Prapanchapadulu - Degree 2nd sem Telugu book pdf

Prapanchapadulu - Degree 2nd sem Telugu book pdf

EDU TENSION
2
Class: Degree 1st Year
Sem: Degree 2nd Sem
Subject: Telugu
Unit 4; Lesson - 3
State: Telangana

degree 2nd sem,degree 2nd sem telugu material pdf,prapanchapadulu degree 2nd sem textbook pdf,prapanchapadulu lesson degree,degree 6th sem telugu,



ప్ర పంచపదులు పాఠం యొక్క కవి పరిచయం:
డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్య లోకంలో సినారె వంటి వారు. ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామంలో 1931 వ సంవత్సరం జూలై 29వ తేదీన జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈయన ఎంఏ చదివారు. తర్వాత అక్కడే అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. బాల్యంలో చిన్ననాటి హరికథలు, జానపదాలు, జంగం కథల స్ఫూర్తితో ఈయన రచనలు రాసేవారు.

నారాయణ రెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ, సోవేట్ ల్యాండ్ అవార్డులు లభించాయి. 1988లో 'విశ్వంభరా' అనే కావ్యానికి భారత దేశంలోనే ప్రతిష్ఠితాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. పద్మశ్రీ, పద్మవ్యూషన్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది.



ప్ర పంచపదులు పాఠం యొక్క నేపథ్యము:
ప్ర పంచపదులు అనే ఈ పాఠంను గేయ రీతిలో ఐదు పాదాలుగా వ్రాయబడిన వైవిద్య ప్రయోగ రూపము ఇది. మాత్రా ఛందస్సుతో రచించబడింది. ఇవన్నీ ముక్తకాలే. ప్రతిపాదం కూడా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ప్రత్యేక భావాన్ని వెల్లడి చేస్తాయి. ఈ పాఠం ఉపమాన రీతిలో మనకు వ్రాయబడింది. ఈ పాఠం చదువుతూ ఉండగా మనిషిలో ధైన్యం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.



ప్ర పంచపదులు పాఠం యొక్క సారాంశము:
ఆకాశపు లోతు తెలుసుకోవాలంటే నీటి చుక్కను, రత్నం విలువ తెలుసుకోవాలంటే రాతి మొక్కను, మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టిగడ్డను ప్రశ్నించాలి. అలాగే బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే 'అణువును' అడగాలి.

పక్షి రెక్కలు తడవకుండా గొడుగుల ఉన్నప్పుడు, మేఘాలు పైరు గొంతు తడిపినప్పుడు, సెలయేరు తన వంశపు జాతకాన్ని మార్చినప్పుడు, విద్యను కట్టు దాసునికి స్వేచ్ఛను ప్రసాదించినప్పుడు సంఖ్యల్లో సార్థకం అవుతాయి. ఎటువంటి గురి లేకుండా ఉండటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. లక్ష్యం ఉన్నప్పుడే జీవితం సార్థకం అవుతుంది.

అద్దము మురికిగా ఉంది అని ముఖాన్ని చూడకుండా ఉండటం, ముసురు పట్టిందని బయటకు వెళ్లకుండా ఆగిపోవటం, గుండెల్లో భయం పుట్టిందని నెత్తురును పంపకుండా ఉండవు. జన్మించిన ఆశయాలు పిడికిలి ఎత్తకుండా ఉండవు. అలాగే ఎప్పుడో చనిపోతాము కదా అని ఏ పని కూడా చేయకుండా ఆగిపోకూడదు.



రాపిడి లేనిచో వజ్రం మెరుపునివ్వదు. అలజడి లేక నిశ్శబ్దంగా సముద్రం ఉండదు. స్పందన లేకపోతే మనసు బ్రతుకదు. అలానే మానవుడిలో చైతన్యం లేకపోతే సృష్టి ముందుకెళ్లదు.

వృక్షమును చూసి దానికి ఆధారమైన మట్టిని, పారే నదిని దాటిన తర్వాత దానికి కారణమైన పుట్టిని, మిద్దె మీదకు ఎక్కిన తర్వాత మెట్లను, సింహాసనం మీద అధిష్టించిన తర్వాత సూక్తులను గుర్తించుకోవాలి. అలానే ఉన్నత స్థానమునకు మానవుడు ఎదిగిన తర్వాత తన జన్మకు కారణమైన తల్లిని స్మరించుకోవాలి.

మరిగే ఎడారి కి నీటి చుక్క, మరణాన్ని సూచించే సమాధికి గరిక మొక్క, నిశి నిండిన ఆకాశానికి వేగుచుక్క, పక్కలు విరిగిన శరీరానికి పక్షి రెక్క ఆశను కలిగిస్తాయి అలానే ఆశ లేకపోతే లోకం లేదు. ఆశనే ప్రపంచానికి ఊపిరి.



ఆయుష్షును పెంచేది మందు. అక్రమాలను ఎదిరించేది ఆయుధం. మనసుకు ఊపిరి పోసేది మారుతం. మరణాన్ని ఇబ్బందులు పాలు చేసేది జీవితం అలానే మన విలువ తెలిసినప్పుడే మన జీవితానికి ప్రయోజనం.

రైతు భూమిని ఎంత దున్నిన భూమి కలత చెందదు. ఎంత పారిన ఏరు నలత చెందదు. ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నా దానికి లోపం లేదు. మానవుడు గాలి ఎంత పీల్చిన గాలికి కొరత లేదు. అందుకని కొద్దిగ పని చేసి ఎక్కువగా అలసట పొందకూడదు.

ముళ్ళు వాడి తెలిస్తేనే కదా పువ్వు నునుపు తెలుస్తుంది. చీకటి తెలిస్తేనే వేకువ విలువ తెలుస్తుంది. దుఃఖం అనుభవిస్తేనే సంతోషపు విలువ తెలుస్తుంది. చావు తెలిస్తేనే జీవితం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అదే విధంగా ప్రతి విషయంలో రెండవ ప్రక్క ఏముందో తెలియకపోతే వాస్తవం తెలుసుకోలేము.



కాకుల సభలలో కోయిల పాడలేదు. ఖడ్గాలతో ప్రాణాన్ని తీసే ఆలయంలో భక్తి ఉండదు. దాపరికం ఉన్న కొంపలో మంచితనం బ్రతకదు. విషం ఉన్న ప్రదేశంలో న్యాయం గెలవదు. అలానే కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా అంతా క్షేమమే అని చెప్పే అబద్ధపు మాటలు వలన ప్రయోజనం ఏమీ ఉండదు.

మినుగురు పురుగు చీకటిలో వెలుగునిస్తుంది. చిన్న గొడుగు వర్శతాపాన్ని ఆపుతుంది. చీమల పరుగు దూరాన్ని దగ్గర చేస్తుంది. అలానే మార్పు రావాలంటే మంచి ఉంటే చాలు గొప్ప ప్రయత్నం అవసరం లేదు.

Post a Comment

2Comments
  1. Bro migatha unit lu pettu bro

    ReplyDelete
  2. Bro migatha unit lu pettu bro

    ReplyDelete
Post a Comment