Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Lesson: 9. ఇంటర్వ్యూ
University: OU
State: Telangana
Sem: Degree 6th Sem
Lesson: 9. ఇంటర్వ్యూ
University: OU
State: Telangana
పత్రికా రంగంలో ఇంటర్వ్యూ అనేది ఒక కీలకమైన ప్రక్రియ. సమాజంలో బాగా పేరు ఉన్న వ్యక్తులు వివిధ రంగాల్లో కృషి చేసి విజయం సాధించిన వ్యక్తులు పాఠకులకు పరిచయం చేసే ప్రక్రియనే ఇంటర్వ్యూ. ఆయా సందర్భాల్లో ప్రత్యేక సమాచారాన్ని ప్రజలకు అందించడానికి దానికి సంబంధం ఉన్న వ్యక్తులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబెట్టడం సందేహాలను నివృత్తి చేసుకోవడం అనే దానిని ఇంటర్వ్యూ అని అనవచ్చు.
నిర్వచనాలు:
ఇంటర్వ్యూ ప్రక్రియకు మూలాలు ప్రాచీన సాహిత్యంలో కనబడతాయి రామాయణంలోనూ భారతంలోనూ భాగవతంలోనూ ఇంటర్వ్యూ అంటే సన్నివేశాలను మనం అక్కడక్కడ చూడవచ్చు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి వెబ్సైట్లు ఇంటర్వ్యూ గురించి చెబుతూ - "ఒక వ్యక్తి గుణగణాలను అంచనా వేయడానికి మరియు ఒక వ్యక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మౌఖికంగా ప్రశంసించడమే ఇంటర్వ్యూ" అని చెప్పాయి.ఏదైనా పరిశోధనలో ఒక భాగంగా కొత్త వివరాలను సేకరించడం కొరకు దానికి సంబంధించిన వ్యక్తిని ప్రశ్నించడం కూడా ఇంటర్వ్యూ నే. తెలుగు నిఘంటువులు ఇంటర్వ్యూ గురించి - పరస్పర దర్శనం, సమావేశం, కూడిక, కలిసి మాట్లాడు, సంభాషని, భేటీ, మౌఖిక పరీక్ష అని ఇంటర్వ్యూకి అర్థాలు తెలిపాయి.
ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి?
మాట్లాడటం లాగానే ప్రశ్నించడం కూడా ఒక కళ. రేడియో, టీవీలలో ఇంటర్వ్యూలు ప్రజాధరణ పొందుతాయి. ప్రశ్నించడం ద్వారా వ్యక్తుల నుండి ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని విన్నుతున్న విషయాలను బయటకు రాబెట్టవచ్చును. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి అనేది విలేకరి యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటుంది. ఫలితాల కోసం, నిరీక్షించే నిరుద్యోగుల కోసం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం సంబంధిత మంత్రిని ఇంటర్వ్యూ చేయవచ్చు. కరోనా సమయంలో చాలామంది డాక్టర్లు మరియు వ్యాక్సిన్ తయారు చేసే శాస్త్రవేత్తల ను ఇంటర్వ్యూ చేశారు. యువతరానికి స్ఫూర్తిని నింపడానికైతే క్రీడాకారులను, సాహితీవేత్తలను, సినిమా తారలను ఇంటర్వ్యూ చేయవచ్చు. ఆయా రంగాల్లో ప్రముఖ స్థానానికి చేరిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ స్థాయికి చేరుకోవడానికి వారు పడిన కష్టము, ఇబ్బందులను తదితర విషయాలను తెలియజేయడం వలన యువతలో ఆత్మ ప్రేరణ, ఆత్మవిశ్వాసం మరియు మనోధైర్యం అనునది పెంపొందే అవకాశం ఉన్నది.ఏ వ్యక్తుల మాటలను ,అభిప్రాయాలను గౌరవిస్తారో... ఎవరి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకుంటారో... వారిని మాత్రమే ఇంటర్వ్యూ చేయాలి. ఎవరి జీవితం సమాజాన్ని ప్రభావితం చేయగలదో చూసి ఇంటర్వ్యూ చేయాలి. ఆదర్శ వ్యక్తులను, గొప్ప వ్యక్తులను, జీవితంలో విజయాన్ని సాధించిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలి. మరియు ఆర్థిక నేరస్తులను, అజ్ఞాతంలో ఉన్న ఉద్యమకారులను, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు, ఇటువంటి వ్యక్తుల నుంచి వివరాలను తెలుసుకొని వాటి వల్ల సత్యా త్యాలు తెలుసుకోవాలి. వాస్తవాలు అప్పుడే బయటపడతాయి.
సందర్భానికి సంబందించిన వర్తమాణికుని ఇంటర్వ్యూ కోసం ఎన్నుకోవాలి. అతనిని ఇంటర్వ్యూ కొరకు ఒప్పించే ప్రయత్నం చేయాలి. కొందరు చాలా బిజీ గా వుంటారు గనుక వారి సమయం కొరకు ఎదురు చూడాలి. అటు తరువాత వారిని ఎటువంటి ప్రశ్నలు అడిగితే బాగుతుంది అనే విషయాన్ని ఆలోచించాలి. అందుకొఱకు ఆ వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంతకు మునుపు గతంలో ఎవరైనా ఇంటర్వ్యూ చేసి ఉంటే దానిని పరిశీలించాలి మరియు వాటికి భిన్నంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో వారి జీవితం గురించి మరియు వారి వృత్తి గురించి బాగుగా తెలిసి ఉండాలి.
మొదటిసారి నూతనంగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారిని కష్టమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఆహ్లాదకరంగా ప్రారంభించి, స్నేహితునిలా, ఆత్మీయంగా పలకరిస్తూ మంచి వాతావరణం కల్పించాలి. మనస్సు విప్పి మాట్లాడితే వారు ఎవ్వరికి చెప్పని నూతన విషయాలు తెలుస్తాయి. ప్రశ్నలు స్పష్టముగాను, సంక్షిప్తముగాను ఉండాలి. విలేఖరి సామ్యత, మర్యాదకర ప్రవర్తన వల్ల ఇంటర్వ్యూ సాఫీగా సాగుతుంది. పొగరుగా, వ్యంగంగా, అహంకారంతో మాట్లాడారాదు.
సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూలు జరుగుతాయి. పి.ఆర్.పి రేటింగ్స్ కొరకు అనవసరమైన ప్రశ్నలు అడగకూడదు. దీనివల్ల సినిమాలకు బాగా లాభము కలుగుతాయి. సమయస్ఫూర్తి చాలా ముఖ్యం ఇటువంటి ఇంటర్వ్యూలల్లో. కొంతమంది ప్రశ్నలను ముందే రాసి ఇవ్వమని కోరుతారు ముందుగానే ప్రశ్నలు రాసి ఇవ్వడం వలన ఆ ప్రశ్నలకు చక్కటి సమాధానాలు మనకు లభిస్తాయి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తితో ఇంటర్వ్యూ యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి.
దృశ్యమధ్యమ ఇంటర్వ్యూ:
పత్రిక మాధ్యమా ఇంటర్వ్యూ కంటే దృశ్యమాధ్యమా ఇంటర్వ్యూ చాలా భిన్నమైనది. ఇప్పుడు ఎక్కువగా టీవీ ఇంటర్వ్యూలు ప్రజాదారణ పొందుతున్నాయి. జర్నలిస్టులు కూడా వీటికి ప్రాధాన్యమిస్తారు. టీవీలలో ఇంటర్వ్యూ చేయడానికి సాంకేతిక శిక్షణ, అవగాహన ఉండాలి. పత్రిక ఇంటర్వ్యూల కంటే టీవీ ఇంటర్వ్యూలకు పరిమితులు ఎక్కువ. రిపోర్టర్ కు మరియు కెమెరా మ్యాన్ కు మంచి స్నేహ భావం ఎక్కువగా ఉండాలి. రికార్డెడ్ ఇంటర్వ్యూ అయితే పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు కానీ ప్రతిక్ష ప్రసారమైతే కాస్త అప్రమత్తంగా ఉండాలి. జలుబు దగ్గు లేకుండా చూసుకోవాలి. వస్త్రధారణ, కూర్చునే పద్ధతి చక్కగా హుందాగా ఉండాలి. విలేకరితో పరిచయము ఉన్నవారైనా సరే ఏకవచనంతో సంబోధించకుండా బహువచనంతో వారిని సంబోధించాలి. ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఇంటర్వ్యూలో ఏ విధంగా ఉండాలో యాంకర్ ముందుగా తెలియజేయాలి. అతిధి మాట్లాడుతూ ఉండగా అర్థరహితంగా మాట్లాడరాదు, మధ్యలో ఆపరాదు.ఇంటర్వ్యూ - ప్రధాన రకాలు:
1. వ్యక్తిత్వపరిచే ఇంటర్వ్యూ:
ఏదైనా ఒక వ్యక్తి ఒక రంగంలో చాలా గొప్ప స్థాయికి ఎదిగితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే ఇంటర్వ్యూ ఇది. ఇలాంటివి సహజంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు ఉన్నవారితో ఈ ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయం ప్రజలకు తెలిసే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఆ వ్యక్తి యొక్క స్వభావం, దృక్పథం, జీవన విధానం అర్థమయ్యే విధంగా ఇంటర్వ్యూ చేస్తారు. ఏ. ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్ పొందినప్పుడు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అంత గొప్ప సంగీత దర్శకుడు ఎలా అయ్యారు? అని ప్రశ్నిస్తూ ఆ వ్యక్తిని అడిగారు.2. విషయకేందికృత ఇంటర్వ్యూ:
ఈ ఇంటర్వ్యూలో వ్యక్తి కేంద్రంగా కాకుండా సమాజానికి మరియు సమాజ అవసరాలకు ఉపయోగపడే సమస్యల యొక్క పరిష్కారాలకు తోడ్పడే విధంగా ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నేటి సమాజంలోని సమస్యలను ప్రకృతి విపత్తులను, ప్రమాదాలు కలిగినప్పుడు ప్రజల యొక్క సందేహాలు, సమస్యలు, అపోహలు తీర్చడానికి ఈ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. మీడియా వారు సామాజిక అవసరాల మేరకు స్పందిస్తూ ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు సంబంధించిన ప్రజాప్రతినిధులను అధికారులను కలిసి సమాధానాలు చెప్పిస్తారు ఈ ఇంటర్వ్యూ లో.3. ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ:
ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, జీవన విధానం చోటు చేసుకున్నప్పుడు ఈ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ప్రజల మనోభావాలను, సమస్యల విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూలు ఉపయోగపడుతుంటాయి. కట్టడాల కూల్చివేతలు, ఉత్సవాలు, విగ్రహ ఏర్పాటు, డ్యాం నిర్మాణాలు, వంతెన నిర్మాణాలు వంటి మొదలైన విషయాలను గూర్చి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూలు ఉపయోగపడతాయి. వాటిని క్రోడీకరించి పరిష్కరించే దిశగా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. టీవీ స్టూడియోలో చర్చా వేదికలు ఇలాంటివే. వీటిలో యాంకర్ కీలక పాత్ర పోషిస్తే యాంకర్ చర్చకు సంబంధించిన అంశంలో సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. సంబంధిత గ్రంథాలను చదివి ఉండాలి.4. ప్రయోజిత ఇంటర్వ్యూ:
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల యొక్క పోటీ పెరిగింది. సంస్థల మధ్య పోటీ పెరిగింది. ప్రచారానికి ప్రాముఖ్యత పెరిగింది. కొత్త వస్తువులను ఉత్పత్తి చేసిన దాని ప్రమోషన్ కొరకు ఇంటర్వ్యూలో స్లాట్ అనేది వెతుకుతున్నారు. ఇది వ్యాపార వ్యూహము. సమస్త సాధించిన విజయాలను ఫలితాలను చూపిస్తూ మార్కెట్లో విశ్వాసనీయతను పెంచుకునే ప్రయత్నం ఇది. పరస్పర ప్రయోజనాలతో ఈ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో రిలీజ్ అయినప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దీనివలన పి. ఆర్. పి రేటింగ్ పెరుగుతుంది. మధ్యలో ఆ సంస్థకు సంబంధించిన యాడ్స్ వేస్తూ ఉంటారు ఇదే ఆ ప్రమోషన్.ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పులు వేగంగా మనం చూస్తున్నాం. కార్పొరేట్ శక్తులు మానవ జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అప్డేట్ అవుతూ ఉన్నది. దానికి అనుగుణంగా జర్నలిజంలో కూడా మార్పులు మనం చూస్తున్నాం. పైగా యూట్యూబ్ వాట్సప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు ప్రజల జీవితాలను శాసిస్తున్నాయి. వీటి మధ్య ఇంటర్వ్యూ యొక్క పద్ధతులు మారిపోతున్నాయి. ఇంటర్వ్యూ ఎలా జరిగినా జర్నలిస్టుల ప్రాధాన్యం తగ్గలేదు. ప్రశ్నించే జ్ఞాన సామర్ధ్యమే ఇంటర్వ్యూ యొక్క ప్రధాన సాధనమని చెప్పక తప్పదు.