అంతర్నాదం - Antarnadham - Degree 2nd sem Telugu

అంతర్నాదం - Antarnadham - Degree 2nd sem Telugu

EDU TENSION
1

Class: Degree 1st Year
Sem: Degree 2nd Sem
Subject: Telugu
Unit 2; Lesson 2 - అంతర్నాద
State: Telangana

degree 2nd sem,degree 1st year telugu,degree 2nd sem telugu,antarnadham,antarnadam lesson,degree 2nd sem antarnadam lesson,degree 2nd sem telugu textbook pdf,


దాశరధి కృష్ణమాచార్యులు కవి పరిచయం:

ఈ పాఠంను ప్రసిద్ధి చెందిన దాశరధి కృష్ణమాచార్యులు రచించారు. జూలై 22, 1925 వ తేదీన వరంగల్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు. తల్లి వెంకటమ్మ, తండ్రి వెంకటాచార్యులు. దాశరథి పండిత వంశంలో పుట్టారు. దీనివల్ల చిన్న వయసులోనే దాశరథి కి పాండిత్యము అలవాటయింది. ఈయన కాలంలో నిజాం పాలన జరుగుతుండేది. అప్పుడు నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు ఈయన న్యాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ఈయన రచించిన 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అనే రచన తెలంగాణ ఉద్యమానికి ప్రేరణను ఇచ్చింది. 'తెలంగాణము రైతుదే' అంటూ పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసిన ఆచరణశీలి దాశరథి. ఈయన రచించిన 'కవిత పుష్పకం' అనే రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'తిమిరంతో సమరం' అనే రచన వలన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారము ఇచ్చింది. 1977లో ఈయన ఆంధ్ర ప్రదేశ్ కు ఆస్థాన కవిగా నియమితులయ్యారు. ఎన్నో సినిమాలకు కూడా ఈయన పాటలు రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం దాశరథి రచించిన 'అగ్నిధార' అనే కవితా సంపుటి నుండి తీసుకొనబడినది.

కవి దాశరథి పీడిత ప్రజల పక్షాన నిలబడి తాను ఏమి చేయగలడు ఈ కవిత్వం ద్వారా తెలియపరిచారు. కవి ఈ విధంగా అన్నాడు


నా పాటలు ఎంత దూరం పయనిస్తాయో అంత దూరం భూమిపై నిప్పు రాజుకుంటుంది. నేను హేమంతమనే భామను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఎర్రని నెత్తురు అనే నీళ్లను చల్లి సూర్యుని చల్లారుస్తాను. వీణ తీగల మీద కత్తి అంచుతో పాటలు పాడుతాను. నా పాటలలోని రమ్యతను భూమి నుండి స్వర్గానికి పంపుతాను. పీడించబడే మనుషుల యొక్క మాటలను పీడించే వారికి వినిపిస్తాను. పీడించే ప్రజలకు నా పాటలు నిప్పుగా మారి వారిని దహిస్తాయి. వారు కోపపడితే తన మాటల నెత్తుటితో చల్లారుస్తానని తన వాక్యాల ద్వారా చెప్పాడు.

నేను తీతువు పక్షిగా మారి శత్రువుల ఇంటికి వెళ్తాను. వినసొంపు కానీ అమంగళకరమైన ధ్వనులు చేస్తాను. కోయిల గొంతును, వసంతాన్ని, ఉరుముల శబ్దాన్ని జత చేసి పాడుతాను. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఆదరిస్తాను. ఆకలితో ఏడ్చే వారిని ఓదారుస్తాను. ఈ మాటల్లో దాశరథి శత్రువులకు అశుభం కలిగేలా చేస్తానని, తన గొంతు వసంత సౌందర్యము మరియు మాధుర్యమైన ధ్వని వలె ఉంటుందని, ఆ గొంతు శత్రువులకు ఉరుము వంటిది, పీడిత ప్రజలకు కోయిల వంటిది అని అన్నాడు.



తన మాటల ద్వారా పీడిత ప్రజలకు కూడా భరోసానిచ్చాడు. అవసరమైతే భూమి మీద మరియు సూర్యుని మీద తిరగబడతాను అని, స్మశానాన్ని, రాత్రిని, చీకటిని, శిశిరాన్ని, ఆకలి జ్వరాన్ని, వేదన భారాన్ని వేసారినా బ్రతుకును లేకుండా చేస్తానని భరోసా ఇచ్చాడు.

నేడు ప్రపంచం ఎన్నో గదులుగా విడిపోయిందని, అరలుగా విడదీయబడిందని, పగిలి చితికిపోయిందని, ఆ భూమి మీద ఉన్న మనుషుల జీవితపు విలువలు కూడా నశించాయి అని, స్వార్థం నిండింది అని దాశరథి బాధపడ్డారు. తిరిగి ప్రపంచం మామూలు మునుపటి స్థితికి రావడానికి అగ్ని తుపాను అనే విప్లవము లెపుతానని చెప్పాడు. అవసరమైతే క్రొత్త లోకాన్ని సృష్టిస్తానన్నాడు.



నేను అమృతాన్ని త్రాగుతాను యువత చెక్కిళ్లపై ఉదయ కిరణాలను ప్రసరింప చేస్తాను లోకంలో ఉన్న విషయాన్ని తొలగిస్తాను అందరికీ అమృతాన్ని పంచుతాను ఆనందంతో అందరూ కనిపించే విధంగా చేస్తానని మాట ఇచ్చాడు మానవులను చంపే రాక్షసులు ఉంటారు వారు మానవత్వం లేని నెత్తురు త్రాగేవారు వారిని చంపడానికి రాముడిగాను కృష్ణుడిగాను అవతరిస్తాను కోట్ల మంది ప్రజలను చంపే మరణానికి భర్తను అవుతాను ప్రజలను హింసించే వారికి అంతం చేస్తాను

వానగాలికి, ఆకలి దాహానికి, వరదలకు కన్నీళ్లకు నేను భయపడను. వెలుగు చీకటి మధ్య సంచరిస్తూ. వింటిని ధరించి యుద్ధం చేస్తాను. ఎవరిని లెక్క చేయక పోరాటం ఆపనని... రక్షిస్తానని దాశరథి తన వాక్యాల్లో తెలియజేశారు. పీడితమవుతున్న ప్రజలను కాపాడటానికి తను ఎప్పుడు ముందు నిలుస్తానని తన ఆత్మవిశ్వాసాన్ని వెల్లడి చేశాడు.

Post a Comment

1Comments
Post a Comment