Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Sem: Degree 6th Sem
Subject - Telugu
Lesson: 4 - జీవిత చరిత్ర
State: Telangana
Lesson: 4 - జీవిత చరిత్ర
State: Telangana
సాహిత్యంలోని ప్రక్రియలలో జీవిత చరిత్ర ఒకటి. తెలుగు సమాజంలో రాజకీయ, ఆర్థిక మార్పులు సాహిత్య సంస్కృతిక రంగాల్లో మార్పులకు కారణమయ్యాయి. అయితే ఈ సమాజంలో ఎదిగిన ప్రముఖుల జీవితం అందరికీ అనుసరణీయం మరియు ఆదర్శనీయమం అవుతాయి. ఈ క్రమంలో జీవిత చరిత్రలు ఉద్భవించాయి. తెలుగులో జీవిత చరిత్రల రచన 19 వ శతాబ్దిలో మొదలైంది.
Also Read: Degree 6th sem Telugu Model Papers - CLICK HERE
నిర్వచనం:
ఒక వ్యక్తి జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అని పిలుస్తూ ఉంటారు. విభిన్న రంగాల్లో కృషి చేస్తూ సమాజం పట్ల ప్రభావం చూపించే వ్యక్తుల జీవితాలు అక్షరంగా మారితే అవే జీవిత చరిత్రలు. చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక, సామాజిక వంటి రంగాలలో ప్రముఖ పాత్ర పోషించిన మహా ఆదర్శవంతుల జీవితాల గురించిన రచనలే జీవిత చరిత్రలు. జీవిత చరిత్రల గురించి చిలకమర్తి నిర్వచిస్తూ - "వ్యక్తిలోనే గుణగణాలను లోతుగా తరచి చూసి ఒక మాలికలుగా తయారు చేయాలి. దానికి ఒక రూపం వచ్చి అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది" అని అన్నాడు.లక్షణాలు:
1. చరిత్రకు ఉండే సత్యము సాహిత్యానికి ఉండే రమణీయత కలిసి పాఠకులకు జీవిత చరిత్రగా అనుభూతిని ఉపదేశాన్ని అందించాలి.2. ఆసక్తి దయకముగాను స్ఫూర్తిదాయకముగాను జీవిత చరిత్రలు ఉండాలి.
3. జీవిత చరిత్రలలో ఒక రంగంలోని ప్రసిద్ధమైన వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.
4. జీవిత చరిత్రలో భాషా సరళ సుందరంగా ఉండాలి.
5. జీవిత చరిత్రలు సామాన్యులకు అర్థమయ్యేలా ప్రేరణ కలిగించేలా ఉండవలెను.
6. జీవిత చరిత్రలో కీలక విషయంలోనూ తప్పక చెప్పాలి.
7. జీవిత చరిత్రలలో మంచి ప్రారంభం ముగింపు ఉండాలి.
8. జీవిత చరిత్రలలో కల్పనలు, ఊహలు, కథలు ఉండరాదు.
9. జీవిత చరిత్రలో వాస్తవములు మాత్రమే వ్రాయవలెను.
10. జీవిత చరిత్రలో సరళ వచ్చిన శైలి ఉండాలి.
వికాసం:
జీవిత చరిత్రను ఆంగ్లంలో బయోగ్రఫీ అంటారు. మహాపురుషుల జీవిత చరిత్రలు సమాజానికి వికాసం కలిగిస్తాయి. జీవిత చరిత్రలలో ఏ రంగంలో కృషిచేసిన వ్యక్తి గురించి అయినా రాయవచ్చు. భారతదేశంలో అచ్చుయంత్రం ప్రారంభమైన తర్వాత ఎందరో రచయితలు పుట్టుకొచ్చారు. వారు రాసిన వాటిల్లో జీవిత చరిత్రలు కూడా ప్రాముఖ్యమైనవే. అందులో కందుకూరి - రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర రాశాడు. అప్పుడే జీసస్, విక్టోరియా రాణి, బుద్ధుడు, గురుగోవింద్ సింగ్ యొక్క జీవిత చరిత్రలు కూడా వచ్చాయి. వడ్లమూడి వెంకటాచలం గారు - దయానంద గారి జీవిత చరిత్రను రాశాడు. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి - లింకన్, అశోకుడు, చంద్రగుప్తుడు, శివాజీ తదితరుల జీవిత చరిత్రలను ప్రచురించింది. ఆంధ్ర భాషాభివృత్తిని రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర, విద్యాసాగర్ వంటి మహాపురుషుల జీవిత చరిత్రలను ప్రచురించారు.జాతీయ ఉద్యమంలో బులుసు, వెంకటేశ్వర్లు, రామతీర్థ, వివేకానందుల జీవిత చరిత్రలను రామకృష్ణ మఠం ప్రచురించింది. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, గాంధీజీ, ఆచార్య రంగా, నార్ల వెంకటేశ్వరరావు, చలం, కట్టమంచి వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను రాశారు. ఏడిద, కామేశ్వరరావు, కృపలాని, అరుణ, అశోక్, అలీ జీవిత చరిత్రలను - రాఘవ శాస్త్రి పటేల్, విజయలక్ష్మి పండిత్ జీవిత చరిత్రలను రాశారు.
నిడదవోలు వెంకట్రావు చిన్నయ్య సూరి జీవిత చరిత్ర, రాళ్లపల్లి వేమన జీవిత చరిత్ర, చిలుకూరి వీరభద్రరావు, లక్ష్మీకాంతశాస్త్రి, తిరుపతి వెంకట కవులు, ముదిగొండ జగన్నాధ శాస్త్రి, వినాయక సావర్కర్ జీవిత చరిత్రలను రాశారు. చాగంటి శేషయా - ఆంధ్ర కవి తరంగణి పేరుతో కవుల జీవితాలను 13 సంపుటాలుగా ప్రచురించాడు. తిరుపతి వెంకట కవులు - బుద్ధ చరిత్ర, దుబ్బాక రాజశేఖర్ అవధాని రానా ప్రతాప్ సింగ్, గడియార వెంకట శాస్త్రి శివభారతం, ముదిగొండ వీరభద్ర మూర్తి, ఆంధ్ర కేసరి, కొండవీటి కవి నెహ్రూ చరిత్ర. జాషువా ఏసుక్రీస్తు చరిత్రలను పద్య రచనలుగా వెలువరించారు. బండారు అచ్చమాంబ మహిళల జీవితాలను ఉన్నవ లక్ష్మీనారాయణ అక్బర్ జీవితాన్ని రచించారు.
తెలంగాణ ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి జీవిత చరిత్రను ఎమ్ ఎల్ నరసింహారావు జయప్రకాష్ నారాయణ రామానంద తీర్థ పీవీ నరసింహారావు జీవిత చరిత్రలను రాశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వెల్దుర్తి మాణిక్యరావు నేతృత్వంలో వీర సావర్కర్ జవహర్లాల్ నెహ్రూ ఎం ఎన్ రాయల్ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రలు ప్రచురించింది ఉన్నతల కేశవరావు బూర్గుల రామకృష్ణ రావు జీవిత చరిత్రను రాశారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలను తెలుగులోకి అనువాదం చేయించింది.
స్త్రీల జీవిత చరిత్రలో - కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన "నిర్జన వారధి", మరియు పద్మిని అనువదించిన - బెంగళూరు నాగరత్నమ్మ అను జీవిత చరిత్ర ముఖ్యమైనవి. కేవీ రమణారెడ్డి గురజాడ జీవిత సాహిత్యాలు..
కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జీవిత చరిత్రలకు ప్రోత్సాహపరిచాయి. భారతీయ సాహిత్య నిర్మాతలు పేరుతో సాహితిరి ప్రముఖులైన వారి జీవిత చరిత్రలను పరిచయం చేసింది.
తెలుగు విశ్వవిద్యాలయం - 2012 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ జీవిత చరిత్రలను ప్రచురించింది.
జీవిత చరిత్రలు రచించేవారు పాటించవలయును:-
1. వ్యక్తి జీవితాన్ని విశ్వాసినియంగా చూయించాలి.2. జీవిత చరిత్ర రాస్తే వ్యక్తి చిత్రకారుడిగా పని చేయాలి.
3. గొప్ప వారి నుండి ఇతరులు స్ఫూర్తి పొందే విధంగా జీవిత చరిత్రలు వ్రాయాలి.
4. దేశము కోసం, ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన వారి కారణంగా ఇతరులు ప్రేరణ పొందే విధంగా వ్రాయవలెను.
5. రచనల్లో యధార్థమైన, వాస్తవమైన విషయాలు మాత్రమే చోటు ఇవ్వాలి.
6. ఆనాటి సామాజిక పరిస్థితులు తెలపాలి.
7. శైలి ఆసక్తికరముగాను, స్పష్టంగాను, తేటగాను ఉండాలి.
8. అతిశయోక్తులకు చోటు లేకుండా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వ్రాయాలి.
9. జీవిత చరిత్రలు వ్యాస రూపంలో మరియు వచన రూపంలో ఉండవలెను.
సిపి బ్రౌన్ గురించి జానుమద్ది హనుమత్ శాస్త్రి జీవిత చరిత్రను రాశాడు. బ్రౌన్ తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఓ ఆంగ్లేయుడు. ఆయన రాతప్రతులను తాలప్రతులను సేకరించి గ్రంధ పరిష్కరణ చేశాడు. నిఘంటువు నిర్మించాడు కూడా. బ్రౌన్ జీవిత చరిత్రలో అవాస్తవాలు లేవు. జీవిత చరిత్ర నిర్మాణాలను పాటించిన మంచి గ్రంథం ఇది. బ్రౌన్ జీవితంలోని అన్ని ప్రధాన విషయాలు ఇందులో ఉన్నాయి.
సిపి బ్రౌన్ గారు మత సంబంధమైన విషయాలను, గ్రీకు, లాటిన్ వంటి భాషలను నేర్చుకున్నాడు. 1820 లో కలకత్తా రాష్ట్రంలో ఉద్యోగం చేసి ఆంధ్రప్రదేశ్ లోని కడపలోను మచిలీపట్నంలోనూ రెండు పాఠశాలలు ప్రారంభించాడు. ఉచితంగా చదువు చెప్పే సదుపాయం కల్పించాడు. కానీ, తెలుగులో చదవదగిన సాహిత్యం లేదని కొంతమంది నిరుత్సాహపరిచారు. అయినా సరే ఆయన స్థిర హృదయంతో తెలుగు భాష సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. 300 వేమన పద్యాలను సేకరించి ఆంగ్లభాషలోనికి అనువదించాడు. కడప జిల్లాలోని 20 మంది పండితులతో సాహిత్య సముద్రరణ మహా యజ్ఞం జరిపాడు. సొంత గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాయించాడు. తెలుగు నుండి ఇంగ్లీష్ కు నిఘంటువును కూడా తయారు చేశాడు. పక్షవాతానికి గురై తిరిగి లండన్ వెళ్లినా... అక్కడ కూడా తెలుగు సాహిత్యం కోసమే కృషిచేసి నిఘంటువును తయారు చేశారు. వ్యాకరణాన్ని సవరించి 86వ సంవత్సరంలో వీలునామా రాస్తూ... రాసిన దాని నిండా పుస్తకాలకు సంబంధించిన విషయాలే. తెలుగు సాహిత్యానికి బ్రౌన్ మూలపురుషుడు అని చెప్పాలి. వీరి కారణంగా జానుమద్ది హనుమచ్చాస్త్రి కడపలో గ్రంథాలయం నెలకొల్పాడు. ఇతని జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.
ఈ విధంగా మన చుట్టూ ఉండే గొప్పవారైనా మరియు ఉన్నతమైన వ్యక్తుల జీవితాలను పరిశీలించి, అధ్యయనం
చేసి వారి జీవితాలను జీవిత చరిత్రలుగా వ్రాయవచ్చును.