కథానిక - Kathanika Lesson Degree 6th Sem Telugu Textbook Material PDF

కథానిక - Kathanika Lesson Degree 6th Sem Telugu Textbook Material PDF

EDU TENSION
0
Class: Degree 3rd Year
Sem: Degree 6th Sem
Subject - Telugu
Lesson - 3. కథానిక
State: Telangana

kathanika lesson, degree 6th sem kathanika lesson pdf, OU degree 6th semester telugu lessons

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక కూడా ఒకటి కథ దీనికి కథానిక అను పదానికి కథ అనేది పర్యాయపదంగా వాడుతున్న కథానికకు కథకు భేదం ఉన్నది చిన్నప్పుడు చిన్నపిల్లలను నిద్రపుచ్చుటకు పెద్దవాళ్లు ఏడు చేపల వంటి కథలు చెప్పేవారు పిల్లలు వాటిని వింటూ నిద్రపోయేవారు ఆ కథలో నిద్రపుచ్చేవి కానీ ఇప్పటికథలు చైతన్యపరిచేవి దీనిని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు మొదట దీనిని వివిధ పేర్లతో పిలిచిన చివరకి మాత్రం కథానిక అనే పేరు స్థిరపడింది కథానిక అదే పదం కట్ అనే దాహం నుండి పుట్టింది దీనికి చెప్పుట సంభాషించుట మాట్లాడుతూ అనే అర్థాలు కలవు.

Also Read: Degree 6th sem Telugu Model Papers - CLICK HERE


నిర్వచనం:

అని ఎడ్గార్ ఎలెన్ పో నిర్వచించాడు. నిఘంటువులు - 'కొంత సత్యంతో కూడిన కల్పిత గద్య గ్రంథం' అని చెప్పాడు. తెలుగు గ్రంథానికి తెలుగు కథానిక అనే పుస్తకం - "ఒక ఆసక్తికరమైన సంఘటనో, ఒక విచిత్రమైన మనస్తత్వాన్నో, ఒక అపురూపమైన పరిస్థితినో, ఒక అందమైన ఆలోచననో, ఒక మరచిపోలేని అనుభవాన్నో, దేన్నో ఒక పాటకుని హృదయంలో గాఢంగా హత్తుకునేలా చేయడం కోసం అనువైన భాషలో, ఆకర్షించే శైలిలో, మొదటి నుండి చివరి వరకు ఒకే శ్రుతిలో ఒకే బానిలో, ఒకే ధోరణిలో సాగించే ఒక చిన్న వచన రచన" అని చెప్పారు.

పొట్లపల్లి రామారావు రాసిన "ఊరు - అడవి" అనే కథ ద్వారా కథానిక యొక్క లక్షణాలను తెలుసుకుందాం.


ఊరు-అడవి' - సంక్షిప్త కథ:

ఒకతనికి దాహం వేసింది. దాహంతో శరీరమంతా నీరసంగా ఉంది. అసలే ఎండాకాలం. ఊళ్ళోకి పోయి 'దాహం' అని ఒక ఇంటి.. ముందు నిలబడి అడిగారు. వాళ్ళు ముంచినీరు ఇవ్వకుండా 'మీ దేవూరు?" అని అడిగారు, ఏ ఇంటికి వెళ్ళినా "మీరు ఎవరు ?", "నీ పేరేమిటి ?" అంటూ అడిగారు. తప్ప ముందుగా మంచినీళ్ళిచ్చిన వారు లేదు. కొంతమంది తమ ప్రశ్నలకు సమాధానం చెప్పనందుకు విసుక్కున్నారు. అతను ఊర్లో నుండి అడవిలోకి వచ్చాడు. ఒక చిన్న వాగు కనిపించింది. అక్కడో చెలవు. అమృతం తాగినట్టు ఆ నీటిని తాగాడు. అతనికి ఆనందం కలిగింది. ఆ ఆనందం నీరు దొరికినందుకు కాదు. ఆ చెలను తన ఊరు, పేరు అడగనందుకు. అందుకు అతను చెలమకు కృతజ్ఞతలు చెప్పాడు.


కథానిక లక్షణాలు:

కథానిక లక్షణాలను పలువురు వేరువేరు విధంగా అభిప్రాయాలు చెప్పినా, చివరకు నిలకడగా ఉండి కొన్ని లక్షణాలను మాత్రం ఈ కథ ఆధారంగా చూసుకుందాం.

1. క్లుప్తత:

కథానికలో ప్రతి విషయాన్ని ముందు వెనుక చూసుకుని వ్రాయాలి. పాత్రలు, సంభాషణలు, సంఘటనలు తగినంతగా ఉండాలి. అనవసరమైన విషయాలు ఉండకూడదు. కొంత పాటకునికి కూడా విడిచి పెట్టాలి. ఇలా చేయడం వలన కథలో క్లుప్తత వస్తుంది. ఊరు అడవి అను కథలో కేవలం 55 చిన్న వాక్యాలు మాత్రమే ఉన్నాయి. రచయిత సంక్షిప్తంగా కథను తెలిపాడు.



2. అనుభూతి ఐక్యత:

కథానిక మొదటి నుండి చివరి వరకు ముక్కుసూటిగా నడవాలి. ఒకే సంఘటనకు పరిమితం అవ్వకుండా లక్ష్యాన్ని ముందు పెట్టుకొని మాట్లాడాలి. ఈ కథలో దాహం తీరడానికి కలిగిన ఆటంకాలు అన్నిటిని సూటిగా చెప్పడం జరిగింది.

3. సంఘర్షణ:

సమాజాలు సంఘర్షణకు నిలయాలుగా ఉన్నాయని ఈ కథలో అర్థం అవుతుంది. కథ పుట్టుక, పర్యవసానం సంఘర్షణ నుంచే పుట్టాలి. ఈ సంఘర్షణ రెండు భిన్నమైన అంశాల మధ్య ఉండవచ్చు. సంఘర్షణ లేకపోతే అందులో కథ ఏమీ లేనట్టు అర్థం. ఈ కథలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ కథను సంఘర్షణతో నడిపించాడు రచయిత.



4. నిర్మాణ సౌష్టవం:

ప్రారంభం మరియు ముగింపు పట్ల చక్కని సమన్వయం అవసరము. ఆకర్షణీయమైన ప్రారంభం ఆసక్తి కలిగించే కొనసాగింపు కథలో ఊహించని మలుపు కథానిక నిర్మాణ సౌష్టవానికి తోడ్పడతాయి. ఈ కథలో దాహం తీరడానికి తిరిగినట్లు స్థల కాలాలను సూచిస్తూ పాటకునికి ఆర్భాటం కలిగించేలా ఊహించని మలుపుతో కథను ముగించాడు. దప్పిక తీరిన తర్వాత కథ ముగియడం నిర్మాణ సౌష్టవం సౌష్టవానికి ఉదాహరణ.

5. రచనా నైపుణ్యాలు:

సమాజంలో అనేక జాతి మత వర్గాలు వారు ఉన్నారు. అందరికీ సమస్యలు ఉన్నాయి. వాటికి మార్గాలు చెబుతూ వెళ్తే వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తూ వెళ్తే ఎన్నో కథలు పుడతాయి. మన జీవితాల్లో కూడా మార్పు రాబెట్టుటకు ఏ కథ అయినా రాయవచ్చు. దీనివలన నేటి జీవితాలు మరియు భవిష్యత్ తరాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది.


6. వస్తువు:

రచయిత తన కథ ద్వారా చెప్పాలనుకున్న విషయమే ఈ వస్తువు. ఈ కథలో ప్రకృతి అనేది కులమతాలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడమే వస్తూవు. సమాజం నుండి వస్తువును ఎన్నుకోవాలి. అమానవీయ సంఘటనల నుండి సందర్శించిన వస్తువుల నుండి విశ్వవ్యాప్తమైన వస్తువుల నుండి వస్తువును మనం గ్రహించవచ్చు. జీవిత అనుభవాల గురించి బాగా తెలిసిన రచయిత చక్కని వస్తువును ఎన్నుకుంటాడు.

7. ఎత్తుగడ:

ఒక కథను ప్రారంభించడాని ఎత్తుగడ అని అంటారు. కథను ప్రకృతి వర్ణనతో ఒక సామెతతోను సంభాషణతోనూ ఎలాగైనా మొదలు పెట్టవచ్చు. కానీ ఎత్తుగడ వలన చదువరికి ఆసక్తి తప్పక కలగాలి. పూర్వం కథలు 'అనగనగా ఒక రాజు' అని చెబుతూ ప్రారంభించే వారు. కానీ ఇప్పుడు కథల ప్రారంభలు వేరువేరు విధాలుగా ఉన్నాయి. ప్రసిద్ధమైన కథలు ఏ విధంగా ప్రారంభించబడుతున్నాయో గమనించాలి. ఈ కథలో వేసవి కలిగిన వాతావరణంలో ఉన్న వ్యక్తి జీవితం చూపిస్తూ ఈ కథను రచయిత ప్రారంభించాడు.

yio

8. పాత్రలు:

మనం ఎంచుకున్న వస్తువును బట్టి పాత్రలను ఎంచుకోవాలి. ఎన్ని పాత్రలు ఉంటే బాగుంటుంది ఎలాంటి పాత్రలు ఉంటే బాగుంటుంది అనేది వస్తువు నిర్ణయిస్తుంది. పాత్రలు తక్కువగా ఉండటమే కథలో చాలా మంచిది. పాత్రల హోదా వయసును బట్టి పేర్లు పెట్టాలి.

9. శిల్పము:

కథకుని కళా నైపుణ్యమే శిల్పం. శిల్పం అనగా కథను నడిపించే విధానము. కథ అమరికా లేదా అల్లికను శిల్పం అని అనవచ్చు. కొన్ని కథలు కాలానుసారంగా ఉంటే మరికొన్ని ఫ్లాష్ బ్యాక్ తో చెబుతారు. కొన్ని సంభాషణలతో ఉంటే మరికొన్ని ప్రత్యుత్తరాలతో ఉంటాయి. కొన్ని ప్రతీకాత్మకంగా ఉంటే మరికొన్ని సస్పెన్స్ తో ఉంటాయి. గనుక రచయిత కథలో జోక్యం తక్కువగా ఉండి కథలో ఎక్కువ సందేశం పంచుకోవాలి. ఈ కథను మనం కాలానుసారమైన పద్దతిలో చూడవచ్చు. ప్రకృతి పట్ల మానవుడు కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు గనుక చదువు వారికి కృతజ్ఞత భావం కలుగుతుంది.


10. సన్నివేశాలు - సంఘటనలు:

సన్నివేశాలు - సంఘటనలు కథ వేగాన్ని పెంచుతాయి. దీనికి నాటకీయ శిల్పం తోడ్పడుతుంది. ఏ సంఘటనను కూర్చోలో రచయితకు అవగాహన ఉండాలి. ఈ కథలో ఎండలో ఆయాస పడుతూ వెళ్ళటం సన్నివేశం. వ్యక్తిగత వివరాలు చెప్పకపోవడంతో నీళ్లు ఇవ్వకపోవడం సంఘటన. కార్యకారణ సంబంధం కుదిరేలా కథకుడు కథను నడిపించినట్లు మనం చూస్తున్నాం.

11. వర్ణానలు:

వర్ణన కథకు అందాన్ని ఇస్తుంది. కానీ వర్ణన ఏదైనా కథలో పరిమితంగానే ఉండాలి. వర్ణన కథ వాతావరణాన్ని స్పష్టం చేస్తుంది. ఈ కథలో వేసవి మధ్యాహ్నం వర్ణన కథకు వాతావరణాన్ని కల్పించింది.


12. కంఠస్వరం:

ప్రతి కథను రచయితనే చెబితే దానికి ఓ దృష్టి కోణం ఉంటుంది. కొన్ని ఉత్తమ పురుషలో ఉంటాయి. అంటే 'నేను' అంటూ రచయిత తన అనుభవాలను పంచుకుంటాడు. మరికొన్నిసార్లు కథకు వెలుపల ఉండి కథలు నడుపుతాడు. అలా వెలుపల ఉంది నడిపే పద్ధతిని 'సర్వసాక్షి దృష్టి కోణం' అని అంటారు. రచయితకు కథలోని అన్ని విషయాలు తెలిసు గనుక తాను ఆ కథను దర్శించినట్లు చెబుతాడు. ఇక్కడ రచయిత సాక్షి మాత్రమే. ఈ కథను ఏ కంఠస్వరంతో నడిపించాలో కేవలం రచయితకు మాత్రమే తెలుసు.

13. ముగింపు:

కథను సరైన చోట సరైన సమయంలో ముగించవలయును. ముగిసిన తర్వాత కొనసాగించరాదు. కథలో కొసమెరుపు ముగింపు ఉంటే ఆ కథ జ్ఞాపికలో నిలిచిపోతుంది. కానీ ముగింపు అసహజంగా ఉండకూడదు.



14. కథ పేరు:

కథకు రకరకాలుగా పేర్లు పెట్టవచ్చు. విషయాని బట్టి సారాంశాన్ని బట్టి పాత్రలను బట్టి కథ పెరు పెట్టాలి. అయితే ఈ పేరు అన్నది చీకటి నిండిన గదిలోనికి వెలుతురును పంపినట్లు ఉండాలి. కథ పేరులోనే కథ సారం కనబడాలి. ఈ కథలో ఊరు - అడవి అనేది లోతుగా ఆలోచింపజేసే విధంగా ఉన్నది.

15. భాష:

మనం రోజు ఏ భాషలో మాట్లాడుతుంటామో ఆ భాషను రాస్తే చాలు అని కొందరు అంటే, ఎవరి భాషలో వాళ్ళు రాస్తే బాగుంటుందంటారు మరికొందరు అంటారు. అర్థం అవ్వటానికి ప్రామాణిక భాషలో రాయాలని సూచిస్తారు. కథను అన్య వయసుల వారు అన్ని స్థాయిల వారు అన్ని ప్రాంతాల వారు చదువుతారు కాబట్టి అనుదిన జీవితంలో మనం మాట్లాడే భాష రాస్తే చాలా బాగుంటుంది. అప్పుడే కథ జీవంగా నిలుస్తుంది. భాష కూడా పొదుపుగా ఉండాలి.


16. సంభాషణలు:

పాత్ర అనేది వయసును బట్టి హోదాను బట్టి
మారుతూ ఉంటుంది. జాతి మతకుల వర్గాలను బట్టి సంభాషణలు మారుతుంటాయి. కొన్నిసార్లు మౌనం కూడా సంభాషనే. సందర్భాన్ని బట్టి స్వభావాన్ని బట్టి కాలాన్ని బట్టి సంభాషణ మారాలి. ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది స్పష్టముగా ఈ సంభాషణలో ఉండాలి.


జాగ్రత్తలు:

1. ముందు తరాల వారు రచించిన మంచి కథలను విశ్లేషించాలి.
2. పేరాలుగా కథలను విభాగించాలి.
3. అక్షర దోషాలు భాష దోషాలు లేకుండా సరిచూసుకోవాలి.
4. చిన్న వాక్యాలతో రాయాలి.
5. కథను రాసిన వెంటనే దానిని బాగా పరీక్షించి చదవాలి. లోపాలను గమనించి సవరణ చేసుకోవాలి.
6. ఇతర భాషల్లో ఉన్న కథలు చదువుకొని మెలకువలు తెలుసుకోవాలి. అవసరమైతే ఆ భాషలలోని మంచి కథలను అనువదించాలి.
7. రచన అనేది గుర్తింపు కోసం కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
8. కథలో రచయిత వ్యక్తిత్వం బయలుపడాలి.
9. కథా రచనల్లో బాగా అభ్యాసము మరియు సాధన చేయాలి.
10. జీవిత అనుభవాల నుండి రచనలు రాస్తే ఆసక్తికరంగా కథలు రాయవచ్చు.

పైన చెప్పబడిన జాగ్రత్తలు పాటిస్తే మంచి కథలను రాయవచ్చు. మంచి కథలు మంచి కథకులుగా గుర్తింపు పొందవచ్చు.

Post a Comment

0Comments
Post a Comment (0)