Class: Degree 2nd yearSem: Degree 3rd SemSubject: Telugu
State: TelanganaUniversity: OU
Year - 2023 SyllabusLesson: విభీషణ శరణాగతి
State: Telangana
Topic - Degree 3rd sem Telugu Lesson - Vibhishana Sharanagathi
కవి పరిచయం
పాఠము .యొక్క సందర్భం:
సీతదేవి మరియు రామలక్ష్మణులు పర్ణశాలలో నివసించేవారు. ఒకానొక సమయంలో రామలక్ష్మణులు లేని సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని లంక నగరానికి తీసుకొని వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు రావణాసురుడు ఒక సభలో ఉండగా రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు ఆ సభలో నిలబడి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ తన అన్నపై తప్పు మోపుతూ మాట్లాడాడు. ఎవరూ లేని సమయంలో సీతను అపహరించడం సరైనది కాదు! అది చాలా తప్పు! అని విభీషణుడు తన అభిప్రాయాన్ని సభలో తెలియజేయగా రావణాసురుడు అందుకు కోపపడి తన తమ్ముడిని లంకా నగరం నుండి వెలివేశాడు. ఆ సమయంలో విభీషణుడు భయముతో ఎవరిని ఆశ్రయించాలి అని ఆలోచించి రాముని వద్దకు వచ్చి శరణు కోరుతాడు. శ్రీరాముడు విభీషణుడిని చేరదీశాడు. విభీషణుడు తన సేన మంత్రులతో కలిసి లంక నుండి రాముని వద్దకు వస్తున్నప్పుడు జరిగిన సందర్భముతో ఈ పాఠం ప్రారంభమవుతుంది.
234
పాఠం యొక్క సారాంశము:
రావణాసురుడు సీత సీతను అపహరించి లంగకు తీసుకొని వెళ్తాడు తరువాత ఆ లంకలో సభ జరుగుతుంది ఆ నిండు సభలో విభీషణుడు తన అన్న అయినా రావణాసురుడు చేసిన తప్పును తన అభిప్రాయముగా చెబుతాడు ఈ మాటలు రావణాసురుడికి నచ్చలేదు విభీషణుడిని అవమానించి తన సభ నుండి మరియు లంక నగరం నుండి వెళ్లగొట్టాడు అప్పుడు విభీషణుడు ప్రాణభయంతో శ్రీ రాముడి వద్దకు శరణు కోరటానికి లంక నుండి విభీషణుడు మరియు అతని మంత్రి సేన బయలుదేరారు. వారు ఆకాశంలో ఎగిరి వస్తున్న విభీషణుడిని మరియు అతని మంత్రిసేనను వానరులు ఆకాశంలో చూశారు. సుగ్రీవుడు ఆకాశం వైపు చూసి వస్తున్న రాక్షసుడిని చూడండి, అతడు పర్వతమంత ఆకారంతో మహా పరాక్రమముతో, అనేక ఆయుధాలను ధరించి వస్తున్నాడు అని పెద్ద కేక వేశాడు. సుగ్రీవుని మాటలు విన్న మిగతా వానరులు దగ్గరలో ఉన్న వృక్షాలను పెరికి పెద్ద పెద్ద రాళ్ళను సిద్ధం చేసి పట్టుకున్నారు. వానరులు సుగ్రీవుడుతో - సుగ్రీవ రాజా మమ్మల్ని పంపించండి మేము వెళ్లి యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని చంపుతాము అంటూ ముందుకు వచ్చారు.
Also Read: Degree 3rd sem Telugu Model Papers - CLICK HERE
విభీషణుని మనవి:
వానరుల మాటలను వినిన విభీషణుడు, ఓ వానరసైన్యమా! ఆవేశ పడకండి! నేను మీకు మిత్రుడను. నేను రావణుడికి సోదరుడనే కానీ, శ్రీరామునికి సీతాదేవిని అప్పగించమని రావణుడికి అనేకసార్లు చెప్పిన నా మాటలు వినలేదు. నా ప్రయత్నాలకు అతనికి కోపం వచ్చి నన్ను సభ నుండి పంపించి వేశాడు. లంకలో ఉంటే చంపుతాను అని బెదిరించాడు. గనుక శ్రీరామ దర్శనం కోసం నేను ఎదురు చూస్తూ లంక నుండి బయలుదేరాను. నిజంగానే నాలో ఎటువంటి మోసబుద్ధి లేదు. ఒక్కసారిగా శ్రీరాముడి అభయం ఇప్పించండి అని మనవి చేశాడు.
శ్రీరాముడితో సుగ్రీవుని మాటలు:
విభీషణుని మాటలు విన్న సుగ్రీవుడు శ్రీరాముని వద్దకు వెళ్లి విభీషణుడు చెప్పిన మాటలు చెప్పాడు ఈ విధంగా - ఓ శ్రీరామ! రావణాసురుడు కోపంతో తన తమ్ముడిని పంపించేస్తే లంక నుండి విభీషణుడు తన మంత్రి సైన్యం మన వైపునకు వచ్చారు. తన సేనతో ఆకాశంలో ఉన్నాడు. మీ అభయం కోసం కోరుతున్నాడు మీ అభిప్రాయం ఈ విషయంలో ఏమిటో నాకు తెలియదు గానీ రాక్షసుడి తమ్ముడు గనుక ఇతని నమ్మరాదు. రాక్షసులు మోసానికి మూలము. అయినా లంకను విడిచి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇందులో ఏదో మోసం ఉంది. ఈ నీచుడిని చంపడమే మంచిది అని శుగ్రీవ శ్రీరామ తో చెప్పాడు.
హనుమంతుడి ఉద్దేశము:
ఇది విన్న హనుమంతుడు విభీషణుడుతూ రాముడితో మాట్లాడుతూ రామా విభీషణుడు రావణాసురుడు సభలో సీతాదేవి గురించి ధర్మంగా మాట్లాడితే బహుశా లంక నగరం నుండి వెళ్లగొట్టి ఉండవచ్చు ఒకవేళ నిజంగా అదే జరిగితే అందులో ఎటువంటి మోసం లేదు. మోసం చేసేవారి మనస్సు వారి మాట తీరులోనే అర్థమవుతుంది విభీషణుడి మాటల్లో ఆ మోసం మరియు భావం కనిపించుటలేదు లంకకు నేను వెళ్ళినప్పుడు కూడా ఇంద్రజిత్తుడు నన్ను బంధించినప్పుడు బాధ పెట్టినప్పుడు విభీషణుడు లేచి ఈ లంక నగరానికి దూతగా వచ్చిన వ్యక్తిని హింసించ కూడదు అది రాజధాని కాదు అని చెప్పాడు నాకు అక్కడే విభీషణుడి యొక్క ధర్మం అర్థమయింది కనుక ఒకసారి మాట్లాడితే మంచిది అప్పుడు మనము రాక్షస రహస్యాలు కూడా తెలుసుకోవచ్చు అని తన అభిప్రాయం చెప్పాడు.
రాముని నిర్ణయము:
హనుమంతుడి మాటలు విన్న శ్రీరాముడు విభీషణుడు మన శరణు కోరి వచ్చాడు గనుక శత్రువునైన ఆదరించడం రాజధర్మం. శత్రువు మంచివాడైన చెడ్డవాడేనా అతనిని చేరే చేయడమే ఆతిథ్యము. విభీషణుడు మాత్రమే కాదు రాక్షసుడైన రావణాసురుడు వచ్చి వినయంగా ప్రార్ధిస్తే అతనిని కూడా నేను ఆదరిస్తాను. ఇది సూర్యవంశ రాజుల మర్యాద. పూర్వము చక్రవర్తుల నుండి ఇప్పటి వరకు అదే కొనసాగుతూ వచ్చింది. శరణు కోరిన శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడం కొరకు తన శరీరంలో ఉన్న డేగాను కోసి ఇచ్చాడు. ఇచ్చిన మాట కోసం పావురాన్ని కాపాడాడు. ఆపదలో ఉన్న వారిని ఆదరించినప్పుడే అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుంది. ఓ సుగ్రీవా! నేను అభయమిచ్చానని తెలియజేయి. నీవు వెళ్లి విభీషణుడిని తీసుకొనిరా అని శ్రీరాముడు జవాబు ఇచ్చాడు.
సుగ్రీవుని ప్రశంసలు:
రాముడి వద్దకు వచ్చిన ఈ సుగ్రీవుడు, రామ మాటలు వినగానే రావణాసురుడి తమ్ముడు శరణ కోరితే అతనిని వెంటనే ఆదరించడం తమరి గొప్పతనం. ఏ రాజులో కూడా ఇంత సాహసం నేను చూడలేదు అన్నాడు.
సుగ్రీవుడు విభీషణుడి వద్దకు వెళ్లి హత్తుకొని రాముడి అభయం తమరికి లభించింది అని ప్రేమతో రాముడి వద్దకు తీసుకువెళ్లాడు విభీషణుడు రాముడిని చూసి సంతోషముతో రాముడి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని కొనియాడి శరణు కోరాడు.
విభీషణుడు రాముడిని స్తుతించుట:
శ్రీరామ నిత్య కళ్యాణ గుణకర !మహావీర! దయగలవాడా! నీవే యుగభోక్తవు! నీవు క్షరాణివి! అక్షరానివి! బ్రహ్మదేవుడు నిన్ను కొనియాడలేడు. నేను రాక్షసుడిని. నన్ను కాపాడు నాకు అభయం ఇవ్వు. అందరిని కాపాడే నిన్ను నేను శరణు కోరుతున్నాను. కాపాడు! అని విభీషణుడు ప్రార్థించాడు.
890
శ్రీరాముడి అనుగ్రహం:
విభీషణుడి స్తోత్రాన్ని విన్న దయామూర్తి శ్రీరాముడు ఇలా అన్నాడు - ఓ విభీషణుడా! నీవు రాక్షస రావణుడి తమ్ముడవు. కానీ ఇప్పటినుండి నీవు నాకు తమ్ముడవే. నాకు నీవు కూడా లక్ష్మణుని వంటివాడవే. సహోదర భావంతో నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అని రాముడు చేరదీశాడు. రాముడు విభీషణుడి చేయి పట్టుకొని సముద్రము వద్దకు విభీషణుడిని తీసుకొని వెళ్లి, ఓ విభీషణుడా! రావణాసురుడు బలాన్ని గురించి మాకు తెలియజెప్పు అని అడిగాడు. అప్పుడు విభీషణుడు రాముడికి వందనం చేసి, విషయాన్ని వివరించాడు.