ఉపన్యాస కళ - Upanyasa Kala - OU Degree 6th sem telugu Textbook PDF

ఉపన్యాస కళ - Upanyasa Kala - OU Degree 6th sem telugu Textbook PDF

EDU TENSION
0
Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Subject - Telugu
Lesson: 5 - ఉపన్యాస కల
State: Telangana

ఉపన్యాస కల, vupanyasa kala lesson notes pdf, degree 6th sem telugu material pdf, OU degree 6th sem telugu material pdf

ఎంతో ప్రతిభ ఉన్న విద్యార్థులైనా సరే కొన్ని పర్యాయాలు వేదిక ఎక్కి మాట్లాడమంటే భయపడతారు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నా వ్యక్తం చేయలేని అయోమయంలో ఉండి ఎంతో జ్ఞానం ఉన్న ప్రకటించే ధైర్యం లేక వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆత్మాన్యున్నత భావం విద్యార్థుల్లోనూ కొంతమంది అధ్యాపకుల్లోనూ కనిపిస్తుంది. కొందరు వేదిక ఎక్కి మాట్లాడుతూ ఉండగా చేతులు కాళ్లు వనకడం చమటలు పట్టడం మాట తడబడడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యకు కారణాలు విశ్లేషించకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. మరికొందరు విద్యార్థులు బోర్డు దగ్గర నిలబడటానికి భయపడతారు. వేదిక యొక్క సమూహాన్ని చూసి తమ అభిప్రాయం చెప్పలేక భయపడి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు.

Also Read: Degree 6th sem Telugu Model Papers - CLICK HERE


పెద్ద సమూహం ముందు మాట్లాడలేకపోవడం వ్యక్తిగత సమస్య కాదు గానీ అది సామాజిక సమస్యగా పరిగణించాలి.క్క్ దానికి కారణం విద్యా విధానంలోని లోపం అని విద్యార్థికి బోధించడంలో చూపే శ్రద్ధ ఉపాధ్యాయులు మాట్లాడించలేకపోవడంలో అర్థం అవుతుంది. వేదిక మీద మాట్లాడే లేకపోవడానికి కలిగే భయాన్ని STAGE FEAR అని ఆంగ్లంలో అంటారు. దీనిని కలల పరిభాషలో FLOP BED అంటారు. మానసిక నిపుణులు అయితే TOPOFOBIA పోబియా అని అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే PANIC అని అనవచ్చు. ఈ భయం అందరికీ ఉంటుంది. లక్షలాది మంది ప్రసంగించాలనుకున్న వారు కూడా ప్రతి ఉపన్యాసానికి ముందు కొన్ని నిమిషాలు భయపడతారు. భయం నుంచి దూరమై తలెత్తుకొని మాట్లాడితే భయం దూరం అవుతుంది. ఉపన్యాసకులకు సంబంధించి నైపుణ్యాలు మెలకువలు నేర్చుకోవడం వల్ల చక్కటి వక్తలు కావచ్చును.



ప్రాచీన కాలంలో రూమ్ మరియు గ్రీకు సామ్రాజ్యాల్లో వక్తలకు చక్కటి ఆదరణ ఉండేది. ఈ కలను నేర్పించడానికి కూడా శిక్షణ కేంద్రాలు ఉండేవి. ఆవిష్కరణ, అమరిక, శైలి, జ్ఞాపకశక్తి వంటి ప్రధాన లక్షణాలని ప్లేటు మరియు తదితరులు తెలిపారు. బౌద్ధులు కూడా ఉపన్యాసకులకు ప్రాధాన్యం ఇచ్చారు. మంచి మాటలతో మనసులైనా గెలవచ్చు. రాజ్యాలైన గెలవచ్చని వారి అభిప్రాయము.



ఎదుటి వారికి వినసొంపుగా మాట్లాడటం ఒక చక్కని కళ. దీనిని అభ్యాసం చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. ఆసక్తి పట్టుదలతో ఈ కళ అలవాటు ఆవుతుంది. మనుషులలో అంతర్లీనంగా ఉండే శక్తులు తగిన సమయం వస్తే భయపడతాయి. సమాజం వ్యక్తులకు అవకాశాన్ని కలిగించాలి. కొన్ని కలలు వ్యక్తిగతాలు. కొన్ని సామూహికాలు. వక్తృత్వం అనేది వ్యక్తి గత కల. దానిని ఎవరికి వారు మెరుగుపరచుకోవాలి.



అర్థ వివరణ - నిర్వచనం:

ఉపన్యాసం, వక్తృత్వం, ప్రసంగం, వర్తమానం అను అర్థాలతో ఉపన్యాసాన్ని వాడుతూ ఉంటాం. మన ముందు కూర్చున్న వారికి అర్థమయ్యేలా హృదయానికి హత్తుకునేదా చెప్పేదే ఉపన్యాసం. మాటలను రసాత్మకంగా కళాత్మకంగా వ్యక్తం చేయడాన్నే ఉపన్యాసం కల అంటారు. ఇది ఒక సైన్స్. శాస్త్రీయ పద్ధతిలో శ్రోతలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటమే ఈ ఉపన్యాస కల.



విషయం:

తాను మాట్లాడే విషయంపై పూర్తి సమాచారం సేకరించి పూర్తిగా చెప్పగలిగే వాడే మంచి వక్త విషయమనేది ప్రసంగానికి ఆత్మ వంటిది. గనుక ప్రసంగం చేయనప్పుడు విషయం శ్రోతలకు సంపూర్ణంగా అందాలి. ఆ విషయానికి సంబంధించిన ఉదాహరణలు, ఆధారాలు, రుజువులు చూపాలి. ప్రసంగాని కంటే ముందుగానే ఆ విషయానికి సంబంధించిన వాటిని పత్రికలలో, గ్రంథాలయాలలో అంతర్జాలం మరియు తదితర మాధ్యమాల ద్వారా సేకరించాలి. గూఢమైన విషయాలైతే తగిన కవితలు కథలు సూక్తులు జోడించాలి. ఉపన్యాసానికి అధ్యయనం ప్రాముఖ్యం. దానిని అర్థమయ్యేలా వివరించడం మరి ప్రాముఖ్యం. అధ్యయనం చేసినప్పుడే వక్తకు దృక్పథం ఏర్పడుతుంది జ్ఞానాన్ని సంపాదించాలంటే ఉపన్యాసాలు బాగా విని సమాచారాన్ని పోగు చేసుకోవడం ద్వారా సాధ్యపడుతుంది. వక్తకు జ్ఞాపకశక్తి చాలా ప్రాముఖ్యం. చదివిన విషయాన్ని రాయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మాట్లాడాలనుకున్న విషయాన్ని కాగితం మీద రాసుకొని ప్రదర్శిస్తే తడబాటు లేకుండా దారా శుద్ధి పెరుగుతుంది. ఉపన్యాసం కళాత్మకంగా ఉంటుంది.



శిల్పం:

ఉపన్యాసం ఓ కలగనక అందులో శిల్పం ఉంటుంది. ఆ శిల్పంలో ప్రారంభం, భాష, కంఠస్వరం, వేదిక నిర్వహణ, వ్యక్తిత్వం, సంజ్ఞ, వ్యక్తీకరణ, నైపుణ్యం, చాతుర్యం అనే అంశాలు అంతర్ భూతంగా ఉంటాయి. మహాసభల్లో మాట్లాడే విధానం కొంచెం భిన్నంగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి పదాలు ఎంపిక చేసుకోవాలి. వాక్యాలు, కంఠస్వరం, సమయ సందర్భాలు, వ్యక్తీకరణ స్థాయి మారుతూ ఉంటాయి. సమయస్ఫూర్తిగా మాట్లాడడం ఉపన్యాసంలో మరో కల. గంట సేపు ఉపన్యాసం ఇచ్చే విషయాన్ని 15 నిమిషాలలో ఉపన్యాసంగా చెప్పడం కూడా ఒక కళే.



ప్రారంభం:

ఉపన్యాసానికి ప్రారంభమనేది పునాది వంటిది. ప్రారంభం గంభీరంగా ఆసక్తిని పెంచే విధంగా ఉండాలి. చారిత్రక సంఘటనతో గాని, కథతో గాని, పద్యంతో గాని, ప్రశ్నార్థక వాక్యంతో గాని ఉపన్యాసాన్ని ప్రారంభిస్తే శ్రోతలను సులువుగా వక్త తన వైపు తిప్పుకొనవచ్చు. వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పడం, ముందు మాట్లాడిన వాడిని గురించి ప్రస్తావించడం మంచిది కాదు.



భాష:

భాషలలోని అందమైన పదాల ఉచ్చారణ ఉపన్యాసానికి కళాత్మక గుణం ఇస్తుంది. మంచి భాష, మంచి శైలి శ్రోతలను ఆకట్టుకుంటుంది. వక్త అనవసరమైన చోట ఒక్క తన భాష పాండిత్యాన్ని ప్రదర్శించకూడదు. చక్కని హావభావాలతో తన భావాన్ని వ్యక్తం చేయాలి. శ్రోతల స్థాయిని బట్టి భాషను మార్చుకోవచ్చు. కవితాత్మకమైన భాష ఉంటే శ్రోతలు ఆకర్షితులవుతారు. విషయానికి తగిన పదబంధాలు, చిన్న చిన్న వాక్యాలు ఉంటే ఉపన్యాసం చక్కగా ఉంటుంది. వక్త తన ఊత పదాలను, అనవసరమైన వ్యాఖ్యలను, అనవసరమైన హాస్య కథలను వినియోగించరాదు.



కంఠ స్వరం:

విషయాన్ని ఎంత బాగా చెప్పినా ఎంత చక్కటి భాషను ఉపయోగించిన కంఠస్వరం బాగా లేకపోతే దానికి సంబంధించిన ఫలితం శ్రోతలలో చూడలేము. మరీ చిన్నగా మాట్లాడకూడదు మరీ పెద్ద గొంతు వేసుకొని అరవరాదు. మంద్ర స్థాయిలో వినసొంపుగా మాట్లాడాలి. నిదానంగా ప్రారంభించి హెచ్చుతగ్గులతో అనగా స్థాయిని పెంచి, తగ్గించుకుంటూ ఉపన్యాసంగా దానిని మార్చాలి. శ్రోతలను ఆకట్టుకోవడంలో ధ్వనిది అనగా శబ్దానిది ప్రధాన పాత్ర. కొన్ని మాటలు గట్టిగా కొన్నింటిని చిన్నగా పలకడం ఆవశ్యకము.



వేదిక నిర్వహణ:

ఉపన్యాసం ప్రారంభించే వక్త సభను తన స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దానినే వేదిక నిర్వహణ అని అంటారు. వేదిక మీదకు వెళ్లే పద్ధతి, అందరిని పలకరించే పద్ధతి, మైకులు సరిచేసుకునే పద్ధతి, సమయపాలన ఇవన్నీ కూడా వేదిక నిర్వహణ క్రిందకు వస్తాయి. వేదిక మీదికి పిలవగానే హుందాగా వెళ్లాలి. అందరికీ చిరునవ్వుతో అభివాదం చేయాలి. మైకు సరిగా చూసుకొని చూపుడు వేలుతో దానిని కొట్టి పరీక్షించి తర్వాత మాట్లాడాలి. మైకు పట్టుకోగానే చిరునవ్వుతో అందరినీ ఆహ్వానించాలి లేదా శుభాలు తెలియజేయాలి. మన చూపులు కూడా ఎక్కడో చూసి మాట్లాడకుండా శ్రోతల మీదనే చూపులు నిలపాలి. కేటాయించిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసంగాన్ని మాట్లాడాలి. వేదిక ఎక్కక ముందే సెల్ ఫోనును సైలెంట్లో గాని ఫ్లైట్ మోడ్ లో గాని ఉంచాలి.



వ్యక్తిత్వం:

వక్తను ఎందరో చూస్తూ ఉంటారు కనుక తన మాట తీరు హావ భావాలు ధరించిన దుస్తులు అన్ని కూడా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. లేతరంగ దుస్తులు ధరించాలి వేదిక మీద దిగుసుకు పడినట్లు ఉండకరాదు హావ భావాలతో మాట్లాడాలి చేతిలో ఏవి వస్తువులు లేకుండా చూసుకోవాలి మాటలు కోసం పదాల కోసం తూగిసలాడరాదు ఒక్క పురుషుడు అయితే తన జుట్టును చక్కగా దువ్వుకొని వెళ్ళాలి. సభను బట్టి తెల్ల దుస్తులు లేదా సూట్ లో వెళ్లాలి ఇన్షర్ట్ చేసుకోవడం కూడా మంచిదే.



ఉపన్యాసాలు చేసిన వారిలో ఎందరో గొప్ప వారిని మనం చూడవచ్చు. అందులో ప్రజాస్వామ్య విలువల గురించి అబ్రహం లింకన్ గారు, ధార్మిక విషయాల గురించి వివేకానందులు, ప్రజాతంత్ర విప్లవం గురించి మావో గారు, స్వాతంత్రం గురించి గాంధీ, కుల నిర్మూలన కోసం కొరకు అంబేద్కర్ గారు చాలా గొప్ప ఉపన్యాసాలు చేశారు. ఉపన్యాస కళ లో ఎంత ఆరుతెరిటామో.. అంత గొప్ప వారము అవుతాము. మాట్లాడటం అందుకే ఒక గొప్ప కళ.



ఉపన్యాసానికి ప్రారంభం ఎంత ప్రాముఖ్యమో ముగింపు కూడా అంతే ప్రాముఖ్యము. వక్త ఉపన్యాసం ద్వారా శ్రోతలను దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోకి నిలువబెట్టే విధంగా ఆదర్శాన్ని చూపించాలి. ఒక సందేశం, ఒక సూక్తి చెప్పి ముగిస్తే అది చక్కటి ముగింపు అవ్వదు. మంచి ఉపన్యాసకులు నేటి సమాజానికి ఎంతో అవసరం అని చెప్పక తప్పదు. ఉపాధ్యాయులు మంచి ఉపన్యాసకులైతే బడిని ఎగ్గొట్టే విద్యార్థులు కూడా పాఠశాలకు వస్తారు. శ్రద్ధగా పాఠాలు వింటారు. గనుక ఉపన్యాసకాల మనం కూడా అలవర్చుకుందాం - ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుదాము.

Post a Comment

0Comments
Post a Comment (0)