Class: Degree 1st Year
Sem: Degree 2nd Sem
Subject: Telugu
Lesson: 1/ Unit 2 - స్నేహలత లేఖ
State: Telangana
రాయప్రోలు సుబ్బారావు గారు కవి పరిచయం:
రాయప్రోలు సుబ్బారావు గారు 1892 మార్చి 13 వ తేదీన గుంటూరు జిల్లాలోని గార్లపాడు అను గ్రామంలో జన్మించారు. వీరు హైదరాబాదు మరియు మద్రాస్ లో విద్యను అభ్యసించినారు. ఈ సుబ్బారావు గారు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకునిగాను రీడర్ గాను ఆచార్యులుగాను పనిచేశారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ గాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగాను పనిచేశారు.ఈయన రచించిన గేయాలలో 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అనే గేయం చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాక ఆంధ్రుల గొప్పతనాన్ని చాటిచెప్పిన ఎన్నో గేయాలు ఈయన నుండి వెలవడ్డాయి. ఈయన 'లలిత' అనే పేరుతో తన కవిత్వాలకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు అనిమితి, తృణకంకణం, కష్ట కమల, స్నేహలత, స్వప్న కుమారుడు, తెనుగుతోట, ఆంధ్రావలి, జడ కుచ్చులు, వనమాలి, కన్నెపాటలు, మిశ్రమంజలి వంటి ఎన్నో రచనలు చేశారు. ఈయన రచించిన రచనలకు 'కలాపుర పూర్ణ' అనే బిరుదుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్కరించింది. మరియు పలు సాహిత్య విశ్వవిద్యాలయ సంస్థలు కూడా వీరిని ఘనంగా సన్మానించాయి. నేటి పాఠ్య భాగమైన 'స్నేహలత లేఖ' అను పాఠము స్నేహలత అనే గ్రంథం నుండి గ్రహించబడింది.
స్నేహలత లేక పాఠం యొక్క నేపథ్యం:
స్నేహలత అనే ఈ రచనను 1914 వ సంవత్సరంలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. ముఖ్యముగా వరకట్నం అనే దురాచారమును నిరసిస్తూ ఈ పాఠమును అయన రాశారు. 15 సంవత్సరాలు ఉన్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నందుకు కారణం వరకట్నం. తన తండ్రి కుటుంబాన్ని ఆ వరకట్నం నుండి కాపాడుటకు ఆత్మహత్య చేసుకున్నది. ఈ వార్త విన్న రాయప్రోలు సుబ్బారావు గారు దీనిని ఖండితంగా వ్యతిరేకిస్తూ ఈ రచన చేశారు. స్త్రీ లేకపోతే పురుషుడు లేడు. వట్టి పసిప్రాయుడు అని రాస్తూ... స్త్రీ సృష్టికి వికాసహేతువు అని ఆంగ్లేయులు చెప్పిన మాటను ఈ పీఠికలో చేర్చి స్త్రీ పట్ల పవిత్ర భావన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ పాఠంలో ముఖ్యముగా స్త్రీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వర్ణిస్తూ రాశారు.
స్నేహలత లేక పాఠం యొక్క సారాంశం:
స్నేహలత తన తండ్రికి ఒక లేఖ రాసింది. ఈ లేక ఆమె చనిపోయే ముందు రాసి తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ లేక ఈ విధముగా ఉన్నది:
నాన్న నా వివాహం కోసం చాలా కాలం నుండి కష్టపడి పిత్రార్జితమైన ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదు. నేను దుర్ముహూర్తం లో పుట్టిన దానను. రేపు ఉదయం నేను దేవుని సన్నిధికి చేరుకుంటాను. నన్ను నీవు ఎంతో అల్లారు ముద్దుగా పెంచావు. ఎప్పుడు నా సుఖం ఆశీస్తూ ప్రేమను పంచి పెట్టావు. ఈ 15 సంవత్సరాలు నేను నీ ప్రేమను అనుభవించాను. బహుశా రాజుల కుమార్తెలు కూడా నేను పొందిన సుఖాన్ని పొంది ఉండరేమో. మొన్న నీ కాళ్లు వాచిపోయేటట్లు వేసారి, అలసి సొలసి ఇంటికి వచ్చావు. అప్పటి దయనీయమైన నీ ముఖము నాకు ఇంకా గుర్తు ఉంది. ఉన్న ఆస్తి సంపద మొత్తము హరించి పోయింది అనే బాధతో నీవు మాట్లాడిన మాటలు నా చెవిలో ఇంకా తిరుగుతున్నాయి. మీ అప్పు గురించి విన్నాను. నీకు కీడు కలిగించిన పత్రికను నేను. నన్ను కన్నందుకు, చదువు చెప్పించినందుకు బదులుగా నీ ఆస్తినే పోగొట్టుకున్నావు. తండ్రి బాధపడే వివాహం స్త్రీ నైనా నాకు అవసరమా? కుల ధర్మాలు సంప్రదాయాలు దీనిని గ్రహించవా?నాకు ఇంకనూ వివాహం కాలేదు అనే కారణంతో నిందలపాలు కూడా అయ్యావు. ఉత్తముడైన వరుడి కొరకు తమరు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి.
వరదలు వచ్చినప్పుడు అమ్మ బిడ్డలు విడిపోయినప్పుడు వారి దుఃఖాన్ని పోగొట్టిన వారు, విదేశీ వస్తువు బహిష్కరణ కొరకు పోరాటం చేసిన వారు, వరకట్నము అనే ఈ దురాచారాన్ని ఎందుకు నిరసించడం లేదు? రాత్రి నాకు వచ్చిన కలలో ఓ గీతం వినిపించింది. ఆ గీతము మైత్రేయి కంఠంలాగాను, నారదని మహతీనాదం లాగాను, సరస్వతి వాదంలాగాను మధురంగా ఉంది. ఆ గీతము మురళి పాటవలే, తుమ్మెద ఝుంకారంలా, జయదేవుని కవిత నా చెవులకు ఆనందాన్ని పంచింది. ఆ సమయంలో ఎప్పుడు కనిపించని ఒక కాంతి కనపడింది. ఆ కాంతి మధ్య కనకదుర్గను దర్శించాను. ఆమె నవ్వుతో తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె ఆహ్వానించగానే నువ్వు, అమ్మ, చెల్లి గుర్తుకొచ్చారు. మీ కష్టాలను తొలగించాలని భవాని దేవితో వస్తానని మాట ఇచ్చేసాను.
నాన్న! నేను వెళ్ళిన తర్వాత నా బూడిదపై మీకు కన్నీరు ఒలుకుతుంది. కానీ మీ ఆస్తి, నా కన్యత్వము నిలువబడతాయి. నిప్పులో గాని నీటిలో గాని లేదా విషయాన్ని త్రాగి గాని మరణించాలని అనుకున్నాను. అయితే అగ్ని యాగాల్లో హలీసులు స్వీకరించినట్లు నన్ను స్వీకరించమని ప్రార్థించాను. నాన్న! ఇక నేను వెళ్తున్నాను. నీ కన్నబిడ్డ చేసే కడసారి వందనమును స్వీకరించు. తల్లి గర్భంలో మాదిరిగా ప్రకృతిలో ప్రశాంతంగా లీనమైపోయి నిద్రిస్తాను. మీరు వచ్చేటప్పుడు నా సోదరి సోదరులు ప్రేమతో ఇచ్చే కన్నీటి మాలలను తీసుకొని రండి. నేను వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. వరకట్నము అనే మచ్చ అంటకుండా నన్ను కాపాడిన ఈ దక్షిణాగ్ని సమాజంలోని దురాచారాలను కూడా కాల్చివేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.
స్నేహలత రాసిన ఉత్తరం యొక్క సారాంశం ఇదే.