State: Telangana
Topic: Gudiselu Kalipothunnai Lesson - Degree 3rd sem
గుడిసెలు కాలిపోతున్నై అను ఈ ఈ కవిత్వమును బోయి భీమన్న గారు రచించారు.
సందర్భం:
ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశంలో చాలామంది దళితులు గుడిసెల్లోనే పాకలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. వారి పేదరికమే దీనికి కారణం. ఒక ప్రక్క పేదరికమైతే.. మరో ప్రక్క గొప్పవారు, అగ్రగన్యులు వీరి పైన పెతనం చెలాయించేవారు. వీరితో చాకిరి చేయించుకునేవారు. ఇటువంటి పేదలు పాకలు వేసుకుని గుడిసెలలో ఉండేవారు. అయితే గుడిసెలలో ఉన్న వీరి గుడిసెలు కాలిపోవడానికి కారణమేంటి? అని కవి తన ఆవేదనతో ప్రశ్నిస్తూ 'గుడిసెలు కాలిపోతున్నాయి' అనే కవితను రాశాడు. అవి కాలిపోవడానికి వీరు తిరిగి నిర్మించడానికి వెనక కారణమేంటి? ఈ పరిస్థితుల వెనుక ఉన్న కుతంత్రాలను తెలుసుకునే ప్రయత్నం ఈ పాఠంలో కవి వర్ణించాడు. వారూ గుడిసెలలోనే జీవించాలా? భవంతులు కట్టుకోవద్దా? అనే ప్రశ్నలతో దళితుల పెన్నిధి వలె కవి బోయి భీమన్న గారు ఆవేదనను వెల్లబుచ్చిన పాఠ్యభాగ సందర్భం ఇది.
సారాంశం :
గుడిసెలు కాలిపోతున్నాయి! ఓహో ఆ గుడిసెలు కాలిపోతున్నాయి! అని కవి తన కవిత్వమును ప్రారంభించాడు. కవి మాట్లాడిన ప్రతి మాటలో తన ఆవేదనను మనం గమనించవచ్చు. ఆ గుడిసెలు ఎవరివో పాపం అని తన బాధను వ్యక్తం చేశాడు. బహుశా ఆ గుడిసెలు మాల మాదిగలవే అయ్యి ఉంటాయి. ఎందుకంటే పాకలలో గుడిసెలలో అలాంటి వారే నివసిస్తారు అని అన్నాడు. కాదు! కాదు! మన దేశంలో గుడిసెలు చాలా మందికి ఉన్నాయి. చాలామంది గుడిసెలలోనే నివసిస్తున్నారు. ఎందుకంటే ఇది మన దేశ సంస్కృతి. మన దేశము పేదరికమైన దేశము కాబట్టి ధన కోత వలన మన దేశంలో చాలామంది బీదలు గుడిసెలలోనే నివసిస్తారు. సరే ఎందుకు ఆ గుడిసెలు ప్రతి సంవత్సరము తప్పకుండా ఎందుకు కాలిపోతున్నాయి? అని కవి ప్రశ్నించాడు.
Youtube Explanation Video: GUDISELU KALIPOTHUNNAI
గుడిసెలు కాలిపోతున్నాయి అనే విషయం తెలిసి కూడా మళ్లీ గుడిసెలు ఎందుకు వేసుకుంటున్నారు? కాలిపోయిన గుడిసెల స్థానంలో మళ్లీ క్రొత్త గుడిసెలు ఎలా వస్తున్నాయి అనేది కవి యొక్క ప్రశ్న!
కవి జవాబు :
కాలిపోయిన గుడిసెలు తిరిగి నిర్మింపబడడం మన దేశ రహస్యం. ఇలా దళితులు గుడిసెలలో నివసిస్తూనే ఉంటారు వారు గుడిసెలు కాలిపోతూనే ఉంటాయి, కాలిపోయిన గుడిసెలను మళ్లీ వారు తిరిగి నిర్మించుకుంటారు అని కవి చెబుతూ.. వీటి వెనుక ఏదో ఒక విషపూరితమైన కుతంత్రం ఉంది అని సందేహబడ్డాడు. ఇలా ఎన్నాళ్ళ వరకు ఇది కొనసాగుతుంది? అని కవి ప్రశ్నించి దానికి సమాధానముగా - గుడిసెలలో ఉండేవారు తాము గుడిసెలలో నివసించడమే ఒక 'విషవలయం' అని గ్రహించేంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అని కవి సమాధానం ఇచ్చాడు.
గుడిసెలో నివసించేవారు గుడిసెలను తగులు పెట్టే వారిని పట్టుకొని కొట్టేవరకు గుడిసెలు కాలిపోవడం ఆగదు అని సమాధానం ఇచ్చాడు. గుడిసె నివాసులు తమకు భవంతులే కావాలి అని ప్రభుత్వాన్ని గలమెత్తి గట్టిగా అడిగే వరకు.. ప్రభుత్వం వారి కొరకు భవంతులు నిర్మించే వరకు ఇటువంటి పేదరికం సాగుతూనే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు.
ముగింపు :
పేదలను ప్రభుత్వం గుర్తించి వారి దీనస్థితిని బట్టి వారికి గుడిసెల బదులుగా భవంతులో కట్టిస్తే, అప్పుడు గుడిసెలు కాలిపోవటాన్ని మనం నిర్మూలన చేయగలము. ఈ విధంగా కవి బోయి భీమన్న వ్యంగ్యంగా, హాస్యంగా, చమత్కారంగా గుడిసెలు కాలిపోతున్నాయి! గుడిసెలు కాలిపోతున్నాయి! అని వర్ణిస్తూ దళితుల పట్ల తన బాధను వ్యక్తపరుస్తూ... ఈ పరిస్థితికి కారణాలను వెదుకుతూ... మరియు తన ప్రశ్నలను అడుగుతూ... వాడికి సమాధానంగా ఏ పాఠంలో ఈ సమాధానాలు రాశాడు.
కవి పరిచయం :
పాఠం - గుడిసెలు కాలిపోతున్నై
కవి - డాక్టర్. బోయి భీమన్న
జననం - ఆంద్రప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా మండలములోని, 'మామిడికుదురు' అను ప్రాంతములో జన్మించాడు. ఈయన సెప్టెంబర్ 19 వ తేదీన 1911 వ సంవత్సరంలో జన్మించాడు.
రచనలు - 'దీపాసభ' కావ్యం ప్రసిద్ధమైనది. పిల్లి శతకం కూడా ముఖ్యమైన రచనలలో ఒకటి. గుడిసెలు కాలిపోతున్నై అను ఈ కవితకు 'సాహిత్య అకాడమీ' అవార్డు వచ్చింది.
పురస్కారం - 'పద్మవిభూషణ్' అను పురస్కారంతో ఈయన సత్కరించబడ్డాడు.
రకాహాన శైలి - సమాజంలో జరుగుచున్న నీతిహీన పనులను వెలుగులోకి తెచ్చి సాహిత్య రూపంలో ప్రశ్నిచగల సమర్థుడు. ఏ విషయమునైన వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా చెప్పగల నేర్పరి.
మరణం - డిసెంబర్ 16వ తేదీన, 2005 లో మరణించారు.