
కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం – ఆంద్ర మహాభారతం ఆదిపర్వం ఆశ్వాసం నుండితీసుకొనబడింది.
కవి పరిచయం:
పాఠ్యభాగము: కుమారాస్త్ర విద్యాప్రదర్శనం
కవి: నన్నయ్య బట్టు
కాలము: 11వ శతాబ్దము
బిరుదులు: ఆదికవి, వాగను శాసనుడు
రచనలు: ఆంధ్ర మహాభారతము, ఇంద్ర విజయము, రామాభ్యుదయము, ఆంధ్ర శబ్ద చింతామణి.
విశిష్టత: ఆంధ్ర వాగ్మయంలో తొలి తెలుగు కవి, ఆంధ్ర మహాభారతంలోని ఆది సభాపర్వాలను పూర్తిగాను… అరణ్యపర్వంలోని మూడు ఆశ్వాసాలను… నాలుగవ ఆశ్వాసంలోని 142 పద్యాలను రచించిరి. అవిరళ జప హోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు.
కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సారాంశము
ద్రోణాచార్యుడి వద్ద కౌరవులు మరియు పాండవులు శస్త్రాస్త్ర విద్యలను నేర్చుకొని నిపుణులు అయ్యారు. ద్రోణాచార్యుడు కౌరవులకు మరియు పాండవులకు గురువు. వీరు శస్త్రాస్త్ర విద్యను పూర్తి చేయగానే వీరి యొక్క నేర్పును దృతరాష్ట్రుడికి చూయించాలని ద్రోణాచార్యుడు కోరాడు. ధృతరాష్ట్రుడికి ద్రోణాచార్యుడు ఈ విషయము చెప్పగానే ధృతరాష్ట్రుడు అంగీకరించి తన సైన్యములో అధిపతియైన విదురుడికి ‘కురు కుమారుల శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకు’ రంగస్థలంను సిద్ధం చేయమని కోరాడు. ఆ రంగస్థలం ఎంతో సుందరంగా ఉండాలని కోరాడు.
పంచాంగం ప్రకారం ఒక మంచి రోజున… ఈ శస్త్రాస్త్ర విద్యను ప్రదర్శించుటకు ఒక రంగస్థలం మరియు తేదీ నిర్ణయించబడింది. ఒక మంచి శుభ ముహూర్తమున ధృతరాష్ట్రుడు తన భార్య అయిన గంధార దేవితో కలిసి రంగస్థలంకి వచ్చి ఆసీనులు అయ్యారు. వందమంది భార్యలు కూడా అతడితో పాటు వచ్చారు.
రంగస్థలంలో, ప్రముఖులైన వారి కొరకు నిర్ణయించబడిన తమ స్థానంలో వచ్చిన ముఖ్యులు కూర్చున్నారు. అందులో వ్యాస మహర్షిని, కళా బ్రాహ్మణ సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమ దత్తుడు ప్రముఖ గురు బంధుమిత్రుల సమూహం అపరిమితమైన మంత్రి సామంత మండలాధిపతులు నాయకులు ఉన్నారు. ప్రారంభ విజయభీరులు మ్రోగాయి. ముఖ్యలతోపాటు ఈ విద్య చూడ వచ్చిన వారిలో క్షత్రియ వైశ్య క్షుద్రతి జాతి జనులు కూడా హాజరయ్యారు. ఇక కళా ప్రదర్శన ప్రారంభమైంది.
కథ వివరణ
శౌనకుడికి మరియు మిగతా మహా మునుగులకు రావు మహర్షని ఈ మహాభారత కథను వివరిస్తున్న నేపథ్యం.
కౌరవుల పాండవుల గురువు పేరు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్న కౌరవులు మరియు పాండవుల విద్య నైపుణ్యాన్ని వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు వంటి మొదలైన పెద్దల ముందు ప్రదర్శింపచేయాలనుకున్నాడు. ద్రోణాచార్యుడు దీని గురించి ధృతరాష్ట్రుడితో మాట్లాడి ఒప్పించాడు. కౌరవ పాండవుల విద్యా నైపుణ్యాన్ని ధృతరాష్ట్రుడు తెలుసుకోవాలని కోరాడు.

రంగస్థల సిద్దపాటు: ధృతరాష్ట్రుడు కురు కుమారుల విద్యా ప్రదర్శన కొరకు ఒక అందమైన రంగస్థలం చేయించమని విదురుడిని కోరాడు. ఈ విదురుడు శాస్త్ర ప్రకారం రంగస్థలంకు కావలసిన కొలతలను, పొడవు, ఎత్తు, చెట్లను, పుట్టలను తీసి వేయించి తూర్పు భాగంలో ఉత్తర భాగంలో వాటమైన పల్లపు ప్రదేశాలను ఏర్పాటు చేయించి… ముళ్లను, రాళ్లను, ఎముక్కల్ని వేరు చేయించి, దుమ్మును అనగకొట్టి, ప్రేక్షకులు కూర్చుని చూడుటకు వసతులను, పలు విధములైన ఇండ్లను, మనులతో అలంకరించిన మంచెలను సిద్ధం చేయించాడు. పూలమాలతో అలంకరించి అన్ని దిక్కులలో పూజలు జరిపించాడు. రంగస్థలంలో సుందరంగా సిద్ధం చేయించాడు. పంచాంగం ప్రకారం చక్కటి శుభ ముహూర్తము రోజున ఈ రంగస్థలంను సిద్ధపరిచి శస్త్రాస్త్ర ప్రదర్శన కొరకై ఏర్పాటు చేశాడు. ఆ ముహూర్తం రోజున ధృతరాష్ట్రుడు ముందు నడుస్తూ… వెనుక గంధారి దేవి… వంద మంది భార్యలతో… పలు విధములైన అలంకరణతో ఎక్కువ మంది స్త్రీలతో వచ్చి వేలాడే కడమి మొగ్గలవలె పెద్దవైన ముత్యాలతో కూర్చిన దండలతో చూడముచ్చటైన మరకత వజ్ర వైడూర్య పద్మ రాగ ప్రవాల కాంతుల కలయికతో అపూర్వమైన ఇంద్రధనస్సు అందాన్ని మించినది మనోహరమైనది బంగారుతో నిర్మించబడినదియైన ఇంటిలో ‘కుమారాస్త్ర విద్యా ప్రదర్శనను’ లోపల కూర్చొని చూడటానికి నిర్మించిన ఇంటిలో ఉన్నారు.
తామర పువ్వుల వంటి కన్నులతో కుంతి తేదీ తన కుమారుల విద్య నైపుణ్యాన్ని చూడాలన్న కుతూహలంతో ధృతరాష్ట్రుడి భార్యయైన గంధారి ప్రక్కన సంతోషంగా కూర్చున్నది. వ్యాస మహర్షిని, కల బ్రాహ్మణ సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమ దత్తుడు ప్రముఖ గురు బంధుమిత్రుల సమూహం అపరిమితమైన మంత్రి సామంత మండలాధిపతులు నాయకులు ఉన్నారు. ప్రారంభ విజయభీరులు మ్రోగాయి. ముఖ్య లతోపాటు ఈ విద్య చూడ వచ్చిన వారిలో క్షత్రియ వైశ్య క్షుద్రతి జాతి జనులు కూడా హాజరయ్యారు. ఇక కళా ప్రదర్శన ప్రారంభమైంది.
ద్రోణాచార్యుడి రూపం: ఆ సమయంలో ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రములతో సొమ్ములతో, పూలదండలతో, గంధంతో, జందెంతో, నిరసన వెంట్రుకలతో, ప్రకాశిస్తున్న మీసంతో రంగస్థలం మధ్యలో తన కుమారుడైన అశ్వత్థాముడితో కూడా వచ్చి మేఘాలు వీడి నిర్మలమైన ఆకాశమధ్యంలో అంగారక గ్రహ సహితుడై ప్రకాశించే సూర్యుని వలె ఉన్నాడు. ధనుర్విద్యకు భాస్కరుడైన ద్రోణాచార్యుడు మరియు అశ్వత్థామలు రెండు గ్రహాల వలె తేజస్విలుగా ఉన్నారు.
Also read: All degree 1st sem lessons – click here
కౌరవుల మరియు పాండవుల రూపం: కౌరవులు మరియు పాండవులు అల్లెత్రాటి దెబ్బ తగలకుండా ఉడుము తోలుతో కొట్టిన కవచములను, వేళ్ళకు తొడుగుకున్న వాళ్లు, బాణాలు నిండుగా ఉండే అమ్ముల పొదులు కలవాళ్ళు, గొప్ప దనసులు కవచాలు ధరించిన వాళ్ళు, ఉన్నతమైన గుణముల చేత రాణించేవాళ్లు. పాండవులు & కౌరవులు ద్రోణాచార్యుడి వెనుక ధర్మరాజు ప్రక్కన వయ క్రమాన్ని బట్టి వరుసగా రంగ మధ్యలో నిలుచున్నారు. ఎర్రని గంధమును దేహమునకు పూసుకొని, ఎర్రని పూలదండలు, ఎర్రని వస్త్రములు, సొమ్ములు ధరించి ఎర్ర జెండాలు చేతపట్టుకొని వీరు రంగస్థలంలో నిలుచున్నారు.
కౌరవుల మరియు పాండవుల విద్యా ప్రదర్శన: పాండవులు మరియు కౌరవులు తాము నేర్చుకున్న విద్యా విన్యాసాలతో… తమ పేర్లు పొందిన తమ పేర్లు పొదిగిన బాణములను వేసి, గుర్రములను మదపుటేనుగలను రథములను అధిరోహించడంలో పొందిన నైపుణ్యాన్ని, ఈట వేయుటలో, ఆయుధములను ప్రయోగించడంలో పొందిన తమ నైపుణ్య ప్రదర్శనను ప్రజలు చూసి కొనియాడసాగారు.
భీముడు మరియు దుర్యోధనుడు: పరాక్రమముగల భీముడు మరియు దుర్యోధనుడు మహా క్రోధముతో ఒకే శిఖరం పై ఉన్న మిక్కిలి ఎత్తైన పర్వతాల జంట వలె ఒకరినొకరు తాకి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు వలయాకార పద్ధతిలో తిరుగుతూ తమ యుద్ద నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భూకంపం వచ్చినట్లుగా ఆకాశం బద్దలయ్యేటట్టుగా వీరి తాకిడి భయంకర రూపంతో రాబోయే కురు పాండవ సంగ్రాన్ని సూచించే విధంగా ఉంది.
ఈ పోటీని చూసే ప్రజలు పక్షపాతంతో కోపా వేషాలు పెంచుకొని ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉన్నారు. దీనితో విద్యాప్రదర్శన భంగం అవుతుంది. విద్యా ప్రదర్శన భంగం అవుతుందేమో అని ద్రోణాచార్యుడు అశ్వత్థాముడికి పంపి మరుగుతున్న ప్రజల మాట మాటలను మానిపించి ‘నా ప్రియ శిష్యుడైన అర్జునుడి తనుర్విద్యా నైపుణ్యాన్ని చూడండి అని ద్రోణాచార్యుడు ప్రకటించాడు.

అర్జునుడి విద్యా ప్రదర్శన: అర్జునుడు మనోహరమైన వింత రంగుల కవచాన్ని ధరించి శ్రేష్టమైన తన హస్తానికి అందం ఇచ్చిన ఎత్తైన ధనస్సును ధరించి… అమ్ముల పొదిని కట్టుకొని జనులందరూ చూస్తూ ఉండగా ఇంద్రధనస్సుతో మెరుపు కాంతితో కూడిన మేఘమా! అన్నట్లుగా అందంగా రంగస్థలం మధ్యలో నిలిచాడు. ధనుర్ధరుడు అయిన అర్జునుడిని చూచి ప్రజలు అమితాశ్చర్యముతో ప్రజలు తమలో తాము – నరుడు, ఇంద్రతనయుడు, శ్రీకృష్ణుడి స్నేహితుడు అని పొగిడారు. ఇది విన్న కుంతీదేవి అంతులేని ఆనందంతో విప్పారిన కళ్ళతో తన సుపుత్రుడైన అర్జునుడిని రాజకుమారుల సమూహంలో చూచి సంతోషించింది. కన్నుల నుండి ఆనందభాష్పములు బయటికి వచ్చాయి. ప్రజల నుండి పొగడ్తలు పైకి లేచి ఆకాశాన్ని బద్దలు చేశాయి. ఆ మహాద్వని విని ధృతరాష్ట్రుడు భయపడి, ఇదేమి సంతోషమని? విదురుడిని అడగగా… విదరుడు అర్జునుడి యొక్క ప్రదర్శన వైవిధ్యం గురించి చెప్పాడు. ఓ రాజా! గొప్ప భుజాలుకలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడైన అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనను ప్రారంభించంగా ఎడతెరిపి లేకుండా ప్రజలు ప్రశంసిస్తున్నారు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కురుపాండవుల శక్తులను చూడలేకపోయినా వినగలిగాను అని చెవులు ఉన్న ఫలాన్ని పొందాను అని అన్నాడు. కుంతీ అనే అరణీలో పుట్టిన అగ్నులు మూడు. వారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తమ గొప్ప కాంతితో నా వంశం యొక్క పాపాన్ని పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించి వేయగలవు అని ధృతరాష్ట్రుడు పొగుడుతూ ఉండగా… అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో వివిధ గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించి నిపుణత గల తన విద్య అద్భుతంగా ప్రదర్శించడానికి ఆసక్తి చూపించాడు. అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండగా అర్జునుడు ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైన అగ్ని, వారణాస్త్రంతో వారింప సాధ్యము గాని నీటిని, వాయవ్యస్త్రం చేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రం చేత మహా మేఘ సమూహాన్ని పుట్టించాడు. పరుగెతుతున్న సింహము పెద్దపల్లి పంది నోళ్ళల్లో ఒక్కొక్క బాణాన్ని వేసి, ఈ విధంగా అస్త్ర విద్య విచిత్రాలను ప్రదర్శించి తమ నైపుణ్యాన్ని చూపించాడు అర్జునుడు.

కర్ణుడి విద్యా ప్రదర్శన: అయితే కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింప పూనుకొని రంగ ద్వారంలో నిలిచి భుజం చరిచాడు. ప్రజలు భయంపోయారు. పాండవులు ఏమో ద్రోణాచార్యుని దగ్గరకు చేరారు. దుర్యోధనుని తమ్ముళ్లంతా దుర్యోధన చుట్టు చేరారు. ఈ కర్ణుడు ఎంతో ఎత్తయినవాడు, సహజ కవచ కుండాలాలతో చాలా ఎక్కువగా ప్రకాశించేవాడు, బాల సూర్యుడిని పోలినవాడు, ధనస్సును ధరించిన వాడు, మొలలో భయంకరమైన కత్తిని పెట్టుకున్నవాడు, శౌర్యమే అలంకారముగా కలిగినవాడు. కర్ణుడు రంగస్థలంలోనికి వచ్చి గంభీరంగా మాట్లాడుతూ… అర్జునుడిని అడ్డగించి నీవు పెద్ద నేర్పరివి కావు… మాకు కూడా ఈ విద్యలు వచ్చు… సామాన్య జనులు కూడా వీటిని చేయవచ్చు అంటూ మాట్లాడాడు. కర్ణుడి మాటలు ప్రజలకు ఆశ్చర్యాన్ని… అర్జునుడికి కోపాన్ని సిగ్గును… దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాయి.
అప్పుడు ద్రోణుడు అనుమతించగా కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్రవిద్య విశేషాలన్నీ అతి సులభంగా చూపాడు. అది చూచి దుర్యోధనుడు మరియు తన తమ్ముళ్లు కర్ణుడిన కౌగిలించుకొని ‘నాతో చిలిమి చేసి, నాకు బంధువులకు మేలుకూర్చి నా రాజ్య భోగాలు నీవు కూడా అనుభవించమని’ అన్నాడు. కర్ణుడు సరే అని అతనితో స్నేహం చేశాడు. నీవు చూస్తూ ఉండగా అర్జునుడితో ద్వంద యుద్ధం చేయాలని అన్నాడు. అప్పుడు కౌరవుల మధ్య ఉండే ఆ కర్ణుని చూచి అర్జునుడు ఇట్లా అన్నాడు:
అర్జునుడి మాటలు: పిలుపు లేకుండానే సభలకు బల గర్వంతో వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడే పాపాత్ములు పోయే లోకానికి పోవాలనుకుని ఈ మాటలు మాట్లాడుతున్నావ్.
అర్జునుడి మాటలకు కర్ణుడి స్పందన: బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మాని పదునైన బాణాలతో మాట్లాడుము. ఈ రంగ భూమి అస్త్ర విద్యావేత్తలందరికి సమానం కాకుండా వీరికి మాత్రమే ప్రవేశం ఉంది వారికి లేదు అని ఏమైనా విచారించవలసింది ఉందా? అని కర్ణుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో అర్జునుడితో ద్వంతయుద్ధం చేయడానికి సిద్ధమై రంగస్థలం మధ్యలో ఉండగా గురువుల చేత సోదరుల చేత ప్రేరేపించబడిన వాడై అర్జునుడు ప్రళయ కాలాగ్ని వలె ఎదిరించి నిలిచాడు.

0 Comments