Vartha Lesson - Degree 6th Sem Telugu Lessons

Vartha Lesson - Degree 6th Sem Telugu Lessons

EDU TENSION
0
Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Lesson: 6. వార్త
University: OU
State: Telangana

VARTHA LESSON, vartha lesson degree, degree 6th sem vartha lesson, vartha lesson telugu, degree 6th sem telugu lessons, degree 6th semester telugu lessons

సమాచారం ద్వారా విజ్ఞానం అనేది పెరుగుతుంది. సమాచారం పొందిన వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు. సమాచారం అందుకోలేనివారు మాత్రం అన్ని రంగాలలో వెనుకబడి పోతారు. మానవ పరిధి విస్తరించకపోవడంతో ప్రజలు ఎంతో సమాచారాన్ని తెలుసుకోవాలి. ఏ సమాచారం తెలుసుకోవాలి అనే విషయాలలో పరిమితులు వచ్చాయి. కొన్ని సమాచారాల మీద ఆంక్షలు కూడా విధింపబడ్డాయి. సమాచారాన్ని దాచడం సమాజ బలహీనత. భారతదేశపు రాజ్యాంగ చట్టాలు భారత ప్రతి పౌరునికి సమాచారాన్ని తెలుసుకునే హక్కును కల్పించింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని దేశాలలో సమాచార హక్కు లేదు. కొన్ని దేశాల్లో విద్య కూడా అందరికీ అందటం లేదు.


ఆదిమ కాలంలో మానవుడు సైగలు చేసి తన భావాలను తెలిపేవాడు. తరువాత కాలంలో భాషా ద్వారా తన భావాలను సమాచారముగా మార్చి చెప్పేవాడు. ఆ తరువాత పదాలు, వాక్యాలు, లిపి అమలులోకి వచ్చి సమాజం అభివృద్ధి వైపు నడిచింది. సమాచారం అన్నది ఒక తరం నుండి మరొక తరానికి ప్రభలుతూ వచ్చింది. ఈ విధంగా సమాచారం వ్యక్తి, కాగితం, ముద్రణ యంత్రం, పుస్తకాలు, పత్రికలు, రేడియో, టెలిఫోన్, టెలిగ్రాఫ్, టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్, మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మరియు తదితర సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేయుటకు సాధనాలుగా సమాచారాన్ని చేర్చే సాధనాలుగా వాడబడుతున్నాయి.



సామాన్య మానవుడు కూడా సమాచారాన్ని తెలుసుకోవడం తన హక్కు. చరిత్రలోనే రాజుల కొందరు ఈ విషయాన్ని గుర్తించడం కూడా జరిగింది. జూలియస్ సీజర్ తన నిర్ణయాలను రాతి పలకలపై చెక్కించేవాడు. అశోకుడు కూడా తన నిర్ణయాలను శిలలపై చెక్కించేవాడు. మొగలులు కూడా సమాచారాన్ని చెక్కించేవారు. అచ్చు యంత్రం కనుగొనువరకు అందరూ కూడా ఇలా సమాచారాన్ని చెక్కేవారు. అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత కరపత్రికలు, గోడ పత్రికలు వెలుపడ్డాయి. భారతదేశంలో 1780లో 'బెంగాల్ గెజిట్' అనేది తొలి పత్రిక. తర్వాత న్యూస్ బుక్ వచ్చింది. ఈ నేపథ్యంలో నుంచి పత్రికలు మొదలయ్యాయి. పత్రికలలో ఆధునికత ప్రారంభమైన తర్వాత వార్త సేకరణ, వార్తలు రాసే విధానం, వార్తల యొక్క లక్షణాలు రూపొందించబడ్డాయి. 'పులి టీజర్' అను వ్యక్తి నూతన జర్నలిజానికి పునాదులు వేశాడు' ప్రచురణ కోసం సమాచారాన్ని సిద్ధం చేయడాన్ని 'జర్నలిజం' అని అంటారు' అలా సిద్ధం చేయు వారిని 'జర్నలిస్టులు' అని అంటారు. వార్తలు ప్రతి రోజు ప్రచురించే పుస్తకాన్ని 'జర్నల్' అని అంటారు.



''వార్త యందు జగము వర్ధిల్లుచున్నది" అని నన్నయ్య అన్నాడు. సమాచారం వార్తగా సమాజం ముందుకు వస్తూ ఉన్నది. వార్త ఆధారంగా ప్రపంచాన్ని మనం గమనించవచ్చును. అందుచేత సమాచారాన్ని అర్థవంతముగాను, విశ్వాసనీయంగాను, సమంజసముగాను, ఆకట్టుకునే విధముగాను వార్తను రాయవలెను. పాఠకులు స్వాగతించే విధంగా సమాచారాన్ని చెప్పడమే వార్త యొక్క ప్రధాన ఉద్దేశం.



నిర్వచనము:
వార్త అసాధారణమైన విషయములను తెలియజేయును. వానాకాలంలో వర్షాలు కురవటం వార్త కాదు గానీ, వానాకాలంలో విపరీతమైన ఎండ కాయడమే వార్త. "కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు గానీ మనిషే కుక్కను కరిస్తే అది వార్త" అని 'నార్త్ క్లిఫ్' వార్తను గురించి నిర్వచించాడు. ఆశ్చర్యం కలిగించేవి అనుకోకుండా జరిగేవి వార్తలు అవుతాయి. మరోవైపు తాజా సంఘటనలను తెలిపేవి తాజా వార్తలుగా మనం పిలుస్తాము. "అనుభవము ఉన్న సంపాదకుడు తన పత్రికలో ప్రచురించడానికి ఎంచుకున్న సమాచారం వార్త అవుతుంది" అని 'బుష్' గారు నిర్వహించారు.



వార్త అను పదమును ఆంగ్లంలో NEWS (న్యూస్) అని అంటారు. నాలుగు దిక్కుల నుండి వచ్చే సమాచారమే ఈ వార్త. న్యూస్ అను నాలుగు అక్షరాలు విడదీస్తే ప్రతి దిక్కును ప్రతి దిక్కు పేరు. మనకు అందులో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ గా ఇమిడి ఉంటుంది. సాంకేతికంగా అభివృద్ధి కారణంగా చాలా సులభంగా సమాచారాన్ని క్షణాలలో తెలుసుకునే అవకాశం పెరిగింది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాచారానికి లేదా వార్తను ఇష్టపడతారు. కొందరు రాజకీయానికి సంబంధించినవి ఇష్టపడితే మరికొందరు సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని మరికొందరు సమాజంలో జరుగుతున్న దారుణాలను తెలుసుకునే విషయంలలో మక్కువ చూపిస్తూ ఉంటారు. మిగతా వాటిని అంతగా పట్టించుకోరు. కనుక ప్రజల యొక్క అభిరుచులను బట్టి వార్తలు వివిధ రకాలుగా ఉంటాయి. మరి కొన్ని వార్తలు కొంతకాలంలో గోప్యంగా ఉండి తరువాత అవి బహిరంగమై ఆసక్తిని కలిగిస్తాయి.


వార్త యొక్క లక్షణాలు:

ముందుగా జరిగిన సంఘటనను బట్టి దాని ప్రాధాన్యాన్ని బట్టి అది వార్త అవుతుందో కాదో చెప్పవచ్చు. ఆ సమాచారం యొక్క లక్షణాన్ని బట్టి ఆ వార్త స్వభావాన్ని నిర్ణయం చేయవచ్చు.వార్తకు క్రింది లక్షణాలు ఉంటాయి.
1. ప్రాధాన్యత
2. సామిత్యం
3. సంఘర్షణ
4. సంచలన మార్పు
5. అభివృద్ధి


ప్రాధాన్యత:

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో వార్తలు పత్రిక కార్యాలయానికి వస్తే వాటిలో ప్రతి వార్త పత్రికలో చోటుచేసుకునబడదు. వచ్చిన వార్త సమాచారాలలో ఏదైతే ప్రాధాన్యమైనదో విలువగలదో ముఖ్యమైనదో దానిని మాత్రమే ఎంపిక చేసి వార్తలలో ముద్రిస్తారు. ఈ ఎంపికలో జీవితాలను ప్రభావితం చేసేదిగా ఎక్కువ మంది పాటకులు చదివేదిగా ఉండాలి. వార్త తాజా చేపలాగా క్రొత్తదిగాను... ఆ రోజుదై ఉండాలి. అసాధారణ సంఘటన గాని ప్రముఖులకు సంబంధించినది గాని ఎక్కువమంది చదువుటకు మక్కువ చూపే విధంగా గాని అది ఉండాలి. ముఖ్యమైన స్థలాలలో జరిగిన సంఘటనలకు వార్తలలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పార్లమెంటు, ఢిల్లీ, తిరుపతి శాసనసభ వంటి ప్రదేశాలకు ప్రాధాన్యత ఎక్కువ. అంతేకాక ప్రముఖమైన వారి గురించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రముఖ క్రీడాకారుడు, సినిమా హీరో, ముఖ్యమంత్రి మొదలైన ప్రముఖుల గురించి వారు గొప్పగా ఏదైనా చేసిన లేదా జరుగరానిది జరిగిన అది కచ్చితంగా ప్రాధాన్యత కలిగిన వార్త అవుతుంది.


సామీప్యము

దూరమున జరిగిన సంఘటన కంటే దగ్గరగా జరిగే సంఘటనలకు పాఠకులు ప్రాధాన్యతనిస్తారు. భౌగోళికంగానూ, భౌతికంగా దగ్గరగా ఉండే దానిని సామీప్యత అని అంటారు. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల కంటే మన రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ అయినా సరే వారి ప్రాంతంలో జరిగే వార్తలకే విలువ ఎక్కువ. వాటికన్ లో ఉండే క్రైస్తవ మత గురువుకు ఏదైనా జరిగితే ప్రపంచంలోని క్రైస్తవులందరూ దానిని చదువుతారు.


సంఘర్షణ

మానవ జీవితం సంఘర్షణతో నిండి ఉంటుంది. గనుక మానవులు సంఘర్షణలు ఉన్న వార్తలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. సంఘర్షణలు భావోద్వేగాలతో కూడి ఉంటాయి కనుక వాటికి ప్రాధాన్యత ఎక్కువ. రెండు సిద్ధాంతాల మధ్య రెండు సమూహాల మధ్య జరిగే ఏ సంఘర్షణ అయినను సరే అది వార్త అవుతుంది. అవి మతఘర్షణలు కానీ రాజకీయ పార్టీల సంఘర్షణలు కానీ ఏవైనా సరే.


సంచలనం మార్పు

ఒక సంఘటన అంతర్జాతీయంగానూ జాతీయంగానూ రాష్ట్రవ్యాప్తంగానూ సంచలనం కలిగించేది అయితే అది వార్త అవుతుంది. ఆ వార్త ఎంతో మందిని ఆసక్తికి గురి చేస్తే అది వార్త అవుతుంది. ఉదాహరణకు: కరోనాకాలంలో పదవ తరగతి చదివే విద్యార్థులు కరోనా కారణంగా పరీక్షలు రాయకపోయినా అందరూ పాసయ్యారు. ఇది సంచలన వార్త.


అభివృద్ధి

వార్తలలో సూచనీయ వార్తలు అని రెండు రకాలు కలవు. పోలీస్ స్టేషన్లో నుండి వచ్చే వార్తలు ఉద్యోగ వార్తలు సూచనీయ వార్తలు. వీటిని సురక్షిత వార్తలు అని అంటారు. ప్రభుత్వం ఒక పని చేస్తామని చెప్పి దానిని రహస్యంగా విరమించుకుంటే ఆ వార్తను పలు రకాల పద్ధతులలో తెలుసుకొని రాస్తే అది అకస్మాత్తు వార్త అవుతుంది. సూచనియ అసూచినియ వార్తలు అభివృద్ధి వార్తలు.



వార్త లక్షణాన్ని బట్టి అందిన సమాచారం వార్త అవుతుందో కాదో నిర్ణయించుకొని దానిని వార్తగా మార్చి పాఠకుల మీద దాని ప్రభావాన్ని అంచనా వేసి ప్రచురించి జర్నలిస్టులు ఈ రంగంలో బాగా రాణించగలరు. జర్నలిజంలో కల్పనా కథలు, ఊహలు, అంచనాలు, అపోహలు, అనుమానాలు లేకుండా ఉన్న విషయమును ఉన్నట్లుగా అందించినప్పుడే అది వార్త అవుతుంది. వారు కూడా జర్నలిస్టులు అని అనిపించుకుంటారు


వార్త నిర్మాణం:

సమాచారాన్ని జనములకు చేరవేసేది వార్త. జర్నలిస్టులు దానిని రాయడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు. అందులో పాఠకులకు ఆసక్తి కలిగించే విధముగా వ్రాయడం అన్నది ఒక ముఖ్యమైన విషయము మరియు ఒక కళ. పాఠకుల స్థాయిని బట్టి ఒక్కొక్క వార్తను ఒక్కొక్క విధంగా రాయాలి. వార్త నిర్మాణంలో వార్తంగాలు ఈ విధముగా ఉంటాయి.
1. శీర్షిక
2. డేట్
3. లీడ్
4. బాడీ
5. ఉప శీర్షికలు


1. శీర్షిక:

వార్తలోని ముఖ్యాంశాన్ని శీర్షిక తెలియజేస్తుంది. చదివే సమయం తక్కువగా ఉండే పాఠకులకు ఈ శీర్షిక చాలా బాగా ఉపయోగపడుతుంది. వారు శీర్షికలు చదివి వార్త సారాంశాన్ని గ్రహిస్తారు. ఈ శీర్షిక రెండు మూడు వాక్యాలలో లేదా రెండు మూడు పదాలతో ఉంటాయి. వీటిలో క్రియలు సాధారణంగా ఉండవు. ఉదా: ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్నయ్య.

2. తేదీ:

వార్తకు సంబంధించిన స్థలము & తేదీలను ఈ భాగంలో గమనించాలి. ఉదా: హైదరాబాద్ 31 డిసెంబర్ రాత్రి.


3. లీడ్:

వార్తలు వివరించడాన్ని లీడ్ అని అంటారు. ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఎందుకు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ భాగంలో దొరుకుతుంది.

4. బాడీ:

ధారావాహికంగా వచ్చే వార్తలలో పూర్వం జరిగిన విషయాలను సంగ్రహంగా చెప్పి దాని ఆధారంగా రాస్తారు ఇది బాడీ.


5. ఉప శీర్షక:

వార్త పెద్దదిగా ఉంటే ఉపశీర్షికలు పెడతారు. దాని ద్వారా పాఠకులు త్వరగా సారాన్ని గ్రహించగలుగుతారు.

Post a Comment

0Comments
Post a Comment (0)