Dharmajuni Vakchathuryamu Degree 3rd sem Telugu

Dharmajuni Vakchathuryamu Degree 3rd sem Telugu

EDU TENSION
0
Class: Degree 2nd year
Sem: Degree 3rd Sem
Subject: Telugu
State: Telangana
University: OU, Palamuru University
Year - 2023 Syllabus
Topic: Degree 1st Sem Telugu Syllabus 2023

Degree 3rd sem, degree 3rd sem telugu, degree 3rd sem telugu lessons, dharmajuni vakchaturyam


కవి పరిచయం

(తిక్కన కవి పరిచయం)

కవి: తిక్కన
కవి కాలము: 13 వ శతాబ్దము
బిరుదులు: కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
మహాభారత అనువాదము: ఈ తిక్కన మొత్తము 15 పర్వాలను  అనువదించాడు. వేదవ్యాసుడు సంస్కృతములో వ్రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువదించాడు.
కవి ఇతర రచనలు: నిర్వచనోత్తర రామాయణం, విజయసేనము, కృష్ణ శతకము మొదలగునవి.
తిక్కన పూర్వికులు: తిక్కన తండ్రి పేరు 'కొమన్న', తాతయ్య పేరు భాస్కరుడు. తాతయ్య గారి గురించి చాల గొప్పగా తన రచనలలో ఈ తిక్కన పేర్కొన్నారు.
మహాభారత పుస్తక అంకితం: ఈయన రచించిన ఈ మహాభారత శేష భాగాన్ని హరిహరనాథుడికి అంకితం చేసారు.
రచనా శైలి: ఈయన పాతబడిన మాటలను వాడకుండా, నూతన మాటలను కవిత్వంలో వ్రాయుటకు ఇష్టపడేవాడు. అంతే కాకుండా, చిన్న చిన్న పదాలు, మాటలు వాడుతూ పెద్ద, గొప్ప భావాలను వ్యక్తం చేస్తూ ఈ మహాభారతాని ప్రపంచానికి తెలియజేసాడు.


పాఠము యొక్క సందర్బం:

మాయ జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసమును ముగించి 'ఉపప్లావ్యంలో' (ఒక నగరం) ఉన్నారు. పాండవుల జూదము యొక్క ఒప్పందం ప్రకారం కోల్పోయిన తమ రాజ్యం తమకు తిరిగి ఇవ్వమని ధర్మరాజు (పాండవులలో పెద్దవాడు) 'ద్రుపదుడు' అనే ఒక పురోహితుడిని కౌరవుల పెద్దవాడైన తిృతరాష్ట్రుడితో మాట్లాడటానికి,రాజ్య భాగాన్ని తిరిగి ఇవ్వమని చెప్పటానికి పంపించారు.

రాజ్య భూభాగం కోసం పాండవుల నుండి 'దృపదుడు' అనే పురోహితుడు రాయభారం చేయగా కౌరవుల యొద్ద నుండి కూడా ప్రతి సమాధానం గా 'సంజయుడు' అనే ఓ రాయభారిని ధృతరాష్ట్రుడు పాండవుల వద్దకు పంపించాడు. పాండవుల వద్దకు వచ్చిన సంజయుడు వారికి అర్థమయ్యేలా రాజ్య భాగాన్ని ఇచ్చే ఉద్దేశంలో ధృతరాష్ట్రుడు లేడని ప్రేమతో, కోపం పుట్టించకుండా చెప్పాడు.



ఇలా రాయబారానికే కాలయాపన జరగకుండా పాండవులు (ధర్మరాజు) కలిసి ద్వారకా నగరంలో నివసించే శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వారికి రావలసిన రాజ్య భాగం గురించి ధృతరాష్ట్రుడితో మాట్లాడమని శ్రీకృష్ణుడిని కోరాడు. అంతేకాక రాజ్య భాగం లేకపోతే కలిగే నష్టాల గురించి, ఒకవేళ యుద్ధం జరిగితే యుద్ధ నష్టాల గురించి వివరిస్తూ.., ఏ విధంగా ధృతరాష్ట్రుడితో కృష్ణుడు మాట్లాడాలో ధర్మరాజు తన వాక్చాతుర్యాన్ని ఉపయోగించిన మాటలతో పాఠం ప్రారంభమవుతుంది.

Also Read: DEGREE 3RD SEM TELUGU SYLLABUS

పాఠము యొక్క సారాంశము/వివరణ:

అరణ్యవాసము మరియు అజ్ఞాతవాసము ముగించుకున్న పాండవులు న్యాయపరంగా తమకు రావలసిన రాజ్య భాగాన్ని తిరిగి ఇవ్వమని కౌరవులను అడుగుటకు 'దృపదుడు' అనే ఒక పురోహితుని రాయబారిగా పంపించారు. దృపద్రుడి యొక్క రాయబారానికి ప్రతిగా కౌరవులు (ధృతరాష్ట్రుడు) సంజయుడు అనే వ్యక్తిని రాయబారిగా పంపించి ధృతరాష్ట్రుడి మనసులో ఉండే దురాలోచనను అర్థం అయ్యేలా.., రాజ్యభాగం ఇచ్చేది లేదు అని ప్రేమతో చెప్పాడు.

ధర్మజుడి ఆలోచన:

సంజయుడు యొక్క మాటలు విన్న ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆలోచన గ్రహించి శ్రీకృష్ణుడిని వద్దకు వెళ్లి కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని అడిగితే మన రెండు వంశాల వారికి మంచి జరుగుతుంది అని భావించి శ్రీకృష్ణుడి వద్దకు ప్రయాణం ప్రారంభించారు ధర్మరాజు పాండవులు మరియు ద్రౌపది.



ద్వారక ప్రయాణము:

ధర్మరాజు మరియు తన తోటి వారు అందరూ కలిసి ద్వారకా నగరంలో కాపురం ఉన్న ద్వారకా నగరంలో నివసిస్తున్న శ్రీకృష్ణుడి వద్దకు చేరుకున్నారు శ్రీకృష్ణుడు పాండవులను అందరిని చేరదీసి గౌరవించి ఆతిథ్యం ఇచ్చాడు. ముందుగా ధర్మరాజు మరియు శ్రీకృష్ణుడు కూర్చున్నారు ఆ తర్వాత మిగిలిన పాండవులు కూర్చున్నారు.

శ్రీకృష్ణుడితో ధర్మరాజు మాటలు:

ఓ శ్రీకృష్ణ మా తండ్రి పాండురాజు మరణిస్తూ కృష్ణ మీ వైపు చూపిస్తూ తన ప్రాణాలు విడిచారు. గనుక మాకు మీరు మేలు చేస్తారన్న ఆశతో మీ వద్దకు వచ్చాము. మేము కోల్పోయిన మా రాజ్య భాగాన్ని తిరిగి మాకు వచ్చే విధంగా కౌరవుల తో మీరు మాకు సంధి కుదురుంచాలి అందుకు ఇదే సరైన సమయం. మేము మీకు పుత్రులతో సమానం. రాజ్య భాగం కొరకు యుద్ధం తప్పదు కానీ ఆ పాపం పాండవులమైన మాకు వద్దు అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అర్థించాడు.


శ్రీకృష్ణుడి మాటలు:

అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ సరే! నీవు చెప్పినట్లే చేస్తాను. ధర్మరాజా! మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు.

ధర్మరాజు శ్రీకృష్ణుడిని కౌరవ సభకు పంపుటకు సిద్ధపాటు:

ఓ కృష్ణ మా పెద్దనాన్న ధృతరాష్ట్రుడు, దురాలోచనలతో కపట బుద్ధితో ఉంటూ నిన్న రాయబారిగా సంజయుడిని పంపాడు. ధృతరాష్ట్రుడి కొడుకు అయిన దుర్యోధనుడు కూడా అట్టి కపట బుద్ధి కలవాడే. మేము కోల్పోయిన రాజ్య భాగము న్యాయపరంగా మాకు ఇవ్వకుండా మా కోపాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారు తీయనైన మాటలతో. మేము న్యాయం ప్రకారం అరణ్య మరియు అజ్ఞాతవాసాలను ముగించి న్యాయపరంగా మా రాజ్యం భాగమును కోరాము. మా పెద్దనాన్న వంశం మర్యాదను పట్టించుకోకుండా తన కొడుకు పై ఇష్టముతో దుర్యోధనుని మాటలు విని తప్పుడు దారిలో వెళ్తున్నాడు.

మా తల్లి బంధువులు అందరూ సంతోషించే విధంగా శాంతి కలిగే విధంగా ఉండుటకు పాండవులమైన మా మధ్య మరియు కౌరవుల మధ్య ఐకమత్యం ఉండాలి. మా వైపు ఉన్న బంధుమిత్రులు రాజ్యభాగం కోసం ఎదురుచూస్తున్నారు. రాజభాగం పూర్తిగా ఇవ్వలేని పక్షాన కనీసం ఐదు ఉల్లాయినా ఇవ్వమని కోరాను. వారు అది కూడా ఇవ్వటం లేదు. పాండవులు రాజ్యసంపద కోసం కౌరవులను చంపారు అనే నిందను మరియు పాపాన్ని మోయటం మాకు ఇష్టం లేదు. రాజు ధర్మాన్ని రక్షించాలి. గనుక ఆ ధర్మరక్షణ కోసమే మిమ్మును కోరుతున్నాము.


యుద్ధ నష్టాలు:

రాజ్య భాగం కోసం యుద్ధం చేసినా... యుద్ధం వలన సంపద కలుగుతుందేమో కానీ అదే యుద్ధం వలన అనేక మంది ప్రాణాలు కూడా పోతాయి. ఒకరి చేతిలో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అపజయం కలుగుతుంది. మరియు యుద్ధంలో ఎవరు ఓడిపోతారో చెప్పలేము అలా ఓడిపోవడం కంటే చావే మేలేమో! గనుక ఈ నష్టం జరగకుండా ఉండే విధంగా యుద్ధం ఆపివేయటం చాలా మంచిది. అందుకు మీరే సహాయం చేయాలి.

పగతో జీవించటం చాలా కష్టం:

పగ అనేది పాము వంటిది. ఏ ఇంట్లో అయితే పగ ఉంటుందో ఆ ఇంట్లో పాము నిద్రిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రించలేము. అంతేకాదు 'పగ' ముసుగులో అనగదు. రోజురోజుకు పెరుగుతుంది. పగ హృదయంలో ఉంటే ఎవరినైనా ఎదిరించాలని ఆలోచన కలుగుతుంది. యుద్ధము జరగకుండా పగ పెరగకుండా కులనాశనము జరగకుండా ఏదో ఒక పద్ధతిలో కృష్ణ! నీవే కౌరవులతో మాట్లాడి ఒప్పించాలి.
Also Read: DEGREE 3RD SEM TELUGU PREVIOUS MODEL PAPERS

ధర్మజుని వాక్చాతుర్యం:

కృష్ణ మా మీద పక్షపాతంతో కాకుండా న్యాయంగా ధర్మంగా మా ఇరుపక్షాలకు మేలు జరిగేలా మాట్లాడు. విదురుడు వంటి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు నేర్పుతో అందరూ మెచ్చుకునేలా మాట్లాడు. అవసరమైతే సందర్భాన్ని బట్టి కాఠిన్యము (కోపంగా) కూడా ప్రదర్శించు. దుర్యోధనుడు పౌరుషంగా ఆవేశంతో ఏమైనా మాట్లాడినచో కొంచెం ఓర్పుతో ఉండు. ప్రతి రాజుతో కూడా మాట్లాడు. ఆ సభలో ఉన్న వారి నిర్ణయాలు తెలుసుకో. ధృతరాష్ట్రుడి మాటకు మనం గౌరవిస్తే లోకమే మనలను పొగడుతుంది మరియు అభిమానిస్తుంది.


దృతరాష్ట్రుని కుమార ప్రియత్వము:

ధృతరాష్ట్రుడు తన కుమారునిపై ఉన్న ప్రేమతో దుర్యోధనుడి ప్రతి ఆలోచనను, పనిని మెచ్చుకుంటూ... అంగీకరిస్తూ... తిరస్కరించకుండా ఒప్పుకుంటున్నాడు. అవినీతికి పాల్పడి తొందరపడి యుద్ధానికి కూడా ముందడుగు వేస్తున్నారు. సంబంధాన్ని తెగతెంపులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దుర్యోధనుడి వద్దకు నీవు వెళ్ళద్దు! కౌరవులు పొగరుతో మాట్లాడువారు. మన మాటకు విలువనివ్వరు. అనితిపరులు కుటిల మనసు కలవారు. తమరిని పంపిచ్చుటకు నా మనసు అంగీకరించడం లేదు గానీ మా మనసులోని బాధను తొలగించే వైద్యుడివి నీవు మాత్రమే కృష్ణ! నీవు ఇబ్బంది పడక నీ మనసు కష్టం చేసుకొనక నాకు సహాయం చెయ్యి నీవు ఒంటరిగా వెళ్ళకు అని కృష్ణుడిపై పాండవులకు గల ప్రేమను ధర్మరాజు తెలియజేశాడు.


కృష్ణుడి జవాబు:

ఓ ధర్మరాజా! నీవు చెప్పింది నిజమే. నీ ఆలోచన నాకు అర్థమైంది. అక్కడ ఉన్న కౌరవులు అందరూ అటువంటి వారే. నాకు కోపం వస్తే అక్కడ ఎవరు మిగలరు. ఆ యుద్ధంలో నన్ను గెలవ గలిగిన వీరులు కూడా లేరు. నన్ను కౌరవ సభకు పంపించు అలా వెళ్లడం వలన నీకే మంచిది. ధన ప్రాప్తి కలుగుతుంది. పాండవులకు పాపం కలగకుండా ఉంటుంది. బంధుత్వాలు కలిసి ఉంటాయి. ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది.


ధర్మజుని మాటలు:

కృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు - కృష్ణా! కౌరవులు మరియు పాండవులమైన మా గురించి తమరికి తెలియనిది ఏమీ లేదు. వారితో ఏం మాట్లాడాలి అనేది మీకు తెలిసిన విషయమే. గనుక మా ఇరువురికి సంధి కలిగే విధంగా మాట్లాడు అని శ్రీకృష్ణుడిని కోరాడు. ఈ మాటలలోనే ధర్మజుని వాక్చాతుర్యం అర్థం అవుతుంది.


Post a Comment

0Comments
Post a Comment (0)