Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Sem: Degree 6th Sem
Lesson: 7. వార్త నిర్మాణం
University: OU
State: Telangana
వార్త నిర్మాణం అని ఈ పాటను అర్థం కావాలంటే వార్త అను పాఠమును మీరు ముందుగా చదివి ఉండాలి.
జరిగిన సంఘటన యొక్క ప్రధాన విషయ సారాన్ని ఒకటి లేదా రెండు వాక్యాల్లో సంక్షిప్తంగా రాయటానికి లీడ్ అని అంటారూ. దీనిని మకుట వాక్యము అని కూడా పిలుస్తూ ఉంటారు. వార్త రచనలు మొదటి వాక్యము మరియు మొదటి పేరా చాలా కీలకమైనవి. ఒక సంఘటన గురించి ప్రధాన వివరాలు తెలియజేసేది మొదటి పేరానే. లీడ్ స్థలంలో కాలం, వార్త, సారాంశం, సూటిగా క్లుప్తంగా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. వార్తలోనికి సూటిగా పాఠకుని ఇది నడిపిస్తుంది కనుక దీనిని లీడ్ అని అంటారు. చదువరులకు ఈ లీడ్ అన్నది వార్తను పరిచయం చేస్తుంది. గనుక దీనిని INTRO (ఇంట్రో) అని కూడా పిలుస్తారు. ఈ ఇంట్రో వ్రాయడానికి కూడా నైపుణ్యం ఉండాలి. లీడ్ బాగా రాయగలిగితే చదువరి యొక్క మనసును వార్తలోనికి సులభంగా లాగవచ్చును. రాసే పద్ధతి బాగా లేకపోతే పాఠకులు మరో వార్తకు వెళ్తారు. ఒకవేళ లీడ్ తరచుగా బాగా లేకపోతే పాఠకులు మరో దినపత్రికను ఎన్నుకుంటారు.ఆంగ్ల పత్రికలలో మాత్రం లీడ్ అన్నది 30 నుండి 50 పదాల్లో ఉంటుంది. కొన్ని వార్తలను చూస్తే 23 నుండి 33 పదాల మధ్యలో లీడ్ ఉంటుంది. విలేకరులు సమాచారాన్ని సేకరించి ప్రధాన విషయాన్ని ముందుగా వ్రాసి పత్రిక కార్యాలయానికి పంపితే ఆ సమాచారాన్ని ఉపసంపాదకులు ఎడిట్ చేసి ప్రధాన విషయం లోపించకుండా చూస్తారు. అందుకు లీడ్ అనేది అవసరము. పనుల ఒత్తిడిలో ఉన్నవారు అందరూ లీడ్ ను చదివి పూర్తి వార్తలు చదవాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. వార్తలోని ముఖ్యాంశాలను బయటకు తీసి ఆ విషయాన్ని లీడ్ ద్వారా పాఠకులకు ఆసక్తి కలిగేలా అందిస్తారు విలేఖరులు మరియు ఎడిటరులు.
జర్నలిజం ప్రారంభమైన రోజులలో వార్తలు టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారం అయ్యేవి. టెలిగ్రాఫ్ ద్వారా ప్రసార ప్రసారమయ్యే సమయాలలో కొన్నిసార్లు అంతరాయం కలిగి పూర్తి సమాచారం అందకపోవటంతో ప్రచురణకు ఇబ్బంది కలిగేది. అలా ప్రచురణకు ఇబ్బంది లేకుండా ఉండుట కొరకు లీడ్ ద్వారా వార్తను తెలపటం ప్రారంభించారు. రేడియో వచ్చిన తర్వాత టెలిగ్రాఫ్ ఉపయోగం తగ్గింది. లీడ్ లో మార్పులు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వార్తను గురించి ఒకే సర్వే చేయగా అందరూ కూడా లీడ్ సంక్షిప్తంగా ఉండాలని కోరారు. అప్పటినుండి లీడ్ లోని పదాల సంఖ్య లో 23 కు తగ్గించారు.
లీడ్ సూత్రము:
ఫైవ్ డబల్యూస్ + వన్ హెచ్ ను లీడ్ సూత్రం అంటారు. ఏమనగా - WHAT, WHEN, WHO, WHY, WHERE మరియు WHO. లీడ్ లో ఈ ప్రశ్నలకు జవాబు ఉండాలి. ఈ లీడ్ లో ఒకటి రెండు ప్రశ్నలకు జవాబులు ఉండకపోవచ్చు. ఈ లీడ్ ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాం.
సుందర్ లాల్ బహుగుణ అస్తమయం
దేహారాడూన్: (మే 21 న్యూస్ టుడే) ప్రముఖ పర్యావరణవేత్త చిప్కో ఉద్యమనేత సుందర్లాల్ బహుగుణ 94 సంవత్సరాలు నిదినవాడై కన్నుమూశారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయాసవులకు ఆయనకు కరోనా సోకులంతో ఈ నెల 8వ తేదీన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రమవ్వడముతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేక ఆయన రిషికేశ్లో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
ఈ వార్తను గమనిస్తే..
ఈ వార్తలో=
డేట్ లైన్: దేహారాడూన్, మే 21, న్యూస్ టుడే
ఏమిటి: అస్తమయం
ఎవరు: సుందర్ లాల్ బహుగుణ
ఎప్పుడు: శుక్రవారం మధ్యాహ్నం
ఎందుకు: ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో
ఎలా: కరోనా సోకి
ఈ లీడ్ లో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఇలా లీడ్ లో కేవలం పై పైన ఉన్న విషయాలు మాత్రమే చెప్పబడి.. మిగితా పూర్తి వివరాలు మరియొక పేజీలో కొనసాగుతుంది.
ఎడిటింగ్:
ఈ మీడియా రంగములో పనిచేయువారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనా సరే, నిర్ణిత కాలంలోపు ఆ వార్తను పూర్తి చెయ్యాలి. ఈ క్రమములో విలేఖరి నుండి ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలు సక్రమముగా పూర్తి చేయాలి. తగిన మార్పులు చేసే పని ఎడిటింగ్ ప్రక్రియలో చేరుతుంది. ఎడిటింగ్ అనునది పత్రికలో ప్రధాన భాగము.నిర్వచనం:
ప్రచురణకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, రచించి, పేజీలను మార్పు చేయడం, రాత ప్రతిని సరిదిద్దడం, తిరగరాయడం, అనవసరమైన పదాలను తొలగించడం, ఉచితమైన పదాలను కలపడము, పత్రిక రూపకల్పనకు పర్యవేక్షణ చేయడమే ఎడిటింగ్ అని నిఘంటువు అర్థమిచుచున్నది. ఒక మాటలో చెప్పాలంటే - విలేఖరులు తెచ్చిన సమాచారాన్ని మార్పులు చేసి పాఠకులకు కావలసిన రీతిలో అందించటాన్నే ఎడిటింగ్ అని అంటారు.ఎడిటింగ్ అవసరత:
1. విలేఖరులు తెచ్చిన వార్తల్లో తప్పులు సరిచేయాలి.2. వాక్య నిర్మాణాన్ని సరిచేయాలి.
3. అనవసరమైన విషయాలను తొలగించాలి
4. వార్తకు శీర్షిక మరియు లీడ్ రాయాలి
5. వార్త చట్టరీతిగా ఉన్నదో లేదో చూడాలి
6. వార్తలను సంక్షిప్తంగా వ్రాయాలి
7. ఏ పేజీలో ఆ వార్తను ఉంచాలో నిర్ణయించాలి
8. వార్తకు సంబంధించిన ఫోటోలను సరిగా ఎంపిక చెయ్యాలి
9. పద దోషాలు లేకుండా వాక్యాలను సరిచేయాలి
10. విలేఖరి అభిప్రాయాలు ఉంటే వాటిని తొలగించాలి
11. సాక్ష్యాధారాలు లేని వార్తలను తొలగించాలి.
12. పత్రికా శైలికి అనుగుణంగా వార్తను వ్రాయాలి.
ఎడిటింగ్ నిర్మాణం:
ఈ ఎడిటోరియల్ భాగానికి ఎడిటర్ బాధ్యత వహిస్తారు. పని సౌలభ్యం కోసం పనిని ఈ విధముగా విభజిస్తారు.1. జనరల్ డెస్క్
2. స్పోర్ట్స్ డెస్క్
3. ఫారిన్ డెస్క్
4. సిటీ డెస్క్
5. కల్చరల్ డెస్క్
6. బిజినెస్ డెస్క్
ఇలా ప్రతి డెస్క్ కు న్యూస్ ఎడిటర్ ఉంటారు.
సబ్ ఎడిటర్: సభ్ ఎడిటర్లు విలేకరులు పంపిన వార్తలను తగిన పద్ధతిలో రూపొందించి దానికి శీర్షిక పెట్టి ప్రచురణ కోసం సిద్ధపాటు చేయాలి. కొన్ని శీర్షికలను చూస్తే శీర్షిక ప్రాధాన్యత తెలుస్తుంది. 1983 లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు - తెలుగుదేశం సూపర్ హిట్ అని...
శ్రీ శ్రీ చనిపోయినప్పుడు 'శ్రీ శ్రీ మహాప్రస్థానం' వంటివి. జర్నలిజంలో లీడ్ మరియు ఎడిటింగ్ ముఖ్య విషయాలు. ఈ రెండింటి పై అవగాహ పెంచుకొని నైపుణ్యాలు సంపాదిస్తే వ్యక్తీకరణ సరళంగా ఉంటుంది.