Site icon edutension.com

Degree 1st Sem Telugu Grammar – Sandhulu

సంధులు రెండు రకాలు ఉంటాయి.
1. సంస్కృత సంధులు
2. తెలుగు సంధులు

1. సంస్కృత సంధులు

రెండు పదాలు ఒకవేళ సంస్కృత బాషకు సంబంధించినవైతే వాటిని సంస్కృత సంధులు అంటారు.

1. సవర్ణదీర్ఘ సంధి: 

సూత్రం:  అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశమగును.
  
ఉదా: 
1. దేవాలయము = దేవ + ఆలయము 
2. మునీశ్వర = ముని + ఈశ్వర
3. మునీంద్ర = ముని + ఇంద్ర

2. గుణ సంధి:

సూత్రం: ‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరంబైతే క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఏకాదేశమవును.
(అ + ఇ = ఏ 
అ + ఉ = ఓ 
అ + ఋ = ఆర్)
ఉదా:
1. దేవేంద్ర = దేవ+ఇంద్ర
2. రాజర్షి = రాజ+ఋషి
3. భరతోత్పత్తి = భరత +ఉత్పత్తి

3. వృద్ధి సంధి

సూత్రం: ‘అ’ కారమునకు ఏ, ఐ లు పరంబైతే ‘ఐ’ కారముగాను… 
‘అ’ కారమునకు ‘ఓ, ఔ పరంబైనప్పుడు ‘ఔ’ కారముగాను ఏకాదేశమగును.
ఉదా:
1. ఏకైక = ఏక+ఏక 
2. మహౌషధము = మహా+ఔషధము

4. యణాదేశ సంధి

సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరంబైతే క్రమముగా య, వ, ర లుగా ఏకాదేశమగును.
ఉదా:
1. గుర్వాజ్ఞ = గురు+ఆజ్ఞ
2. పిత్రంశ = పితృ+అంశ
Exit mobile version