Lesson: 12. అధ్యయనం
అధ్యయనం వలన మేధాశక్తి వికసిస్తుంది. ప్రజల ప్రయత్నాలకు జ్ఞానాన్ని జోడిస్తే మరింత అభివృద్ధి చెందుతారు. అందువలన అధ్యయనం అనేది ఎంతో ప్రాముఖ్యము. జ్ఞానాన్ని విస్తరింప చేయడానికి వాస్తవికతను తెలియజేయుటకు అధ్యయనం తోడ్పడుతుంది. అధ్యయనం అనేది కేవలం ఒక గుంపుకు చెందినది కాదు. అధ్యయనం అనేది ముఖ్యముగా విద్యార్థికి ఉపాధ్యాయులకు అవసరమవుతుంది. మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి మానవుడే. విద్య అభ్యాసం నుండి జ్ఞానాన్ని పొందగలిగే సామర్థ్యం మానవునికి మాత్రమే ఉంది.
పాఠకుడు తనకు నచ్చిన రచనను లేదా నవలను చదివి ఆనందిస్తే… విశ్లేషకుడు లేదా పరిశోధకుడు మాత్రం అధ్యయనం చేసే సందర్భంలో నూతన విషయాలను తెలుసుకున్నప్పుడు ఆనందం చెందుతాడు. ఒక ప్రాజెక్టును చెయ్యాలి అని ప్రారంభిస్తే ఖచ్చితంగా అధ్యయనం అనేది అవసరం. దాని కొరకు ఎంతో మంది సలహాలు తీసుకోవాలి. ఎంతమందో విజ్ఞుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. వాటి మీద అవగాహన ఉన్న వారిని తెలుసుకోవాలి. వాటిపైన ప్రయోగాలు చేయాలి అప్పుడే అధ్యయనం సాధ్యపడుతుంది
అధ్యయనం చేయాలంటే ముందుగా ప్రేరణ అనేది అవసరము. తాను ఎన్నుకున్న విషయాన్ని సాధించేవరకు తన అధ్యయనం ఆపకూడదు. అధ్యయనంలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు వస్తూ ఉంటాయి. వాటిని దాటి విజయం సాధించడానికి ప్రయత్నించాలి. ప్రతి కోణంలో నుండి అధ్యయనం చేసే విషయాన్ని చూడగలగాలి. విషయాన్ని బాగా వివరణాత్మకముగా అర్థం చేసుకొని ముఖ్య సమాచారాన్ని పెన్నుతో పేపర్ మీద వ్రాయాలి.
1. పర్యవేక్షకుని మాట
2. శీర్షిక
3. పూర్వపు అధ్యయనాలు
4. పదసేకరణ, పదజాలంపై – అధ్యయనం
5. బృందములో ఉన్న సభ్యులు – వారు సేకరించిన పదాలు
6. అనుభవాలు – అవగాహన
పైన చెప్పబడిన రీతిలో ప్రాజెక్టును పూర్తి చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వ్రాయడాన్నే అధ్యయన ప్రణాళిక అని అంటారు.
0 replies on “అధ్యయనం – Adhyayanam Lesson – Degree 6th sem telugu material”
Anonymous 06/12/2023 at 2:10 AM
Tq sir