది సూటిగా తేటగా సుస్పష్టంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ నివేదిక ఐదు రకాలుగా ఉంటుంది.
నివేదిక ఐదు రకాలు:
1. ఒకటి శాస్త్రీయ నివేదిక
2. దర్యాప్తు నివేదిక
3. సాంకేతిక నివేదిక
4. ప్రదర్శన నివేదిక
5. వివరణత్మక నివేదిక మొదలగునవి.
పైన చెప్పబడిన ఈ నివేదికలు చాలా ముఖ్యమైనది. ఈ నివేదికానున్నది ప్రాజెక్టు పనిలో ముగింపు భాగమై ఉన్నది. ప్రాజెక్టు చేయువారు కచ్చితంగా నివేదికను కూడా తయారు చేయవలసి ఉన్నది. తాము సేకరించిన విషయాన్ని నివేదిక రూపంలో సమర్పించాలి. ఈ నివేదిక అనునది పరిశోధకులు & అన్వేషణ పై ఆధారపడి ఉండును. నివేదిక తయారు చేయువారు కూడా తగిన అడుగులు వేస్తూ దానిని రూపొందించాలి. సులభంగాను అర్థం అయ్యేవిధంగాను తేటగాను బాష దోషములు లేకుండా పద దోషములు లేకుండా వాక్య దోషములు లేకుండా స్పష్టమైన పద్ధతిలో నివేదిక ఉండాలి.
ప్రాజెక్టు నివేదికలో మూడు భాగాలు కలవు.
1. ప్రణాళిక
2. విషయభాగం
3. సంకలనం
1. ప్రణాళిక భాగంలో - పరిశోధన యొక్క నిర్వహణ విధివిధానాలు ఆర్థిక విషయాలు ఒక ప్లాన్ ఈ భాగంలో ఉంటుంది.
2. విషయ భాగంలో - పరి పరిశోధన ద్వారా తేలిన అంశాలు ఈ భాగంలో ఉంటాయి
3. సంకలన భాగంలో - తప్పులు దొరలకుండా విరామ చిహ్నాలతో చక్కటి వ్యాకరణంతో దానిని రాశి వ్రాసి సమర్పించాలి.
ఉస్మానియా విద్యార్థులు మానవుని జీవావరణ అవశేషాల నుండి పరిశోధన చేసి ఒక నివేదికను రూపొందించారు. ఆయా కళాశాలల్ఇలో వివిధ ప్లారాజెక్టులు చేసి వాటికీ సంబంధించిన నివేదికను విద్యార్థులు చేస్తూవుంటారు. ప్రాజెక్టు చేసిన వారు నివేదికను పూర్తి చేయవలెను. ఎంచుకున్న పాఠాన్ని ఎంచుకున్న అంశాన్ని బట్టి నివేదిక సమర్పించవలయును.