Sem: Degree 6th Sem
వార్త అనగా సమాచారాన్ని అందజేయడం మాత్రమే. వార్త ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది. ఆ సమాచారం దేనికి సంబంధించినదైనా కావచ్చు. అయితే వార్త కథనం సాధారణమైనది కాదు. వార్త కథనం అన్నది వార్తకు ఉన్న భిన్న కోణాలను తెలియజేస్తుంది. వార్త అనేది తక్షణమే అందించబడే సమాచారమైతే, వార్తా కథనం మాత్రం వార్తకు సంబంధించిన సమగ్ర కథనము. మీడియా దీనిని 'స్టోరీ' అని అంటుంది. ఒక వార్తకు సంబంధించి భిన్న అభిప్రాయాలను పరిశీలన, పరిశోధన, అధ్యయనం ఆధారంగా రాసే విశ్లేషణాత్మకమైన కథనం ఇది. ఈ కథనాలలో అనేక దేశాలలో జరిగిన సమాచారాన్ని ఒక క్రమమైన పద్ధతిలో తార్కికంగా వివరిస్తారు. కవితాత్మకంగా కథనాత్మకంగా ఆలోచనలను అంశంపై అంశం వైపు మరలేటట్లు చేస్తారు. ప్రజల యొక్క సమస్యలను మరియు అభివృద్ధికి సంబంధించి విషయాలను వివరిస్తూ పరిష్కార మార్గములను కూడా ఇందులో సూచనగా తెలుపుతారు. దీనిని వార్తా కథనం అని అంటారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఈ వార్త కథనం దేనికైనను వర్తిస్తుంది. అయితే ఆధారాలు చూపించడంలో మాత్రం తేడా ఉంటుంది. అయితే సూచనగా ఛాయాచిత్రాలు ఉంటాయి. దృశ్య మాధ్యమాల్లో మాత్రం వీడియోలు ఉంటాయి.
ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే ముందు విలేఖరులు ఆ సంఘటనపై దర్యాప్తు చేసి నిర్ధారణ చేసుకుంటారు. క్షగేట్రా స్థాయికి వెళ్లి సమాచారాన్ని తెలుసుకుంటారు. అది ప్రజలకు మాధ్యమాల ద్వారా తెలిసిపోతుంది. వార్త యొక్క ముఖ్య లక్షణం తక్షణం చేరవేయడం. ఆ వార్తకు మరిన్ని వివరాలు జోడించి విషయాన్ని లోతుగా పరిశీలించి వార్త కథన రూపంలో అందించడానికి చాలా సమయం పడుతుంది.
విలేఖరులు సంఘటన జరిగిన ప్రదేశానికి ప్రత్యక్షంగా వెళ్లి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తారు. ప్రతి కోణంలో విషయాలు సేకరించి ఆ విషయంపై సాధికారికత సాధిస్తారు. సమాజంలో జరిగే అక్రమాలు, అవినీతి, అన్యాయం, మోసం, దందా అమానవీయ చర్యలు తదితర అంశాల గురించి సంచలనాత్మక కథనాలు ప్రచురిస్తారు. అందుచేత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందించే వార్తలకంటే వార్త కథనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇటువంటి వార్త కథనాలు ప్రజా సమస్యలకు పరిష్కారాలను తెచ్చిపెడతాయి. పాలకుల దృష్టిని అభివృద్ధి వైపుగా నడిపించేలా చేస్తాయి. ఎవరు పట్టించుకోని అంశాలపై అధికారులు పరుగులు తీసేలా చేస్తాయి.
జర్నలిజంలో వార్త వార్త కథనాలకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో ఘనమైనది. వార్త కథనాలు ఉన్న అసలు విషయానికి అదనపు విలువలను జోడిస్తాయి. జర్నలిజం అంటే నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తా కథనం వినిపించడం అనగా STORY TELLING WITH A PURPOSE అనే నిర్వచనం చెప్పవచ్చును. నైపుణ్యం ఉన్న జర్నలిస్టులు తయారు చేసిన వార్తా కథనము అనేక ప్రజాహిత కార్యాలకు దారులుతీస్తాయి. అందుకే పాఠకులు, ప్రేక్షకులు వార్తా కథనాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఇవి సమాజాన్ని మెరుగుపరుస్తాయి వ్యవస్థలను కదిలిస్తాయి.
కొన్ని కథనాలు రాయాలంటే ఎంతో అధ్యయనం తప్పనిసరిగా ఉండాలి. రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలు, పౌరుల హక్కులు, సహజ న్యాయ సూత్రాలు, ధార్మిక మానవ విలువలు, ప్రజాస్వామిక సూత్రాలు, పర్యావరణ స్థితిగతులు, సామాజిక ఉద్యమాలు, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలపై కథనాలు రాయాలంటే కచ్చితంగా వాటికి సంబంధించిన సంపూర్ణ అవగాహన అవసరము లేకపోతే రాయలేరు.
సమాజాన్ని కదిలించే కథనాలను అందరూ రాయలేరు. సామాజిక స్పృహ ఉన్నవారే రాయగలరు. ప్రజల పట్ల, సామాజిక విలువల పట్ల నిబద్ధత కలిగిన జర్నలిస్టు మాత్రమే వ్రాయగలరు. వార్త కథనం వ్రాసే రచయితకు అంశం పట్ల ఆసక్తి, తగినంత భాషా నైపుణ్యత మంచి భావవ్యక్తీకరణ ఉండాలి. వీటన్నిటికంటే ముందుగా ధైర్యం ఎక్కువగా ఉండాలి. ప్రామాణికమైన కథనాలు వ్రాసిన జర్నలిస్టులకు గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. జర్నలిస్టులకు వృత్తిపరమైన సంతృప్తి కూడా కలిగి ఉంటుంది. ఈ వార్త కథనాల వల్ల ప్రయోజనం పొందిన వారు ఆ కథనాలు రాసిన వారిని గుర్తించుకొని మరి గౌరవిస్తారు.
వార్త కథనాలు రాయాలని అనుకునేవారు కొన్ని విషయాలను మనసులో ఉంచుకోవాలి. అవి ఏవనగా
అది విశేషమైన అంశమై ఉండాలి
సమయ సందర్భాలు పాటించాలి
పాఠకులకు ఆసక్తి కలిగించే అంశమై ఉండాలి
ప్రజల అభివృద్ధికి కారణమయ్యే అంశముగా ఉండాలి
వార్త కథనం ద్వారా సాధించే లక్ష్యం పాఠకుల్లో స్పందన రచయితకు ముందే తెలిసి ఉండాలి
అంశం గురించి సాధికారిక సమాచారం తెలిసి ఉండాలి
కథనానికి విశ్వాసనీయత ప్రాముఖ్యము
ఈ కథనంలో వాస్త వాస్తవికత తప్ప ఊహలు అభిప్రాయాలు ఏమాత్రం ఉండకూడదు.
రచయితకు అంశంపై ప్రాథమిక సమాచారం తెలిసి ఉండాలి దానికి మరింత సమాచారాన్ని సేకరించగలగాలి
ఆ విషయం గురించి గతంలో వచ్చిన వార్తలు కథనాలు విమర్శలు తెలుసుకొని గ్రహించి ఉండాలి.
వార్త కథనాల వలన సాధించిన ప్రయోజనాలు
ఊరిని అమ్మేశారు అనే కథనంలో ఒక ఊరిలో చాలామంది నిరసిస్తుంటే ఆ ప్రాంతాన్ని కొన్నామని చెప్పి ఆ ఊరు ఖాళీ చేయమని ఒక వ్యక్తి వచ్చినప్పుడు కథనం ఆ విషయము వార్త కథనం ద్వారా వెలుగు వెలువడడంతో అధికారులు వచ్చి ఆ గ్రామానికి న్యాయం చేశారు.
2. ఒక ఊర్లో మంచినీటి సమస్య ఉండగా అధికారు అధికారి నిర్లక్ష్యంతో ఆ సమస్య ఇంకా తీవ్రమైంది అప్పుడు వార్త కతంతనంలో ఈ సమస్య రావడంతో అధికారులు వెంటనే స్పందించి మంచినీరు అందరికీ అందేలా చేశారు.
3. "శైలజ టీచర్ జనం మెచ్చిన లీడర్" అనే శీర్షికతో వచ్చిన వార్త కథనంతో శైలజ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది గనుక సాధారణ వార్తల కంటే వార్తా కథనాలకు మరి ఎక్కువ శక్తి ఉన్నది అవి ప్రజల మీద చూపించే ప్రభావం ఎక్కువ.