Class: Degree 1st Year
Sem: Degree 2nd Sem
Lesson: 1. గజేంద్రమోక్షం
University: OU
State: Telangana
Sem: Degree 2nd Sem
Lesson: 1. గజేంద్రమోక్షం
University: OU
State: Telangana
పాఠము యొక్క సారంశము:
"గజేంద్రమోక్షము" అనునది పోతన భాగవతంలో అష్టమ స్కంధములోని ఓ కథ, ఒక విశిష్టమైన సంఘటన. త్రికూట పర్వతం సమీపారణ్యంలో కొన్ని ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తూఉండేవి.ఆ ఏనుగులు అడవిలో సంచరిస్తుండగా, ఆ గుంపులో ఒక గజరాజు వెనక పడింది. కొన్ని ఆడు ఏనుగులు దానిని సేవిస్తూ, దాని వెనుక ఉన్నాయి. ఆ గజరాజు తన ఏనుగులతో కలసి, వేరే దారిలో వెళ్ళాడు. ఆ గజరాజుకు ఒక సరస్సు కనిపించింది. ఆ గజరాజు ఆ సరస్సులో దిగి, తన ఆడు ఏనుగులతోపాటు స్వేచ్ఛగా విహరించింది. ఆ సరస్సులో ఒక మొసలి ఉంది. ఆ మొసలి ఆ గజేంద్రుడి కాలు పట్టుకొంది. ఏనుగు మరియు మొసలి సుమారు వేయి సంవత్సరాలు పోరాడ సాగారు. చివరకు గజేంద్రుడు అలసిపోయాడు. పూర్వ పుణ్యం వల్ల గజేంద్రుడికి దివ్యజ్ఞానం కలిగింది. భగవంతుడిని ప్రార్ధించాడు. తన్ను రక్షించుమని, గజేంద్రుడు ప్రార్థించినా, భగవంతుడు అతడికి సాయం చేయలేదు. అప్పుడు గజేంద్రుడికి అసలు భగవంతుడు ఉన్నాడా? లేదా? అనే ప్రశ్న పుట్టింది. అప్పుడు గజేంద్రుడు తన మనస్సులో ఆ విషయాన్ని గురించి, ఆలోచిస్తున్నాడు. అప్పుడు జరిగినదే ఈ సందర్బం.
గజేంద్రుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. "దేవుడు ఆపదల్లో ఉన్నవారి వెంట ఉంటాడంటారు. ప్రతి చోట ఉంటాడు అంటారు. యోగుల చెంత ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లో,వైపుల ఉంటాడంటారు. అసలు దేవుడు ఉన్నాడా? లేదా?. భగవంతుడు ఉన్నాడా ? లేదా ? అని అనుమానించడం అనవసరం. భగవంతుడు అనేవాడు ఐశ్వర్యమూ, పేదరికమూ చూడకుండా, అందరికీ అండగా ఉంటాడు. తనను చూసేవారిని ప్రేమతో చూస్తాడు. కాబట్టి నా కష్టాన్ని చూస్తాడు. నా మొరనూ వింటాడు. లోకాన్ని సృష్టించి, లోకానికి దూరంగా ఉంటూ, లోకమే తానై, పుట్టుక లేకుండా, శాశ్వతుడై, ముక్తికి అధిపతియైన పరమాత్మను నేను ఆరాదిన్చేదను" అని ఈశ్వరుడిని మనస్సులో నిలుపుకొని, గజరాజు ఇలా ప్రార్ధించాడు.
గజేంద్రుడి ప్రార్ధన:
" ఓ భగవంతుడా! నాలో కొంచెం కూడా బలము లేదు. ధైర్యం తగ్గింది. ప్రాణాలు పోతున్నాయి. అలసట కలుగుతుంది. నీవు తప్ప, నాకు వేరు దిక్కులేదు. నన్ను కరుణించు. నన్ను కాపాడు. దేవా! ప్రాణుల పిలుపులు వింటావు. అన్నీ తెలుసుకుంటావట. కాని ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది. ఓ కమలాక్షా! శరణుకోరిన వారికి, కల్పవృక్షమా! వచ్చి నన్ను కాపాడవయ్యా. శరణు కోరుతున్న నన్ను కాపాడు" అంటూ ప్రార్ధించాడు. రక్షణ లేనివారిని రక్షించే భగవంతుడు, నన్ను ఆదుకొనుగాక! అంటూ నింగి వైపు చూసి గజేంద్రుడు అన్గాలర్చాడు. బ్రహ్మ మొదలయిన దేవతలు విశ్వం అంతా నిండి ఉండే గుణం ఉన్నవారు.. కాబట్టి వారికి గజేంద్రుడి మొర వినిపించినా, వారు సయం చెయ్యలేదు. విష్ణుమూర్తి భక్తుడైన గజేంద్రుడిని కాపాడటానికి బయలుదేరాడు.
విష్ణుమూర్తి గజేంద్ర రక్షణకు పూనుకొనడం:
ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు. అంతఃపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. గజేంద్రుడి మొర విని, అతడిని కాపాడటానికి తొందరపడ్డాడు. గజేంద్రుడిని కాపాడాలనే తొందరలో విష్ణువు భార్య లక్ష్మీదేవికి -సైతం చెప్పలేదు. శంఖచక్రాలు చేతుల్లోకి తీసుకోలేదు. గరుడవాహనం కూడా సిద్ధం చేసుకోలేదు. లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదలి పెట్టలేదు. తరువాత విష్ణుమూర్తి తన ఆయుధాలు తీసుకొని, ఆకాశమార్గంలో బయలుదేరాడు. ఆకాశంలో విష్ణువు వెనుక లక్ష్మి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, ఆ వెనుక గరుత్మంతుడు, ఆ వెనుక శంఖచక్రాలు, నారదుడు, విష్వక్సేనుడు వచ్చారు. వారి వెనుక వైకుంఠవాసులంతా వచ్చారు.లక్ష్మీదేవి మనస్సులో సందేహము:
విష్ణుమూర్తి చేతితో లక్ష్మీదేవి పైట చెరగు పట్టుకొని లాగుతుండగా, లక్ష్మీదేవి ఆయన వెనుక వెళ్తూ మనస్ఇసులో ఇలా అనుకుంది. "స్వామి ఎక్కడకు వెడుతున్నారో చెప్పలేదు. ఈ విధంగా మనస్సులో అనుకుంది - దొంగలు వేదాలను దొంగిలించారేమో! లేక స్త్రీలు మొరపెట్టారేమో అని అనుకుంది.తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడుగుదాము అనుకున్నది కానీ తిరిగి సమాధానం చెప్పాడని తెలిసి మానేసింది. అలా వెళ్తుండగా దేవతలు చూసారు.
విష్ణుమూర్తి ముసలిని ఖండించడం:
తొందరలో విష్ణుమూర్తి దేవతల నమస్కారాలను పట్టించుకోలేదు. వెంటనే ముసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రేం అన్నది ప్దమానాలు ఆలింగనం చేసుకోవడానికి వెళుతున్న సూర్యబింభంలా ఉంది. ఆ చక్రం బహు వేగంతో వెళ్ళింది. గొప్ప శబ్దంతో నీటి లోపలి వెళ్లి మెసలి ఉన్న చోటికి వెళ్ళింది.
ఆ చక్రం మొసలి తలను తెగ నరికింది. మొసలి శిరస్సును ఖండించి, ఆ చక్రము మొసలి ప్రాణాలు తీసింది. అప్పుడు నవ నిదులలోని మకరం కుబేరుడి చాటున చేరుకుంది. సముద్రంలోని మకరాలు దాగుకున్నాయి.
jai gaja raja
ReplyDelete